Nokia G11 Plus : ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌తో నోకియా G11 ప్లస్ వచ్చేసింది.. ఇండియాలో ధర ఎంతంటే?

Nokia G11 Plus : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం నోకియా (Nokia) నుంచి భారత మార్కెట్లో Nokia G11 Plus లాంచ్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ బ్లోట్‌వేర్ లేని ఆండ్రాయిడ్‌తో రానుందని నివేదిక తెలిపింది.

Nokia G11 Plus : ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌తో నోకియా G11 ప్లస్ వచ్చేసింది.. ఇండియాలో ధర ఎంతంటే?

Nokia G11 Plus with Face Unlock feature, launched in India_ Check price, specs

Nokia G11 Plus : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం నోకియా (Nokia) నుంచి భారత మార్కెట్లో Nokia G11 Plus లాంచ్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ బ్లోట్‌వేర్ లేని ఆండ్రాయిడ్‌తో రానుందని నివేదిక తెలిపింది. HMD గ్లోబల్ ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను ఈ ఏడాది ప్రారంభంలో జూన్‌లో గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ చేసింది. Nokia G11 Plus 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. అదనంగా, ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ 3 రోజుల వరకు బ్యాకప్‌ను అందించగలదని నోకియా పేర్కొంది.

Nokia G11 Plus with Face Unlock feature, launched in India_ Check price, specs

Nokia G11 Plus with Face Unlock feature, launched in India

Nokia G11 Plus: భారతదేశంలో ధర ఎంతంటే? :
Nokia G11 Plus ఏకైక 4GB RAMతో 64Gb స్టోరేజ్ వేరియంట్‌తో వస్తుంది, దీని ధర నోకియా ఇండియా సైట్‌లో రూ.12,499గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ లేక్ బ్లూ, చార్‌కోల్ గ్రే కలర్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఇతర ప్రముఖ రిటైల్, ఆన్‌లైన్ స్టోర్‌లలో త్వరలో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

Nokia G11 Plus : స్పెసిఫికేషన్‌లు ఇవే :
Nokia నుంచి వచ్చిన లేటెస్ట్ హ్యాండ్‌సెట్ 90 Hz రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియోతో 6.5-అంగుళాల HD+ (720X1600 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంది. Nokia G11 Plus Unisoc T606 SoC ద్వారా పవర్ అందిస్తుంది. 4GB RAM, 64GB ROM కూడా ఉన్నాయి. మైక్రో SD కార్డ్ (512GB వరకు) ద్వారా పొడిగించవచ్చు. బ్లోట్‌వేర్ లేని Android 12 OSలో రన్ అవుతుంది.

Nokia G11 Plus with Face Unlock feature, launched in India_ Check price, specs

Nokia G11 Plus with Face Unlock feature, launched in India

కంపెనీ రెండు OS అప్‌గ్రేడ్‌లు, 3 ఏళ్ల నెలవారీ అప్‌డేట్ పొందవచ్చు. ఆప్టిక్స్ కోసం నోకియా G11 ప్లస్ ఆటో ఫోకస్, f/1.8 ఎపర్చర్‌తో కూడిన 50MP ప్రైమరీ సెన్సార్ ద్వారా పనిచేస్తుంద. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. వెనుకవైపు 2MP ఫిక్స్‌డ్ ఫోకస్ డెప్త్ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ హ్యాండ్‌సెట్ f/2.0 ఎపర్చర్‌తో కూడిన 8MP ఫిక్స్‌డ్ ఫోకస్ కెమెరాను కలిగి ఉంది.

స్మార్ట్‌ఫోన్ 164.8×75.9×8.55mm కొలతలు, 192gm బరువును కలిగి ఉంది. నోకియా G11 ప్లస్ మూడు రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. 10W ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుందని కంపెనీ తెలిపింది. డ్యూయల్ సిమ్ (Nano) 4G స్మార్ట్‌ఫోన్.. డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ v5.0 కి కూడా సపోర్టు ఇస్తుంది. USB Type-C పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ను కూడా అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫేస్ అన్‌లాక్ ఫీచర్, బ్యాక్ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్‌ను పొందుతుంది. నీటి నిరోధకతతో IP52 రేటింగ్‌ను కూడా పొందింది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Nokia C21 Plus : కొత్త నోకియా C21 ప్లస్ వచ్చేసింది.. ఫీచర్లు, ధర ఎంతంటే?