Realme 9i 5G : రియల్‌మి 9i 5G సేల్ మొదలైందోచ్.. మరో 5 కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు మీకోసం.. ధర ఎంతంటే?

Realme 9i 5G Sale : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మి నుంచి Realme 9i 5G ఫోన్ సేల్ మొదలైంది. అంతేకాదు.. భారత మార్కెట్లో మరో 5 కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు కూడా సేల్‌లో అందుబాటులో ఉన్నాయి.

Realme 9i 5G : రియల్‌మి 9i 5G సేల్ మొదలైందోచ్.. మరో 5 కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు మీకోసం.. ధర ఎంతంటే?

Realme 9i 5G sale starts today_ Here is everything you must know

Realme 9i 5G Sale : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మి నుంచి Realme 9i 5G ఫోన్ సేల్ మొదలైంది. అంతేకాదు.. భారత మార్కెట్లో మరో 5 కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు కూడా సేల్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే Realme భారతీయ మార్కెట్లో లాంచ్ చేసిన 5 కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కంపెనీ భారతీయ మార్కెట్లో కొత్త Realme 9i 5G స్మార్ట్ ఫోన్‌ సేల్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. ఈ స్మార్ట్‌ఫోన్ లేజర్ లైట్ డిజైన్‌ను కలిగి ఉంది.

ఈ డివైజ్ రెండు కలర్ (Metallic Gold, Rocking Black) వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఈ కొత్త Realme 9i 5G 2 స్టోరేజ్, ర్యామ్ వేరియంట్‌లలో కూడా అందుబాటులో ఉంది. 4GB RAM, 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గా ఉంది. అలాగే 6GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999గా ఉంది. Flipkart, Realme అధికారిక వెబ్‌సైట్ నుంచి ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయొచ్చు. కొనుగోలుదారులు ICICI బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. రూ. 1,000 అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు.

Realme 9i 5G sale starts today_ Here is everything you must know

Realme 9i 5G sale starts today_ Here is everything you must know

Realme 9i 5G స్పెసిఫికేషన్‌లు ఇవే :
ఈ కొత్త 9i 5G స్మార్ట్‌ఫోన్ 2400×1080 పిక్సెల్‌లతో 6.6-అంగుళాల Full HD+ అల్ట్రా స్మూత్ డిస్‌ప్లేతో వస్తుంది. MediaTek Dimensity 810 5G చిప్‌సెట్ ద్వారా ఆధారితమైన ఈ హ్యాండ్‌సెట్ గరిష్టంగా 6GB RAM, 128GB స్టోరేజీతో వచ్చింది. Android 12OS-ఆధారిత Realme UI 3.0పై రన్ అవుతుంది. కెమెరా ముందు భాగంలో స్మార్ట్‌ఫోన్ వెనుక ప్యానెల్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50MP అల్ట్రా HD ప్రైమరీ లెన్స్, 4cm మాక్రో సెన్సార్, పోర్ట్రెయిట్ షూటింగ్ లెన్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8MP సెల్ఫీ కెమెరా ఉంది.

బ్యాటరీ Realme 9i 5G 5,000mAh బ్యాటరీతో సపోర్టు అందిస్తుంది. 18W క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీకి మరింత సపోర్టు ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యూయల్ సిమ్ సపోర్ట్, 5G కనెక్టివిటీ ఉన్నాయి. డివైజ్ RAMని 11 GB వరకు పెంచుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే రియల్ మి 9i 5G ఫోన్ సొంతం చేసుకోండి.

Read Also : Realme Pad : రియల్‌మి నుంచి ఫస్ట్ Tablet.. ఫీచర్లు కిరాక్, ధర ఎంతంటే?