OnePlus Nord CE 2 Lite 5G : ట్రిపుల్ కెమెరాలతో అతి తక్కువ ధరకే కొత్త వన్‌ప్లస్‌ 5G ఫోన్‌.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?

OnePlus Nord CE 2 Lite : వన్‌పస్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. చైనీస్‌ టెక్‌ దిగ్గజం వన్‌ ప్లస్‌ (OnePlus) నుంచి కొత్త మోడల్‌ తీసుకొస్తోంది.

OnePlus Nord CE 2 Lite 5G : ట్రిపుల్ కెమెరాలతో అతి తక్కువ ధరకే కొత్త వన్‌ప్లస్‌ 5G ఫోన్‌.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?

Oneplus Nord Ce 2 Lite Design Officially Teased Ahead Of India Launch (1)

OnePlus Nord CE 2 Lite : వన్‌పస్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. చైనీస్‌ టెక్‌ దిగ్గజం వన్‌ ప్లస్‌ (OnePlus) నుంచి కొత్త మోడల్‌ తీసుకొస్తోంది. ట్రిపుల్ కెమెరాలతో అతి తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ మేరకు వన్ ప్లస్ కంపెనీ రిలీజ్ డేట్ కూడా ప్రకటించింది. ఏప్రిల్ 28న జరగబోయే ‘More Power To You’ ఈవెంట్‌లో OnePlus Nord CE 2 Lite 5G మోడల్స్‌ను లాంచ్ చేయనుంది. ఇంతకీ వన్ ప్లస్ ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ఏయే ఫీచర్లు, స్పెషిఫికేషన్లను అందిస్తుందో ఓసారి లుక్కేయండి..

ఒరిజినల్ OnePlus Nord CE 2 స్మార్ట్‌ఫోన్ టోన్-డౌన్ వెర్షన్‌గా రానుంది. ఈ ఫోన్ లాంచ్‌కు ముందే కంపెనీ కొన్ని వివరాలను అధికారికంగా ధృవీకరించింది. OnePlus డివైజ్ ఫొటోను కూడా షేర్ చేసింది. ఈ మోడల్ ఫోన్ OnePlus Nord CE 2 Lite డిజైన్ ఇలానే ఉండే అవకాశం ఉంది. అయితే ఈ కొత్త OnePlus ఫోన్ చిన్న మార్పులతో రానుంది. Nord CE 2 Lite, Nord 2, Nord CE 2 స్మార్ట్ ఫోన్ మోడళ్లలో రాబోయే ఫోన్ కు సంబంధించి వెనుక థర్డ్ కెమెరా ప్లేస్‌మెంట్‌ను కంపెనీ మార్చినట్టుగా కనిపిస్తోంది. అదనంగా, బ్రాండ్ 3 ఫోన్‌లను ఒకే నీలం రంగులో తీసుకొస్తోంది. ఈ ఫోన్ వెనుక భాగంలో 3 కెమెరాలు ఉంటాయని అధికారిక టీజర్ ధృవీకరించింది. అయితే ఈ డివైజ్ ఫ్రంట్ ప్యానెల్‌ను ఎలా ఉండనుందో రివీల్ చేయలేదు. OnePlus కంపెనీ ఇప్పటికే అందిస్తోన్న పంచ్-హోల్ డిస్‌ప్లే డిజైన్‌తో వచ్చే అవకాశం ఉంది.

Oneplus Nord Ce 2 Lite Design Officially Teased Ahead Of India Launch (2)

Oneplus Nord Ce 2 Lite Design Officially Teased Ahead Of India Launch 

OnePlus Nord CE 2 Lite అధిక-ఫ్రెష్ రేట్ స్క్రీన్‌ను కలిగి ఉండనుంది. Nord CE 2 మాదిరిగానే 90Hz డిస్‌ప్లేను కలిగి ఉండవచ్చు. OnePlus 120Hz సపోర్టును అందించే అవకాశాలు ఉన్నాయి. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో డివైజ్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని OnePlus ఇప్పటికే ధృవీకరించింది. ఏయే ఫీచర్లు ఉండనున్నాయో పూర్తిగా రివీల్ చేయలేదు. FULL HD+ రిజల్యూషన్‌కు సపోర్టుతో 6.58-అంగుళాల డిస్‌ప్లేతో రావచ్చని ఓ నివేదిక తెలిపింది.

ఫీచర్లు (అంచనా)..
OnePlus Nord CE 2 Lite 5G మొబైల్ 5000 mAh బ్యాటరీతో రానుంది. 33W సూపర్ వూక్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో రానుంది. బ్యాటరీని 0 నుంచి 50 శాతం వరకు కేవలం 30 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది. క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్ 65 5G చిప్‌సెట్‌ అమర్చారు. 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.58 అంగుళాల Full HD+ డిస్‌ప్లేను అందిస్తోంది. కెమెరాల విషయానికి వస్తే.. ఫ్రంట్ కెమెరా సెల్ఫీల కోసం 16MP హైరిజల్యూషన్‌ ప్రైమరీ కెమెరా రానుంది. డివైజ్ బ్యాక్ సైడ్ 64MP ఓమినీ విజన్‌, 2MP మాక్రో లెన్స్‌, 2MP మోనో లెన్స్‌ను అందిస్తోంది. ఇక స్టోరేజీ విషయానికి వస్తే.. 8GB ర్యామ్​, 128GB ఇంటర్నల్‌ స్టోరేజీ సామర్థ్యంతో రానున్నట్టు తెలుస్తోంది.

ధర (అంచనా) :
OnePlus Nord CE 2 సిరీస్‌ కంటే CE 2 Lite మోడల్‌ ధర తక్కువ ఉండనుంది. భారత మార్కెట్లో Nord CE 2 ప్రారంభ ధర రూ.23, 999గా ఉది. అంతకంటే తక్కువ ధరకే సుమారు రూ.20,000 లోపే ఉండనుంది.భారత్‌లో CE 2 లైట్‌ ప్రారంభ ధర రూ.19,999గా ఉండే అవకాశం ఉంది.

Read Also : OnePlus 10 Pro 5G : వన్‌ప్లస్ 10ప్రో 5G ఫోన్ వచ్చేస్తోంది.. ఇండియాలో ఎప్పుడంటే?