OnePlus Nord Watch : వన్‌ప్లస్ నార్డ్ వాచ్‌ ధర తగ్గిందోచ్.. సరికొత్త ఆఫర్ మీకోసం.. కొత్త ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

OnePlus Nord Watch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) బడ్జెట్ స్మార్ట్‌వాచ్‌ను వన్‌ప్లస్ నార్డ్ వాచ్‌గా గత ఏడాది భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇప్పుడు కంపెనీ ఈ స్మార్ట్‌వాచ్ ధరను రూ. 500 తగ్గించింది.

OnePlus Nord Watch : వన్‌ప్లస్ నార్డ్ వాచ్‌ ధర తగ్గిందోచ్.. సరికొత్త ఆఫర్ మీకోసం.. కొత్త ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

OnePlus Nord Watch gets a price drop_ Details on new price and offer

OnePlus Nord Watch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) బడ్జెట్ స్మార్ట్‌వాచ్‌ను వన్‌ప్లస్ నార్డ్ వాచ్‌గా గత ఏడాది భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇప్పుడు కంపెనీ ఈ స్మార్ట్‌వాచ్ ధరను రూ. 500 తగ్గించింది. OnePlus Nord Watch 60Hz రిఫ్రెష్ రేట్, 500nits ప్రకాశంతో 1.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఒత్తిడి, హృదయ స్పందన రేటు, రక్త స్థాయి పర్యవేక్షణ ఫీచర్లతో పాటు 105 స్పోర్ట్స్ మోడ్‌లకు సపోర్టును అందిస్తుంది.

వేరబుల్ మెన్సిస్ట్రాకింగ్, హెల్త్ టిప్స్ కూడా అందిస్తుంది OnePlus ప్రకారం.. గరిష్టంగా 30 రోజుల స్టాండ్‌బై సమయంతో 10 రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తుందని పేర్కొంది. OnePlus Nord వాచ్ రూ. 4,999 ధరతో లాంచ్ అయింది. స్మార్ట్‌వాచ్ ధరలో రూ. 500 తగ్గింపును అందుకుంది. వేరబుల్ వాచ్ కొత్త ధర రూ. 4,499గా ఉంది. ఆసక్తికరంగా, కస్టమర్‌లు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి రూ. 500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.

అంతేకాకుండా, MobiKwik Wallet యూజర్లు ఈ డీల్‌పై రూ. 500 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. OnePlus నుంచి వేరబుల్ స్మార్ట్‌వాచ్ 60Hz రిఫ్రెష్ రేట్‌తో 1.78-అంగుళాల HD AMOLED టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను గరిష్టంగా 500nits వరకు బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. స్మార్ట్‌వాచ్ కుడివైపున ఉన్న పవర్ బటన్‌తో వచ్చింది.

OnePlus Nord Watch gets a price drop_ Details on new price and offer

OnePlus Nord Watch gets a price drop_ Details on new price and offer

Read Also : Apple iPhone : మీ ఐఫోన్ ఎంతగా ప్రయత్నించినా స్విచ్ ఆన్ కావడం లేదా? ఎలా రీస్టార్ట్ చేయాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

స్మార్ట్‌వాచ్ SF32LB555V4O6 చిప్‌సెట్‌తో వచ్చింది. RTOSలో రన్ అవుతుంది. OnePlus Nord వాచ్ ఒక ఇంటర్నల్ GPS సపోర్టును కలిగి ఉంది. 3-యాక్సిస్ యాక్సిలెరోమీటర్‌తో వస్తుంది. SpO2, స్లీప్ ట్రాకింగ్‌తో పాటు హృదయ స్పందన రేటుతో పాటు స్ట్రెస్ మానిటరింగ్ సపోర్టు ఇస్తుంది.

OnePlus Nord వాచ్ 105 స్పోర్ట్స్ మోడ్‌లకు సపోర్టు ఇస్తుంది. ఆటోమాటిక్ రన్నింగ్, వాకింగ్ ట్రాక్ చేయగలదు. వన్‌ప్లస్ నోర్డ్ వాచ్ బ్లూటూత్ 5.2 కనెక్టివిటీని కలిగి ఉంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు, ఆండ్రాయిడ్ 6, iOS 11, అంతకంటే ఎక్కువ వెర్షన్‌లలో రన్ అవుతున్న ఐఫోన్ మోడల్‌లకు అనుకూలంగా ఉంటుంది. ఇక నాన్-లీనియర్ వైబ్రేషన్ మోటారుతో వస్తుంది. 230mAh బ్యాటరీని అందిస్తుంది. మాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్‌తో వచ్చింది. సాధారణ వినియోగంతో గరిష్టంగా 10 రోజుల బ్యాటరీ లైఫ్ గరిష్టంగా 30 రోజుల స్టాండ్‌బై సమయాన్ని అందిస్తుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Flipkart Electronics Sale : ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్.. రియల్‌మి స్మార్ట్‌ఫోన్లపై బెస్ట్ డీల్స్.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!