Jio, Voda Idea : షాక్ ఇస్తున్న కస్టమర్లు.. బైబై చెప్పేస్తున్నారు

టెలికాం అందించే ప్లాన్లు దాదాపు ఒకే ధర ఉండడం, కొత్త ప్లాన్లు లేకపోవడం..ఇలా ఇతరత్రా కారణాలతో టెలికాం సంస్థలకు కస్టమర్లు షాక్ ఇస్తున్నారు. ఫిబ్రవరి నెలలో సుమారు 37 లక్షల మంది యూజర్లు

Jio, Voda Idea : షాక్ ఇస్తున్న కస్టమర్లు.. బైబై చెప్పేస్తున్నారు

Reliance Jio

Trai Data : టెలికాం రంగంలో అతిపెద్ద సంస్థ ఏదీ అంటే ఠక్కున జియో అని చెప్పేస్తారు. ఈ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి.. ప్రకపంనలు సృష్టించింది. అప్పటి వరకు పెద్ద పెద్ద సంస్థలుగా ఉన్న వివిధ కంపెనీలు కుదేలైపోయాయి. అప్పటి వరకు ఆయా కంపెనీలకు కస్టమర్లుగా కొనసాగిన వినియోగదారులు జియోకు జై కొట్టారు. దీంతో అనూహ్యంగా జియోకు కస్టమర్లు పెరిగిపోయాయి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోతోంది. జై కొట్టిన కస్టమర్లు ఇప్పుడు బై చెబుతున్నారు. జియోకి కూడా కస్టమర్లు పెద్ద షాక్ లు ఇస్తున్నారు. ఇతర కంపెనీల వైపు వెళ్లిపోతుండడంతో జియో తల్లడిల్లుతోంది.

Read More : Revanth Reddy: కేసీఆర్ బాధ్యతా రాహిత్యంతో రైతులకు రూ. 3000-4000 కోట్లు నష్టం వాటిల్లింది: కేంద్రానికి రేవంత్ లేఖ

అన్నీ టెలికాం అందించే ప్లాన్లు దాదాపు ఒకే ధర ఉండడం, కొత్త ప్లాన్లు లేకపోవడం..ఇలా ఇతరత్రా కారణాలతో టెలికాం సంస్థలకు కస్టమర్లు షాక్ ఇస్తున్నారు. ఫిబ్రవరి నెలలో సుమారు 37 లక్షల మంది యూజర్లు జియోకు రాం రాం చెప్పారు. ఇది టెలికాం రెగ్యులేటరీ అథార్టీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) పేర్కొంది. ఇలా వరుసగా మూడోసారి కావడం గమనార్హం. అంతకముందు మరో రెండు నెలల్లో కూడా ఇలాగే భారీ సంఖ్యలో జియోకు యూజర్లు వీడ్కోలు పలికారు. జియో పరిస్థితి ఇలా ఉంటే.. భారతీ ఎయిర్ టెల్ కంపెనీ మాత్రం ఫుల్ ఖుష్ అవుతోంది. ఎందుకంటే కస్టమర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నారు. ఫిబ్రవరిలో తమ కస్టమర్లను పెంచుకుంది. ఏప్రిల్ నెలలో కొత్తగా సుమారు 16 లక్షల మంది కస్టమర్లు ఎయిర్ టెల్ సేవలు తీసుకున్నారని ట్రాయ్ వెల్లడించింది. వోడోఫోన్ ఐడియా కూడా 15.32 లక్షల మంది యూజర్లను కోల్పోయింది. బీఎస్ఎన్ఎల్ కూడా అదే పరిస్థితి ఉంది.