నెట్ ఫ్లిక్స్‌లో కొత్త టూల్.. పిల్లలు ఏం చూస్తున్నారో పేరంట్స్‌కు చెప్పేస్తుంది!

  • Published By: sreehari ,Published On : December 9, 2020 / 03:40 PM IST
నెట్ ఫ్లిక్స్‌లో కొత్త టూల్.. పిల్లలు ఏం చూస్తున్నారో పేరంట్స్‌కు చెప్పేస్తుంది!

Netflix Kids Activity Report: ప్రముఖ స్ట్రీమింగ్ సర్వీస్ నెట్ ఫ్లిక్స్ కొత్త టూల్ తీసుకొచ్చింది. ఈ టూల్‌ను ప్రత్యేకించి కిడ్స్ కోసం ప్రవేశపెట్టింది. పిల్లలు ఆన్ లైన్ లో ఏం చూస్తున్నారో పేరంట్స్ ప్రతీది మానిటర్ చేయొచ్చు. అదే.. Kids Activity Report.. టూల్.. నెట్ ఫ్లిక్స్ లో లాగిన్ అయిన పిల్లలు ఎక్కువ సమయం ఎలాంటి కంటెంట్ చూస్తున్నారో తల్లిదండ్రులు ఎప్పటికప్పుడూ మానిటర్ చేయొచ్చు.



పిల్లలు ఫావరేట్ షో ఏంటి? వారి ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి? వారి ఆసక్తిని బట్టి ఎలాంటి కొత్త షోలు రికమండేషన్స్‌ డిస్ ప్లే అవుతున్నాయో తల్లిదండ్రులు నిశితంగా గమనించవచ్చు. ఈ కొత్త టూల్ ఆధారంగా కిడ్స్ నెట్ ఫ్లిక్స్ అకౌంట్ యాక్సస్ కలిగిన పేరంట్స్ అందరికి నెట్ ఫ్లిక్స్ కంపెనీ వారాంతంలో ఈమెయిల్స్ పంపనుంది.



కిడ్స్ యాక్టివిటీ రిపోర్టును పేరంట్స్ యాక్సస్ చేసుకోవచ్చు. నెట్ ఫ్లిక్స్ అందించే ఈ రిపోర్టు కూడా జోక్ ఆఫ్ ది డే తరహాలో రంగుల పేజీలతో డిస్ ప్లే చేయనుంది. అంతేకాదు.. తల్లిదండ్రులు తమ పిల్లలను తమ ఫేవరెట్ షో లేదా ఫేవరెంట్ క్యారెక్టర్ ఏంటి అని పలు ప్రశ్నలను అడగవచ్చు. ఈ టూల్ రిపోర్టు ద్వారా పేరంట్స్ తమ పిల్లలు నెట్ ప్లిక్స్ లో ఏయే కంటెంట్ ఎక్కువగా వాచ్ చేస్తున్నారో పూర్తిగా అర్థం చేసుకోవచ్చు.



నెట్ ఫ్లిక్స్‌లో అందించే కిడ్స్ అకౌంట్లు ప్రి-స్కూల్, ప్రి-టీన్ ఏజ్ మధ్య యాక్సస్ లిమిట్‌ ఉంటుంది. పేరంట్స్ తమ కిడ్స్ యాక్టివిటీ రిపోర్టును ఎప్పుడంటే అప్పుడు యాక్సస్ చేసుకోవచ్చు. ఈ కొత్త కిడ్స్ రిపోర్టు టూల్ తో పాటు నెట్ ఫ్లిక్స్ మరో టూల్ ప్రవేశపెట్టబోతోంది.
Netflix wants to help parents connect with their kids
ఫ్యామిలీ ప్రొఫైల్ సెట్టింగ్ కోసం గ్లోబల్ టెస్టు తీసుకొస్తోంది. కిడ్స్ ఓన్లీ ప్రొఫైల్స్ లేదా రెగ్యులర్ ప్రొఫైల్స్ మాదిరిగా ఉండవు. ఫ్యామిలీ ప్రొఫైల్స్ అన్ని కలిపి ఒకే ప్రొఫైల్ గా కనిపిస్తాయి. ఇందులో టీవీ షోల నుంచి సినిమాల వరకు అన్నింటిని ఫ్యామిలీ-ఫ్రెండ్లీగా ఒకే ప్రొఫైల్ లో వీక్షించవచ్చు.