Realme GT Neo 3 : ఇండియాకు రియల్‌మి నుంచి GT Neo 3 సిరీస్ వస్తోంది.. ఎప్పుడంటే?

Realme GT Neo 3 : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్ మి నుంచి GT Neo సిరీస్ కొత్త ఫోన్ వస్తోంది. ఏప్రిల్ 29న భారత మార్కెట్లోకి Realme GT Neo 3 లాంచ్ కాబోతోంది.

Realme GT Neo 3 : ఇండియాకు రియల్‌మి నుంచి GT Neo 3 సిరీస్ వస్తోంది.. ఎప్పుడంటే?

Realme Gt Neo 3 India Launch Date Announced, Here Is What To Expect (1)

Realme GT Neo 3 : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్ మి నుంచి GT Neo సిరీస్ కొత్త ఫోన్ వస్తోంది. ఏప్రిల్ 29న భారత మార్కెట్లోకి Realme GT Neo 3 లాంచ్ కాబోతోంది. YouTubeలో ‘AskMadhav’ సిరీస్ లేటెస్ట్ ఎపిసోడ్ సందర్భంగా Realme India బాస్ మాధవ్ షేత్ ఈ ప్రకటన చేశారు. GT Neo 3 మోడల్ కు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. GT Neo 3 ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేదని షెత్ వెల్లడించారు. ఈ కొత్త రియల్ మి GT Neo 3 స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీని ప్రకటించారు. కొన్ని రోజుల క్రితమే.. చైనాలో 150W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో Realme GT Neo 3 కంపెనీ మొదటి ఫోన్‌గా లాంచ్ అయింది.

ఈ కొత్త GT Neo 3 చైనాలో రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. హై 150W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో రానుంది. దాదాపు 20 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్ అవుతుందని కంపెనీ వెల్లడించింది. తక్కువ లేదా బేస్ వెర్షన్‌లో 80W ఛార్జింగ్ సపోర్టు అందిస్తోంది. 30 నిమిషాలలోపు బ్యాటరీని ఫుల్ చేసేస్తుందని కంపెనీ తెలిపింది. ఆసక్తికరంగా, రాబోయే OnePlus 10Rలో ఇదే ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాలు ఉన్నాయని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. GT నియో 3 రీబ్రాండెడ్ వెర్షన్ అంటోంది కంపెనీ.

Realme GT నియో 3 ధర ఎంతంటే? :
Realme GT Neo 3 భారత మార్కెట్లో ఎంత ఉంటుంది అనేది కంపెనీ రివీల్ చేయలేదు. ఎందుకంటే లాంచ్‌కు ముందే Realme ధర గురించి వివరాలను వెల్లడించలేదు. ఈ ఫోన్ చైనీస్ ధరలను బట్టి మన దేశ మార్కెట్లో ఎంత ఉంటుంది అనేది అంచనా వేస్తున్నారు మార్కెట్ విశ్లేషకులు.. Realme GT Neo 3 80W వెర్షన్ ప్రారంభ ధర (CNY 1,999) 150W వెర్షన్ CNY 2,699 నుంచి అందుబాటులో ఉన్నాయి. మన దేశీయ ధరలు వరుసగా రూ.24,000 రూ.33,000లకు సమానమని అంచనా.

Realme Gt Neo 3 India Launch Date Announced, Here Is What To Expect

Realme Gt Neo 3 India Launch Date Announced, Here Is What To Expect

స్పెషిఫికేషన్లు ఇవే :
Realme GT Neo 3 ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ ఫీచర్‌లతో వచ్చింది. 6.7-అంగుళాల 2K డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్, 1000Hz టచ్ శాంప్లింగ్ రేట్ HDR10+ సపోర్ట్‌తో వస్తోంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్‌తో రానుంది. గరిష్టంగా 12GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజీతో వచ్చింది. Realme GT Neo 3 Realme UI 3.0తో రానుంది. చైనాలో Android 12కి బదులుగా Android 11తో వచ్చింది. భారత మార్కెట్లో GT Neo 3లో Android 12తో వచ్చే అవకాశం ఉంది.

గేమర్‌లు GT నియో 3 ఫోన్ పర్ ఫెక్ట్ అని చెప్పవచ్చు. ఫోటోగ్రాఫర్‌లు 50-MP Sony IMX766 సెన్సార్ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ సెన్సార్ వీడియోలను ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌కు సపోర్టు అందిస్తుంది. ఇక వెనుక కెమెరా సిస్టమ్‌లో 119-డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ, మాక్రో కెమెరాతో అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీ కెమెరా GT నియో 3 డిస్‌ప్లేలో పంచ్-హోల్ అందిస్తోంది. ఛార్జింగ్ స్పీడ్ ఆధారంగా ఫోన్‌లో రెండు వేరియంట్‌లు అందుబాటులో ఉండనున్నాయి. 80W, 5000mAh బ్యాటరీతో రానుండగా.. 150W వేరియంట్‌లో 4500mAh బ్యాటరీతో రానుంది. 80W ఛార్జింగ్ 32 నిమిషాల్లో 100 శాతం బ్యాటరీ ఫుల్ చేస్తుంది. 150Wతో వచ్చే వేరియంట్ ఫోన్ కేవలం 5 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుందని Realme చెబుతోంది.

Read Also : Realme C31 Sale : రియల్‌మి C31 ఫోన్‌ ఫస్ట్ సేల్.. రూ. 500 డిస్కౌంట్.. కండీషన్స్ అప్లయ్..!