Bigg Boss 5 : ఈసారి టఫ్ అండ్ ఛాలెంజింగ్‌గా అనిపించింది – ‘కింగ్’ నాగార్జున..
ముచ్చటగా మూడోసారి ఈ షో కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జున తన అనుభవాలను మీడియాతో షేర్ చేసుకున్నారు..
Bigg Boss 5: తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ ప్రఖ్యాత రియాలిటీ షో ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 5 మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతుంది. వరుసగా మూడోసారి ‘కింగ్’ నాగార్జున హోస్ట్ చెయ్యబోతున్న ‘బిగ్ బాస్ 5’ గ్రాండ్ ప్రీమియర్ సెప్టెంబర్ 5 ఆదివారం సాయంత్రం 6 గంటలకు మొదలుకానుంది.
Bigg Boss 5 : ‘బోర్‌డమ్‌కి గుడ్‌బై.. వచ్చేస్తుంది బిగ్ బాస్ సీజన్ ఫైవ్’..
‘బిగ్ బాస్’ ఫార్మాట్, గ్లోబల్ స్థాయిలో సక్సెస్ఫుల్ నాన్ ఫిక్షన్ ఫార్మాట్లలో ఒకటి. ఇండియాలో 7 భాషల్లో 37 సీజన్లు విజయంతంగా పూర్తి చేసుకుంది. దాదాపు మూడు నెలలకు పైగా ప్రేక్షకులను హౌస్‌లోకి తీసుకెళ్లి ఎంటర్టైన్ చెయ్యబోతుంది ‘బిగ్ బాస్’ సీజన్ 5. ముచ్చటగా మూడోసారి ఈ షో కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జున తన అనుభవాలను మీడియాతో షేర్ చేసుకున్నారు.
Bigg Boss 5 : అవన్నీ రూమర్స్.. వచ్చేస్తున్నాడు ‘బిగ్ బాస్’..
‘‘ఈసారి ఆడియెన్స్‌కి మోర్ ఫన్ మోర్ ఎంటర్టైన్మెంట్ అందించడానికి.. నేను, మా టీం గతకొద్ది నెలలుగా కష్టపడుతున్నాం. కొత్త సీజన్‌కి హోస్ట్ చెయ్యడమనేది చాలా టఫ్ అండ్ ఛాలెంజింగ్‌గా అనిపించింది. ‘బిగ్ బాస్ 5’ తో ఫ్యాన్స్, ఆడియెన్స్ అందరిలో ఆనందం నింపడానికి ప్రయత్నించాం. ఒక ఆర్టిస్టుగా కంటెస్టెంట్స్ రియల్ ఫీలింగ్స్‌ని వ్యూవర్స్‌కి చూపించగలిగేలా హోస్ట్ చెయ్యడం హ్యాపీగా ఉంది. ‘బిగ్ బాస్ సీజన్ 5’ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. తప్పకుండా ఫ్యామిలీలో ప్రతి మెంబర్ని ఈ షో ఆకట్టుకుంటుంది’’ అన్నారు.
స్టార్‌మాలో, బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 ఫస్ట్ ఎపిసోడ్ సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ అవుతుంది. తర్వాత 15 వారాల పాటు సోమవారం – శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు మరియు శని – ఆదివారాలలో రాత్రి 9 గంటలకు ప్రసారమవుతుంది.
స్టార్‌మాలో, బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 ఫస్ట్ ఎపిసోడ్ సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ అవుతుంది. తర్వాత 15 వారాల పాటు సోమవారం – శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు మరియు శని – ఆదివారాలలో రాత్రి 9 గంటలకు ప్రసారమవుతుంది.