Jio True 5G Services : మన హైదరాబాద్‌కు జియో ట్రూ 5G వచ్చేస్తోంది.. మీ 5G ఫోన్లు సిద్ధం చేసుకోండి.. జియో వెల్‌కమ్ ఆఫర్‌తో 1Gbps అన్‌లిమిటెడ్ డేటా పొందవచ్చు..!

Jio True 5G Services : ప్రముఖ దేశీయ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో (Reliance Jio) 2023 సంవత్సరం చివరి నాటికి భారత్ అంతటా 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించేందుకు రెడీగా ఉంది. ప్రస్తుతం Jio True 5G సర్వీసులను ముందుగా 6 నగరాల్లో ట్రయల్‌ను ప్రారంభించింది.

Jio True 5G Services : మన హైదరాబాద్‌కు జియో ట్రూ 5G వచ్చేస్తోంది.. మీ 5G ఫోన్లు సిద్ధం చేసుకోండి.. జియో వెల్‌కమ్ ఆఫర్‌తో 1Gbps అన్‌లిమిటెడ్ డేటా పొందవచ్చు..!

Jio True 5G to Be Available in Bengaluru and Hyderabad From 10th Nov 2022

Jio True 5G Services : ప్రముఖ దేశీయ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో (Reliance Jio) 2023 సంవత్సరం చివరి నాటికి భారత్ అంతటా 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించేందుకు రెడీగా ఉంది. ప్రస్తుతం Jio True 5G సర్వీసులను ముందుగా 6 నగరాల్లో ట్రయల్‌ను ప్రారంభించింది. అందులో ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, వారణాసి, నాథ్ ద్వారా ఉన్నాయి. జియో ట్రూ 5G సర్వీసులను విజయవంతంగా లాంచ్ చేసిన అనంతరం రిలయన్స్ జియో మరిన్ని నగరాల్లో Jio True-5G సర్వీసులను విస్తరిస్తోంది. అందులో భాగంగా జియో ట్రూ 5G సర్వీసులను మరో రెండు నగరాల్లోనూ విస్తరించనుంది.

ఇప్పుడు రిలయన్స్ జియో Jio True 5G సర్వీసులను ఢిల్లీ, వారణాసి, నాగ్‌పూర్, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, చెన్నై, సిలిగురి పేర్లతో 8 నగరాల్లో అందుబాటులో తీసుకొస్తోంది. ఈ జియో ట్రూ సర్వీసులను పొందాలంటే జియో యూజర్లకు జియో వెల్ కమ్ ఆఫర్ (Jio Welcome Offer) పొందాలి. అప్పుడు మాత్రమే జియో ట్రూ సర్వీసులను పొందేందుకు వీలుంటుంది. Jio అధునాతన True-5G సర్వీసులను దశల వారీగా అందిస్తోంది. JioTrue5G ఇప్పటికే ఆరు నగరాల్లో లక్షల మంది యూజర్లు వినియోగించుకుంటున్నారు.

Jio True 5G to Be Available in Bengaluru and Hyderabad From 10th Nov 2022

Jio True 5G to Be Available in Bengaluru and Hyderabad From 10th Nov 2022

నవంబర్ 10 నుంచి హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో జియో ట్రూ 5G సర్వీసులు :

జియో యూజర్ల నుంచి సానుకూల స్పందన రావడంతో రాబోయే రోజుల్లో మరిన్ని నగరాలకు జియో ట్రూ 5G సర్వీసులను విస్తరించాలని భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత అధునాతన 5G నెట్‌వర్క్‌ను అందించేందుకు జియో ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం జియో ట్రూ 5G సర్వీసులను హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో విస్తరిస్తోంది. నవంబర్ 15 నుంచి జియో ట్రూ సర్వీసులు ఈ రెండు నగరాల్లో అందుబాటులోకి రానున్నాయి. అయితే, Jio వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లలో 500 Mbps నుంచి 1 Gbps మధ్య ఎక్కడైనా హైస్పీడ్ ఇంటర్నెట్ పొందవచ్చు. ఎక్కువ డేటాను వాడే వినియోగదారులే లక్ష్యంగా Jio True-5G సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Jio True 5G to Be Available in Bengaluru and Hyderabad From 10th Nov 2022

Jio True 5G to Be Available in Bengaluru and Hyderabad From 10th Nov 2022

ఈ 5G సర్వీసులను మూడు రెట్లు వేగంతో అందించే దేశంలోనే ఏకైక రియల్ 5G నెట్‌వర్క్‌గా జియో అవతరించింది. 4G నెట్‌వర్క్‌పై జీరో డిపెండెన్సీతో అడ్వాన్స్‌డ్ 5G నెట్‌వర్క్‌తో స్టాండ్-ఏలోన్ 5G ఆర్కిటెక్చర్ ద్వారా అందిస్తుంది. 700 MHz, 3500 MHz, 26 GHz బ్యాండ్‌లలో అతిపెద్ద 5G స్పెక్ట్రమ్ కలిగి ఉంది. క్యారియర్ అగ్రిగేషన్ అనే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ 5G ఫ్రీక్వెన్సీలను బలమైన ‘డేటా హైవే’గా మార్చే క్యారియర్ అగ్రిగేషన్ పనిచేస్తుంది. నవంబర్ 10 నుంచి బెంగళూరు, హైదరాబాద్‌లోని జియో యూజర్లు అదనపు ఖర్చు లేకుండా 1 Gbps+ వేగంతో అన్‌లిమిటెడ్ డేటాను Jio వెల్‌కమ్ ఆఫర్‌ ద్వారా పొందవచ్చు.

జియో 5G స్పీడ్, ప్లాన్ల ధర ఎంతంటే? :
రిలయన్స్ టెలికాం కంపెనీ అన్ని కొత్త టవర్లను మెట్రోపాలిటన్ నగరాల నుంచి ప్రారంభించి చిన్న నగరాలు, పట్టణాల తరువాత మారుమూల గ్రామాలలో ఏర్పాటు చేయనుంది. Jio 5G పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ ప్లాన్‌లు రూ . 239/- నుంచి ప్రారంభం కానున్నాయి. అలాగే 1 Gbps వరకు ఇంటర్నెట్ స్పీడ్ పొందవచ్చు. భారత మార్కెట్లో 5G బ్యాండ్‌లు n28,n5,n3,n78, n258 వివిధ బ్యాండ్‌విడ్త్‌లలో పని చేస్తున్నాయి. ట్రయల్స్ ప్రకారం.. Jio 5G ప్లాన్‌ల స్పీడ్ 42.02 Mbps, 485.22 Mbps, 513.76 Mbps వరకు నమోదు అయ్యాయి.

Jio True 5G to Be Available in Bengaluru and Hyderabad From 10th Nov 2022

Jio True 5G to Be Available in Bengaluru and Hyderabad From 10th Nov 2022

మీరు మెట్రోపాలిటన్ నగరంలో నివసిస్తుంటే.. మీరు ఎప్పుడైనా Jio 5G నెట్‌వర్క్‌ని ఉపయోగించవచ్చు. కానీ, మీరు చిన్న నగరం లేదా పట్టణంలో నివసిస్తున్నట్లయితే.. మీరు రాబోయే 2023 సంవత్సరం చివరి వరకు వేచి చూడాల్సిందే.. జియో 5G ప్రాంతాల వారీగా మొదట అహ్మదాబాద్, చండీగఢ్, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, హైదరాబాద్, హైదరాబాద్, జామ్‌నగర్, కోల్‌కతా, లక్నో, ముంబై, పూణేలలో అందుబాటులో ఉంటుంది. Jio 5G CEO jio.com అనే అధికారిక వెబ్‌సైట్‌లో ప్రాంతీయల వారీగా ప్రణాళికను ప్రకటించింది.

మరోవైపు.. భారత్‌లో టాప్-స్పీడ్ ఇంటర్నెట్ స్పీడ్‌ను పొందాలంటే.. 5G నెట్‌వర్క్ సపోర్టింగ్ ఫోన్‌లలో మాత్రమే 5G అందుబాటులో ఉంటుంది. Realme, Lava వంటి కొన్ని భారతీయ బ్రాండ్‌లు రూ.10,000లోపు కొన్ని ప్రీమియం ఫోన్‌లను లాంచ్ చేసేందుకు రెడీగా ఉన్నాయి. జియో 5G ప్లాన్ దేశమంతటా అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పడుతుంది. చివరికి, రాబోయే సంవత్సరంలో ప్రతి ఒక్కరూ హై క్వాలిటీ ఇంటర్నెట్ స్పీడ్‌ను పొందవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Jio 5G vs Airtel 5G : జియో 5G vs ఎయిర్‌టెల్ 5G నెట్‌వర్క్.. ఏయే స్మార్ట్‌ఫోన్లలో సపోర్టు చేస్తుంది? ఇందులో ఏది బెటర్ అంటే? పూర్తి వివరాలు మీకోసం..!