Samsung Data Breach : శాంసంగ్ యూజర్లకు అలర్ట్.. భారీ మొత్తంలో పర్సనల్ డేటా లీక్.. మీ పాస్‌వర్డ్‌లు వెంటనే మార్చేసుకోండి..!

Samsung Data Breach : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) యూజర్లకు హెచ్చరిక.. మీరు వాడే శాంసంగ్ స్మార్ట్ ఫోన్లలోని వ్యక్తిగత డేటా బహిర్గతమైంది. లీకైనా డేటాలో ప్రధానంగా పుట్టినరోజులు, కాంటాక్ట్ డేటా వంటి అనేక మంది యూజర్ల వ్యక్తిగత డేటా ఉల్లంఘన జరిగినట్టు Samsung కొంతమంది యూజర్లకు అలర్ట్ చేస్తోంది.

Samsung Data Breach : శాంసంగ్ యూజర్లకు అలర్ట్.. భారీ మొత్తంలో పర్సనల్ డేటా లీక్.. మీ పాస్‌వర్డ్‌లు వెంటనే మార్చేసుకోండి..!

Samsung faces massive data breach, says personal data like birthdays, phone number exposed

Samsung Data Breach : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) యూజర్లకు హెచ్చరిక.. మీరు వాడే శాంసంగ్ స్మార్ట్ ఫోన్లలోని వ్యక్తిగత డేటా బహిర్గతమైంది. లీకైనా డేటాలో ప్రధానంగా పుట్టినరోజులు, కాంటాక్ట్ డేటా వంటి అనేక మంది యూజర్ల వ్యక్తిగత డేటా ఉల్లంఘన జరిగినట్టు Samsung కొంతమంది యూజర్లకు అలర్ట్ చేస్తోంది. ఈ ఏడాది జులైలో జరిగిన డేటా ఉల్లంఘనలో అమెరికాలోని శాంసంగ్ యూజర్ల డేటా బహిర్గతమైంది. దీనికి సంబంధించి శాంసంగ్ కంపెనీ ఒక ఈమెయిల్‌లో వెల్లడించింది.

అనధికారిక థర్డ్ పార్టీ Samsung కొన్ని అమెరికా సిస్టమ్‌ల నుంచి డేటాను లీక్ చేసినట్టు కంపెనీ పేర్కొంది. జులై 2022 చివరలో అనధికారిక థర్డ్ పార్టీ Samsung అమెరికా సిస్టమ్‌లలో కొన్నింటి నుంచి యూజర్ల డేటాను పొందింది. ఆగస్ట్ 4, 2022న లేదా ఆ సమయంలో నిర్దిష్ట కస్టమర్‌ల వ్యక్తిగత డేటా ప్రభావితమైందని తేలింది. దీనిపై విచారణ చేయగా భారీ డేటా బహిర్గతమైందని గుర్తించినట్టు తెలిపింది.

Samsung faces massive data breach, says personal data like birthdays, phone number exposed

Samsung faces massive data breach, says personal data like birthdays, phone number exposed

అయితే డేటా లీకైన సిస్టమ్‌లను సురక్షితంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని కంపెనీ పేర్కొంది. సైబర్‌ సెక్యూరిటీ సంస్థ దీనిపై లోతుగా విచారిస్తోందని శాంసంగ్ FAQ పేజీ తెలిపింది. ఈ డేటా ఉల్లంఘన యూజర్ల ఫోన్ నంబర్‌లు లేదా క్రెడిట్, డెబిట్ కార్డ్ నంబర్‌లను ప్రభావితం చేయలేదని Samsung నిర్ధారించింది. జూలైలో జరిగిన డేటా ఉల్లంఘనలో అమెరికాలోని కొంతమంది యూజర్ల పేరు, కాంటాక్టులు, జనాభా డేటా, పుట్టిన తేదీ, ప్రొడక్టు నమోదు డేటా వంటి వ్యక్తిగత సమాచారం చోరీకి గురైనట్టు గుర్తించింది.

ప్రతి సంబంధిత కస్టమర్‌ను ప్రభావితం చేసే డేటా మారిపోయే అవకాశం ఉందని Samsung బ్లాగ్‌లో పేర్కొంది. డేటా ఉల్లంఘన జరిగిన విషయాన్ని కస్టమర్‌లను అలర్ట్ చేస్తున్నామని కంపెనీ చెబుతోంది. Samsung FAQ పేజీలో యూజర్లు తమ పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలని సూచిస్తోంది. అకౌంట్లలో సంబంధించి వినియోగదారు డివైజ్‌లను ప్రభావితం చేయలేదని తెలిపింది.

Samsung faces massive data breach, says personal data like birthdays, phone number exposed

Samsung faces massive data breach, says personal data like birthdays, phone number exposed

అకౌంట్లను మరింత సేఫ్ గా ఉంచేందుకు నిర్దిష్ట మార్పులు చేయవలసి ఉంటుంది. అయినప్పటికీ, వ్యక్తిగత డేటాను భద్రపరుచుకోవాల్సిన అవసరం ఉందని యూజర్లను కోరింది. అనుమానాస్పద లింక్‌లు లేదా అనుమానాస్పద ఈమెయిల్‌ల నుంచి అటాచ్‌మెంట్‌లపై క్లిక్ చేయరాదని కంపెనీ యూజర్లను కోరింది. శాంసంగ్ కస్టమర్ల భద్రత, వారి ప్రైవసీని కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని శాంసంగ్ వెల్లడించింది. అంతేకాదు.. ప్రముఖ సైబర్ సెక్యూరిటీ నిపుణులను సైతం అలర్ట్ చేసినట్టు తెలిపింది. శాంసంగ్ నిర్వహించే సిస్టమ్‌లలో భద్రతను మరింత మెరుగుపరచేందుకు Samsung యూజర్లు ప్రైవసీ, భద్రతను బలోపేతం చేయనున్నట్టు బ్లాగ్ పోస్టులో వెల్లడించింది.

Read Also : Apple Event of 2022 : ఈ వారంలోనే ఆపిల్ అతిపెద్ద ఈవెంట్.. ఐఫోన్ 14 సహా ఎన్నో విలువైన ప్రొడక్టులు లాంచ్.. ఏమేమి ఉంటాయంటే?