OnePlus 8 Pro..విశేషాలు

  • Published By: madhu ,Published On : January 12, 2020 / 10:15 AM IST
OnePlus 8 Pro..విశేషాలు

ప్రముఖ సెల్ కంపెనీలో వన్ ప్లస్ కూడా ఒకటి. భారతదేశంలో అత్యంత పాపులార్టీ ఉంది. వివిధ ఫీచర్లు, ఆఫర్లతో ముందుకొస్తోంది. తాజాగా OnePlus 8 Proతో ముందుకొస్తోంది. సంస్థ దీని గురించి ఏ విషయాలు చెప్పకపోయినా..సెల్ గురించి కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 12 GB RAMతో ఉన్న ఈ ఫొన్ ఆండ్రాయిడ్ 10తో కలదు. SoC, 865 స్నాప్ డ్రాగన్ ఇందులో ఉందని సంస్థ వెల్లడిస్తోంది.

6.65 ఇంచుల స్ర్కీన్ ఉంది. OPPO Reno 3 ప్రో మాదిరిగానే ఉంది. ఇందులో 3D సెన్సార్ పరికరాన్ని అమర్చారు. డిస్ ప్లే వెనుక భాగంలో కెమెరా మాడ్యూల్ ఉంది. 3D సెన్సార్ కూడా ఉంది. ఫోన్ రీ చార్జ్ చేయడం చాలా సులువని సంస్థ వెల్లడిస్తోంది. 

ఇంతకుముందు వన్ ప్లస్ 8 సిరీస్, వన్ ప్లస్ 8 ప్రో, వన్ ప్లస్ 8 లైట్ రూపొందిస్తోంది. వన్ ప్లస్ 8 సిరీస్ ఫిబ్రవరి లేదా మార్చి నెలలో వస్తుందని అంచనా. ఇదే సమయంలో శామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 11 సవాల్ విసరడానికి రెడీ అవుతోంది. వన్ ప్లస్ 8 లైట్ ధర రూ. 30 వేలు ఉంటుందని తెలుస్తోంది. 1080×2400 పీక్వెల్స్ రిజల్యూషన్, స్క్రీన్ పై భాగంలో ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 256 జీబీ వరకు స్టోరేజ్. 
 

Read More : రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకొనే వారికి వెడ్డింగ్ హాల్ బంపర్ ఆఫర్