Redmi Note 11 వచ్చేస్తోంది.. డేట్ ఫిక్స్.. ఫీచర్లు కేక.. ధర ఇంతే ఉండొచ్చట!

రెడ్‌మీ నుంచి Note 11 సిరీస్ వచ్చేస్తోంది. లాంచింగ్ డేట్ ఫిక్స్ అయింది.. ఫీచర్లు కేక అంట.. భారత మార్కెట్లో Redmi Note 11 మూడు వేరియంట్ల ధర కూడా ఇంతే ఉండొచ్చుట..

Redmi Note 11 వచ్చేస్తోంది.. డేట్ ఫిక్స్.. ఫీచర్లు కేక.. ధర ఇంతే ఉండొచ్చట!

Redmi Note 11 Launch Soon

Redmi Note 11 launch : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ సబ్‌బ్రాండ్ రెడ్‌మీ నుంచి Note 11 సిరీస్ వచ్చేస్తోంది. లాంచింగ్ డేట్ ఫిక్స్ అయింది.. ఫీచర్లు కేక అంట.. భారత మార్కెట్లో Redmi Note 11 ధర కూడా ఎంత ఉండోచ్చు ముందుగానే అంచనా వేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ యూజర్లు ఎదురుచూస్తున్న రెడ్ మి నోట్ 11 సిరీస్ మూడు వేరియంట్లలో లాంచ్ కానుంది. అక్టోబర్ 28న Redmi Note 11 లాంచ్ డేట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఫోన్ లాంచింగ్ ముందే ఫీచర్లు, ధర వివరాలు లీక్ అయ్యాయి. Redmi Note 11, Redmi Note 11pro, Redmi Note 11Pro Plus స్పెసిఫికేష‌న్లు, ధ‌ర వివరాలు కూడా రివీల్ అయ్యాయి.

షెడ్యూల్ ప్రకారం.. వ‌చ్చే వారం.. అంటే.. అక్టోబ‌ర్ 28న రెడ్‌మీ నోట్ 11 సిరీస్ లాంచ్ కానుంది. ఈ మూడు వేరియంట్లలో ఫీచర్లు, ధర గురించే టాక్ నడుస్తోంది. Redmi Note 11 సిరీస్ అన్ని ఫోన్లు 120Hz డిస్‌ప్లేతో పాటు 5000mAh బ్యాట‌రీతో విడుదల కానున్నాయి. Redmi Note 11, 4GB RAM plus, 128GB ధర సుమారు రూ.14వేలు ఉంటుంద‌ని అంచనా. 6GB ప్ల‌స్ 128GB, 8GB ప్ల‌స్, 128GB, 8GB ప్ల‌స్ 256GB వేరియంట్ల‌లోనూ లభించనుంది.

రెడ్‌మీ నోట్ 11pro 6GB ప్ల‌స్ 128GB వేరియంట్ ధ‌ర రూ.18,700 వరకు ఉంటుంది. 8GB ప్ల‌స్ 128GB వేరియంట్ ధ‌ర రూ.21వేలు, 8GB ప్ల‌స్ 256GB ధ‌ర రూ.23,400గా ఉండ‌నుంది. Redmi Note 11pro ప్ల‌స్ ఫోన్ ధ‌ర 8GB ప్ల‌స్ 128GB వేరియంట్ ధ‌ర‌ రూ.25,700గా ఉండ‌నుంది. 8GB ప్ల‌స్ 256GB మోడ‌ల్ ధ‌ర రూ.29,200గా ఉంటుందని తెలుస్తోంది.
PhonePe యూజర్లకు షాక్.. ఇకపై ఛార్జీలు వసూలు

Redmi Note 11 స్పెషిఫికేషన్లు, ఫీచర్లు ఇవే :
6.5 ఇంచ్ ఫుట్ HD Plus LCD, 120Hz రీఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ విక్ట‌స్ ప్రొటెక్ష‌న్, ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 810SoC ప్రాసెస‌ర్‌, 50MP రియర్ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా, Wi-Fi, బ్లూటూత్‌, GPS‌, USB Type-C పోర్ట్‌, 5000mAh బ్యాట‌రీ, 33 వాట్స్ చార్జింగ్ స‌పోర్ట్ లాంటి ఫీచ‌ర్లు Redmi Note 11లో ఉండ‌నున్నాయి.

Redmi Note 11pro ఫీచర్లు :
AMOLED డిస్‌ప్లే, 120Hz రీఫ్రెష్ రేట్‌, ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 920SoC ప్రాసెస‌ర్‌, ట్రిపుల్ రేర్ కెమెరా సెట‌ప్‌,108MP సామ్‌సంగ్ ప్రైమ‌రీ సెన్సార్‌,16MP సెల్ఫీ కెమెరా, 5000mAh బ్యాట‌రీ, 67 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ లాంటి ఫీచ‌ర్లు రెడ్‌మీ నోట్ 11 ప్రోలో లభించనున్నాయి.

Redmi Note 11pro Plus ఫీచర్లు :
120Hz ఫ్లెక్సిబుల్ AMOLED డిస్‌ప్లే, ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200AI SoC, ట్రిపుల్ రేర్ కెమెరా సెట‌ప్‌, 108MP ప్రైమ‌రీ శాంసంగ్ HM‌2 సెన్సార్‌,16MP సెల్ఫీ కెమెరా లాంటి ఫీచ‌ర్ల‌తో రెడ్‌మీ నోట్ 11pro ప్ల‌స్ రిలీజ్ కానుంది. ఇకపోతే.. రెడ్‌మీ నోట్ 11 సిరీస్ అక్టోబ‌ర్ 28న చైనాలో రిలీజ్ కానుంది. ఆ తర్వాతే ప్ర‌పంచ‌వ్యాప్తంగా అన్ని స్మార్ట్ ఫోన్ల మార్కెట్లోకి లాంచ్ కానుంది.
Fuel prices: తగ్గేదే లే.. అంటున్న చమురు ధరలు!