అంగారక గ్రహం నివాసయోగ్యమేనా.. దేశాలన్నీ ఎందుకు ఫోకస్ పెట్టాయి?

అంగారక గ్రహం నివాసయోగ్యమేనా.. దేశాలన్నీ ఎందుకు ఫోకస్ పెట్టాయి?

Mars isn’t resident for humans : ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు ! మార్స్ చుట్టూ రెండు.. మీదకు ఒకటి ! యూఏఈ, చైనా వాహన నౌకలు ఇలా చేరుకున్నాయో లేదో.. నాసా మార్స్ రోవర్ వెళ్లి ల్యాండ్ అయింది అక్కడ ! ఎందుకు ఈ గ్రహంపై ఇంతలా దృష్టి సారించారు. వరుస ప్రయోగాల వెనక కారణం ఏంటి ? నెలల వ్యవధిలో మూడు భారీ ప్రయోగాలు ఎందుకు ? ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు ప్రయోగాలు ! ఇప్పుడు నాసా ప్రయోగించిన మార్స్ రోవర్ ల్యాండ్ అయింది.

అంతకుముందే చైనా, యూఏఈ వాహననౌకలు వచ్చి చేరాయి. అసలు ఎందుకు వరుసగా ఇన్ని దేశాలు ఒకేసారి ప్రయోగాలు చేస్తున్నాయంటే.. దీని వెనక భారీ కారణమే ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గతేదాడి నెలల గ్యాప్‌లో అంగారక గ్రహంపైకి మూడు స్పేస్‌క్రాఫ్ట్‌లు ప్రయాణం ప్రారంభించాయి. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ అల్ అమల్‌, చైనా తియాన్వే 1 అనే అంతరిక్ష నౌకలతో పాటు.. ఇప్పుడు మార్స్ మీద ల్యాండ్ అయిన నాసా రోవర్ కూడా కొద్ది నెలల వ్యవధిలోనే ప్రయోగించారు.

అన్ని దేశాలూ ఎందుకు వరుసగా అంగారకుడిపైకి స్పేస్‌క్రాఫ్ట్‌లను ప్రయోగించాయంటే… ఇదే అనువైన కాలం! గ్రహగమన వ్యవస్థ ప్రకారం.. ప్రతీ రెండేళ్లకు ఒకసారి భూమి, అంగారకుడు అతి దగ్గర కక్ష్యల్లో ప్రయాణిస్తాయి. అంటే రెండు అత్యంత సమీపానికి వస్తాయి. ఈ దృగ్విషయం ఆరు నెలల కంటే తక్కువ సమయం ఉంటుంది. ఇప్పుడు ఇది అలాంటి సమయమే కనుక దేశాలన్నీ తమ క్రాఫ్ట్‌లను అంగారకుడిపైకి పంపాయి. 2020లో అలా జరిగింది. మళ్లీ 2022లోనే సమీపించేది! దీంతో అంగారకుడి మీదకు గతేదాడి వరుస ప్రయోగాలు నిర్వహించారు. ఈ మూడు ప్రయోగాలు కూడా వేర్వేరు కీలక విషయాలు తెలుసుకోనున్నాయి. రెండు నుంచి మూడేళ్లపాటు మార్స్ చుట్టూ, మార్స్ మీద మకాం వేసి గుట్టు విప్పేందుకు సిద్ధం అవుతున్నాయి.

అంగారకుడిపై నీటి జాడలు ఉన్నట్లు ఇంతకుముదు రోవర్స్ పంపిన చిత్రాల ఆధారంగా గుర్తించారు. ఆ నీరంతా ఏమైపోయింది. కారణాలు ఏంటి ? తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రహంపై జీవజాల ఉనికి! తెలుసుకుంటే మార్స్‌ మిషన్‌ సక్సెస్ అయినట్లే ! ఇప్పటికే మూడు దేశాలు పంపిన మూడు క్రాఫ్ట్‌లకు విభిన్న లక్ష్యాలున్నాయి. యూఏఈ క్రాఫ్ట్‌ అల్ అమన్‌ అంగారకుడిపై రెండేళ్లు ఉంటుంది. భూమి కక్ష్యలో ఉన్న వాతావరణ ఉపగ్రహాల్లా అరుణగ్రహంపై వాతావరణానికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తుంది. చైనా తియాన్వే 1 వదిలిపెట్టిన రోవర్.. మట్టి నమూనాలను విశ్లేషిస్తుంది. గ్రహ ఉపరితల చిత్రాలను తీసి పంపిస్తుంది. నాసా రోవర్ క్రేటర్ సరస్సులో దిగి జీవజాలానికి సంబంధించి కీలక విషయాలు విశ్లేషించనుంది.