Moto G42 : ట్రిపుల్ కెమెరాలతో మోటో కొత్త ఫోన్ .. ఫీచర్లు, ధర ఎంతంటే?

మోటరోలా కంపెనీ Moto G సిరీస్ నుంచి సరికొత్త ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చింది. అదే.. Moto G42 స్మార్ట్ ఫోన్. రూ. 15వేల లోపు కొత్త స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చింది.

Moto G42 : ట్రిపుల్ కెమెరాలతో మోటో కొత్త ఫోన్ .. ఫీచర్లు, ధర ఎంతంటే?

Moto G42 Launched In India, Features Snapdragon 680 Soc, 50mp Triple Camera Setup

Moto G42 : ప్రముఖ మోటరోలా కంపెనీ Moto G సిరీస్ నుంచి సరికొత్త ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చింది. అదే.. Moto G42 స్మార్ట్ ఫోన్. రూ. 15వేల లోపు కొత్త స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ G-సిరీస్‌లో Redmi Note 11, Realme 9i, Samsung Galaxy M13 ఉండగా.. రూ. 15,000లోపు ఇతర స్మార్ట్‌ఫోన్‌లకు పోటీగా Moto G42 భారత్ లో ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, ఇతర రిటైల్ స్టోర్‌ల ద్వారా ఈ కొత్త ఫోన్ కొనుగోలు చేసుకోవచ్చు. భారత్‌లో Moto G42 ధర, స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లకు సంబంధించి అన్ని వివరాలు అందుబాటులో ఉన్నాయి.

G42 స్పెసిఫికేషన్స్ :
Moto G42 అనేది స్నాప్‌డ్రాగన్ 680 SoCతో వచ్చిన బడ్జెట్ 4G స్మార్ట్‌ఫోన్. ఈ డివైజ్ 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజీ కాన్ఫిగరేషన్‌లో వచ్చింది. మైక్రో SD కార్డ్‌ ద్వారా 1TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు. వెనుక ప్యానెల్ ప్లాస్టిక్‌తో రూపొందించారు. బరువు 175 గ్రాములు ఉంటుంది. Motorola వాటర్ స్ప్లాష్‌ల నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఫోన్‌కు IP52 రేటింగ్‌ను అందించారు. డివైజ్ Full HD+ రిజల్యూషన్‌తో 6.4-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ప్రామాణిక 60Hz రిఫ్రెష్ రేట్, 20:9 కారక రేషియోతో వచ్చింది.

Moto G42 Launched In India, Features Snapdragon 680 Soc, 50mp Triple Camera Setup (1)

Moto G42 Launched In India, Features Snapdragon 680 Soc, 50mp Triple Camera Setup

ఫ్రంట్ కెమెరాకు టాప్ సెంటర్‌లో హోల్-పంచ్ కలిగి ఉంది. వెనుకవైపు Moto G42 కెమెరా, సెటప్‌లో f/1.8 ఎపర్చరుతో 50MP సెన్సార్ ఉంటుంది. 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మాక్రో సెన్సార్ కలిగి ఉంది. Motorola 8MP అల్ట్రావైడ్ కెమెరా డెప్త్ సెన్సార్‌గా రెట్టింపు అవుతుందని పేర్కొంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ చేయాలంటే ఫోన్‌లో 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. స్టీరియో స్పీకర్లు, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB టైప్-C పోర్ట్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 mAh బ్యాటరీతో వచ్చింది. కొలతలు 160.61 x 73.47 x 8.26 మిమీ ఉండగా.. Moto G42 4G ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ పై రన్ అవుతుంది.

భారత్‌లో Moto G42 ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో Moto G42 ధర రూ.13,999గా ఉంది. లాంచ్ ఆఫర్‌లలో భాగంగా, SBI కార్డ్ కస్టమర్‌లు రూ. 1,000 డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా ఈ ఫోన్ రూ.12,999కి కొనుగోలు చేయొచ్చు. రూ. 419 ప్లాన్‌పై రూ. 2,549 విలువైన రిలయన్స్ జియో బెనిఫిట్స్ అందిస్తోంది. Moto G42 అట్లాంటిక్ గ్రీన్, మెటాలిక్ రోజ్ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది.

Read Also : Moto G42 India : మోటో G42 లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు, ధర ఎంతంటే?