Reliance Jio Alert : జియో యూజర్లకు అలర్ట్.. ఈ విషయాల్లో తస్మాత్ జాగ్రత్త..!

ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో యూజర్లను అలర్ట్ చేస్తోంది. సైబర్ నేరగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని జియో తమ 426 మిలియన్ల మంది యూజర్లకు మెసేజ్ లు పంపుతోంది.

Reliance Jio Alert : జియో యూజర్లకు అలర్ట్.. ఈ విషయాల్లో తస్మాత్ జాగ్రత్త..!

Reliance Jio Sends 'notice' To Its 426 Million Customers Don't Do These 6 Things

Reliance Jio Alert : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో యూజర్లను అలర్ట్ చేస్తోంది. సైబర్ నేరగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని జియో తమ 426 మిలియన్ల మంది యూజర్లకు మెసేజ్ లు పంపుతోంది. ఎట్ట పరిస్థితుల్లో ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తోంది. ఇటీవల కాలంలో సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. తప్పుడు సమాచారంతో పాటు ఫేక్ కాల్స్ వినియోగదారుల నుంచి సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేస్తున్నారు. బ్యాంకు అకౌంట్లను ఖాళీ చేసేస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో దేశీయ టెలికం దిగ్గజాలు తమ యూజర్లను అలర్ట్ చేస్తున్నాయి.

రిలయన్స్ జియోతో పాటు మిగతా పోటీదారులైన భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా నెట్ వర్క్ కంపెనీలు కూడా తమ యూజర్లకు అలర్ట్స్ పంపుతున్నాయి. యూజర్లు ఈ కేవైసీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది జియో. ఈకేవైసీ చీటింగ్స్, ఫేక్ ఎస్ఎంఎస్ విషయంలో బీకేర్ ఫుల్ అంటోంది. న్యూ ఇయర్ ఆఫర్లు, పండుగ ఆఫర్లు అంటూ ఏదైనా మెసేజ్ లింకులు వస్తే వాటిని క్లిక్ చేయొద్దని సూచిస్తున్నాయి. ఫ్రాడ్ క్లిక్స్ వంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని టెలికం కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. ఈ-కేవైసీ వెరిఫికేషన్ పేరుతో ఏమైనా కాల్స్/మెసేజ్‌లు వస్తే అవైడ్ చేయమని సూచిస్తుంది. వెరిఫికేషన్ అంటూ ఏదైనా నెంబర్ నుంచి ఫోన్ కాల్ వస్తే.. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. వెరిఫికేషన్ కోసం కాల్ చేస్తే ఏమైనా వ్యక్తిగత వివరాలను అడిగితే తస్మాత్ జాగ్రత్త అంటోంది. మోసపూరిత మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది.

కేవైసీ /ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయాలని తొందరపడి జియో యూజర్లు ఎవరూ థర్డ్ పార్టీ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవద్దని సూచిస్తోంది. ఏదైనా థర్డ్ పార్టీ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటూ జియో నుంచి ఎలాంటి మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ రావని అంటోంది. థర్డ్ పార్టీ యాప్ డౌన్‌లోడ్ చేస్తే.. సైబర్ మోసగాళ్లకు ఫోన్‌లోని మొత్తం డేటా చిక్కే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. సైబర్ మోసాలకు పాల్పడే వారు.. టెలికం కంపెనీలకు చెందిన ప్రతినిధులుగా చెలామణీ అవుతూ యూజర్లను మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపింది. యూజర్ల ఆధార్ నంబర్, బ్యాంకు అకౌంట్లకు సంబంధించిన సమాచారాన్ని ఈ-కేవైసీ పేరుతో అడుగుతున్నారని అలర్ట్ చేస్తోంది.

ఇలాంటి విషయాల్లో యూజర్లు అప్రమత్తంగా ఉండాలని, మోసగాళ్ల మాటలు విని నమ్మి మోసపోవద్దని సూచిస్తోంది. ఈ-కేవైసీ పేరుతో వచ్చే SMS/కాల్స్ అన్నీ ఫేక్ అని యూజర్లకు జాగ్రత్తలు, సూచనలు చేసింది. ఈ-కేవైసీ పేరుతో వచ్చే SMSలలో నెంబర్లకు తిరిగి కాల్ చేయవద్దని జియో యూజర్లకు సూచిస్తోంది. రిలయన్స్ జియో ప్రతినిధిగా మాట్లాడుతున్నట్టుగా నమ్మిస్తారని, అలాంటి ఫేక్ కాలర్లు పంపే లింక్స్, అటాచ్ మెంట్లపై ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దని జియో యూజర్లకు ప్రత్యేక జాగ్రత్తలు, సూచనలు చేసింది. MyJio App నుంచి మీకు కావాల్సిన కొత్త డేటా ఎప్పటికప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపింది. థర్డ్ పార్ట్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవద్దని లేదంటే మీ వ్యక్తిగత డేటాకు ఏర్పడే ముప్పు ఉందని జియో హెచ్చరిస్తోంది.

Read Also : Best Sports Bikes: 2021లో వచ్చిన టాప్ స్పోర్ట్స్ బైక్స్ ఇవే