Renew Netflix Subscription : ఆన్‌లైన్ మోసాలతో జాగ్రత్త.. నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ రెన్యువల్ చేస్తామంటూ లక్ష కొట్టేసిన మోసగాళ్లు..!

Renew Netflix Subscription : ఆన్‌లైన్ మోసాలతో జాగ్రత్త.. ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరగాళ్లు అనేక మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.

Renew Netflix Subscription : ఆన్‌లైన్ మోసాలతో జాగ్రత్త.. నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ రెన్యువల్ చేస్తామంటూ లక్ష కొట్టేసిన మోసగాళ్లు..!

Man trying to renew Netflix subscription, loses 1 Lakh in online fraud

Renew Netflix Subscription : ఆన్‌లైన్ మోసాలతో జాగ్రత్త.. ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరగాళ్లు అనేక మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. లేటెస్టుగా సైబర్ చీటింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. 74 ఏళ్ల వ్యక్తి తన నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను రెన్యువల్ చేసేందుకు ప్రయత్నించి ఏకంగా లక్ష కోల్పోయాడు. స్కామర్‌లు మాల్‌వేర్ లింక్‌లను మెసేజ్‌ల ద్వారా పంపి ఈ నేరాలకు పాల్పడుతున్నారు. ఈసారి సైబర్ నేరగాళ్లు నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను రెన్యువల్ చేస్తామని చెప్పి ఆ వృద్ధుడిని మోసగించడానికి ప్రయత్నించారు. అందుకే మీకు ఇలాంటి ఈ-మెయిల్ లేదా మెసేజ్ వచ్చినప్పుడు ఒకటికి పదిసార్లు ధృవీకరించడం చాలా ముఖ్యమని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నివేదిక ప్రకారం.. ముంబైకి చెందిన వ్యక్తి తన బ్యాంక్ అకౌంట్ వివరాలను నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధులనే స్కామర్‌లతో షేర్ చేసుకున్నాడు. దాంతో అతడి బ్యాంకు అకౌంట్ నుంచి లక్షకు పైగా దొంగిలించారు. నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధిగా నమ్మించిన స్కామర్‌లు, అతని నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను రెన్యువల్ చేస్తామని చెప్పి.. అతని బ్యాంక్ అకౌంట్ వివరాలను షేర్ చేయమని అడిగి మోసగించారు. వాస్తవానికి ఆ బాధితుడు రూ.499 చెల్లించకపోవడంతో అతని సబ్‌స్క్రిప్షన్ హోల్డ్‌లో ఉన్నట్లు సమాచారం.

ఆ 74 ఏళ్ల బాధితుడు సైబర్ నేరగాళ్ల నుంచి తనకు వచ్చిన ఈ-మెయిల్ నెట్‌ఫ్లిక్స్ నుండి వచ్చినదని నమ్మాడు. OTT ప్లాట్‌ఫారమ్ ద్వారా యూజర్లకు పంపిన కమ్యూనికేషన్ ఈ-మెయిల్‌లతో ఉండటంతో అతడు నిజమని నమ్మాడు. ఆ తర్వాత తాను మోసపోయినట్టు గుర్తించిన అతడు నవంబర్ 29న జుహు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎఫ్‌ఐఆర్ నమోదైంది. రూ. 499 చెల్లింపు చేసేందుకు మోసపూరిత ఈ-మెయిల్ లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా తాను మోసపోయినట్టుగా వెల్లడించాడు. ఆ లింకు క్లిక్ చేసిన తర్వాత తన క్రెడిట్ కార్డ్ వివరాలన్నింటినీ అందులో ఎంటర్ చేశాడు.

Man trying to renew Netflix subscription, loses 1 Lakh in online fraud

Man trying to renew Netflix subscription, loses 1 Lakh in online fraud

Read Also : Netflix Users : మీ నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ ఎవరైనా ఫ్రీగా వాడుతున్నారా? ఇలా ఈజీగా వారిని అకౌంట్ నుంచి తొలగించవచ్చు..!

అలా అతడి అకౌంట్ నుంచి 1.22 లక్షల వరకు మొబైల్ ఫోన్‌లో వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP) కూడా యాక్సస్ చేసినట్టు పోలీసు అధికారి వెల్లడించారు. తనకు వచ్చిన ఈ-మెయిల్‌లో ఓటీపీని కూడా షేర్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కేవలం రూ.499 చెల్లించాలని ఈ-మెయిల్‌లో పేర్కొన్నప్పటికీ, OTPని రూ. లక్షకు పంపారు. కానీ, రూ. 1.22 లక్షలు చెల్లించకుంటే.. 8 నొక్కాలని బ్యాంకు నుంచి కాల్ వచ్చినప్పుడే తాను మోసపోయానని బాధితుడు గ్రహించాడు.

వాస్తవానికి Netflix లేదా ఇతర కంపెనీ నుంచి ఫోన్ కాల్ లేదా మెసేజ్ వచ్చినప్పుడు నుంచి మీరు మీ OTPని ఎవరితోనూ షేర్ చేయరాదు.ముందుగా, మీ OTPని మెయిల్ ద్వారా షేర్ చేయమని ఏ కంపెనీ మిమ్మల్ని అడగదని గుర్తించాలి. మీరు అలాంటి మెసేజ్‌లను స్వీకరిస్తే.. వాటిని వెంటనే డిలీట్ చేయాలి. ఆపై కంపెనీల అధికారిక సోషల్ మీడియా అకౌంట్లలో చెక్ చేయడం మంచిది. స్కామర్‌లు తరచుగా అమాయకులనే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతుంటారు.

ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానం లేని వ్యక్తులే వీరి టార్గెట్.. కానీ, మెసేజ్‌లను నమ్మించేలా చేస్తారు. తద్వారా బాగా తెలిసిన వ్యక్తి కూడా సైబర్ నేరగాళ్లు వలలో పడవచ్చు. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును భద్రపరచడానికి, ఎల్లప్పుడూ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం మంచిది. ఈ-మెయిల్‌ల ద్వారా బ్యాంక్ అకౌంట్ నంబర్, ఆధార్ వంటి మీ వ్యక్తిగత వివరాలను ఎప్పుడూ షేర్ చేయరాదు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Netflix Users : మీ నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ ఎవరైనా ఫ్రీగా వాడుతున్నారా? ఇలా ఈజీగా వారిని అకౌంట్ నుంచి తొలగించవచ్చు..!