Apple Event of 2022 : ఈ వారంలోనే ఆపిల్ అతిపెద్ద ఈవెంట్.. ఐఫోన్ 14 సహా ఎన్నో విలువైన ప్రొడక్టులు లాంచ్.. ఏమేమి ఉంటాయంటే?

Apple Event of 2022 : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) ఈ వారంలో అతిపెద్ద ఈవెంట్‌ను హోస్ట్ చేసేందుకు రెడీగా ఉంది. కంపెనీ 'Far Out virtual launch' ఈవెంట్ సెప్టెంబర్ 7న ప్రారంభం కానుంది. అంటే ఈ బుధవారమే వర్చువల్ లాంచ్ ఈవెంట్‌ జరుగనుంది.

Apple Event of 2022 : ఈ వారంలోనే ఆపిల్ అతిపెద్ద ఈవెంట్.. ఐఫోన్ 14 సహా ఎన్నో విలువైన ప్రొడక్టులు లాంచ్.. ఏమేమి ఉంటాయంటే?

Apple's Biggest Event of 2022 : iPhone 14, AirPods Pro 2, Watch Series 8 and more launching

Apple Event of 2022 : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) ఈ వారంలో అతిపెద్ద ఈవెంట్‌ను హోస్ట్ చేసేందుకు రెడీగా ఉంది. కంపెనీ ‘Far Out virtual launch’ ఈవెంట్ సెప్టెంబర్ 7న ప్రారంభం కానుంది. అంటే ఈ బుధవారమే వర్చువల్ లాంచ్ ఈవెంట్‌ జరుగనుంది. కుపెర్టినో ఆధారిత టెక్ దిగ్గజం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న iPhone 14 సిరీస్‌తో సహా అనేక హార్డ్‌వేర్ ప్రొడక్టులను లాంచ్ చేయనుంది. ఆసక్తిగల Apple వినియోగదారులు, Apple ఈవెంట్ కోసం వర్చువల్‌గా YouTube, కంపెనీ వెబ్‌సైట్, సోషల్ మీడియా ఛానెల్‌లు కొన్ని ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో వీక్షించవచ్చు.

సెప్టెంబర్ 7న (IST రాత్రి 10:30) గంటలకు ప్రారంభమవుతుంది. గతంలో మాదిరిగా Apple పార్క్ నుంచి లైవ్ ఉంటుందని భావిస్తున్నారు. ఈ వారం ఈవెంట్‌లో టిమ్ కుక్ (Tim Cook) సెంటర్ స్టేజ్ తీసుకొని అనేక కొత్త ప్రొడక్టులను ప్రకటించే అవకాశం ఉంది. బిగ్గెస్ట్ ఈవెంట్‌లో ఎలాంటి ప్రొడక్టులను ఆపిల్ లాంచ్ చేస్తుందనేది కంపెనీ వెల్లడించలేదు. కానీ, లాంచ్ ముందే లీక్‌లు కొత్త ఐఫోన్ సిరీస్, ఐప్యాడ్‌లు, యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్‌లు వంటి మరిన్ని ఆపిల్ ప్రొడక్టులు ఉంటాయని భావిస్తున్నారు. ఈ వారంలో ఆపిల్ ఫార్ అవుట్ ఈవెంట్‌లో లాంచ్ చేయనున్న కొన్ని ప్రొడక్టులను ఓసారి పరిశీలిద్దాం.

Apple's Biggest Event of 2022 _ iPhone 14, AirPods Pro 2, Watch Series 8 and more launching

Apple’s Biggest Event of 2022 _ iPhone 14, AirPods Pro 2, Watch Series 8 and more launching

ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ (iPhone 14 Series Launch) :
ఈ ఏడాది కూడా, ఆపిల్ 4 కొత్త ఐఫోన్ మోడల్‌లను లాంచ్ చేస్తుందని భావిస్తున్నారు. అయితే మినీ వెర్షన్ (Mini Version) ఉండకపోవచ్చు. పుకార్ల ప్రకారం.. కంపెనీ iPhone 14, iPhone 14 Plus/iPhone 14 Max, iPhone 14 Pro, iPhone 14 Pro Maxలను ఆవిష్కరించవచ్చు. ఈ మోడల్స్ అన్నీ iOS 16, A16 బయోనిక్ చిప్ వంటి మునుపటితో మోడళ్లతో పోల్చినప్పుడు మెరుగైన కెమెరాలు, బ్యాటరీకి సపోర్టు చేస్తాయని చెప్పవచ్చు. ఆపిల్ కొత్త ఐఫోన్‌లకు కొన్ని ముఖ్యమైన డిజైన్ మార్పులను తీసుకువచ్చే అవకాశం ఉంది.

అయితే Pro మోడల్‌లకు మాత్రమే పరిమితం కానున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి, Pro మోడల్‌లు అల్ట్రావైడ్ కెమెరాను అందిస్తాయి. మరిన్ని కొత్త ఫీచర్లు ఉంటాయి. ఐఫోన్ 14 ధరను కూడా సూచించే కొన్ని నివేదికలు ఐఫోన్ 13 మాదిరిగానే ఐఫోన్ 14 లాంచ్ అవుతాయని భావిస్తున్నారు. మరికొన్ని ఐఫోన్ 14 ఐఫోన్ 13 కంటే 50 డాలర్లు చౌకగా ఉంటుందని సూచిస్తున్నాయి. ముఖ్యంగా, ఈ వివరాలన్నింటినీ ఆపిల్ ఇంకా ధృవీకరించలేదు. ఆపిల్ కొత్త ఐఫోన్ లైనప్‌ను ఎప్పుడు లాంచ్ చేస్తుందో వేచి చూడాల్సిందే.

Apple Airpods Pro 2 లాంచ్ :
ఈ ఆపిల్ ఈవెంట్‌లో, Apple AirPods 2 Proగా పిలిచే కొత్త AirPodలను కూడా ఆవిష్కరించనుంది. తాజా లీక్ ప్రకారం.. రాబోయే AirPods Pro 2, Apple H1 ప్రాసెసర్, Apple లాస్‌లెస్ ఆడియో కోడెక్ (ALAC) సపోర్ట్, ఇన్-ఇయర్ వింగ్ టిప్ డిజైన్, మరిన్నింటితో సహా అనేక అప్‌గ్రేడ్‌లతో వస్తుంది. కొత్త AirPodలు Apple Find My యాప్‌ని ఉపయోగించి Sound రిలీజ్ చేసే ఛార్జింగ్ కేస్‌తో కూడా వస్తాయని భావిస్తున్నారు.

Apple's Biggest Event of 2022 _ iPhone 14, AirPods Pro 2, Watch Series 8 and more launching

Apple’s Biggest Event of 2022 _ iPhone 14, AirPods Pro 2, Watch Series 8 and more launching

ఆపిల్ వాచ్ సిరీస్ 8, Watch Pro, Watch SE లాంచ్ :
ఆపిల్ లాంచ్ ఈవెంట్‌లో ఆపిల్ వాచ్ సిరీస్ 8, Watch Proలను అద్భుతమైన డిజైన్‌లతో లాంచ్ చేయనుందని భావిస్తున్నారు. ఆపిల్ వాచ్ SE 2 సరసమైన ధరకే రాబోతోందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. పుకార్ల ప్రకారం.. ఆపిల్ వాచ్ సిరీస్ 8 కొత్త బాడీ-టెంపరేచర్ సెన్సార్, సంతానోత్పత్తికి సంబంధించిన వుమెన్ హెల్త్ ఫీచర్లను కూడా తీసుకువస్తుంది. సరసమైన ధరకే వాచ్ SE 2 గతంలో మాదిరిగానే అదే డిజైన్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

అయితే పర్ఫార్మెన్స్ పరంగా అప్‌గ్రేడ్ అయ్యే అవకాశం ఉంది. S7 ప్రాసెసర్ కన్నా కొంచెం పవర్ ఫుల్‌గా S8 చిప్‌తో వస్తుందని అంచనా. ఈ వారంలో జరిగే ఈవెంట్‌లో ఆపిల్ వాచ్ ప్రో (Apple Watch Pro) ని ఆవిష్కరించనుంది. నివేదికల ప్రకారం.. ఈ వాచ్ S8 చిప్, బాడీ టెంపరేచర్ సెన్సార్, వుమెన్ హెల్త్ ఫీచర్లు వంటి స్ట్రాంగ్ డిజైన్, పెద్ద డిస్‌ప్లే, రీడిజైన్ వాచ్ ఫేస్‌లు, ఫిట్‌నెస్, హెల్త్-ట్రాకింగ్ ఫీచర్లు, పెద్ద బ్యాటరీతో మరిన్ని ఫీచర్లతో రానుంది.

కొత్త ఐప్యాడ్‌లు లాంచ్? :
అదనంగా, ఆపిల్ M2 ఐప్యాడ్ ప్రో మోడల్‌తో సహా కొత్త ఐప్యాడ్‌ను ఆవిష్కరిస్తుందని లీక్ నివేదికలు సూచిస్తున్నాయి. కంపెనీ సంప్రదాయాన్ని బట్టి చూస్తే లేదనే అనిపిస్తుంది. కొత్త ఐప్యాడ్‌లు, కొత్త Mac సహా మరిన్నింటిని ఆవిష్కరించడానికి కంపెనీ ఒక నెలలోపు మరో ఈవెంట్‌ను హోస్ట్ చేయవచ్చు. ఈ వారం ఆపిల్ ఈవెంట్ ఐఫోన్‌లు, ఎయిర్‌పాడ్‌లు, వాచ్‌లు ఎక్కువగా లాంచ్ కానున్నాయి.

Read Also : iphone 13 Deal : ఐఫోన్ 14 వస్తోంది.. ఐఫోన్ 13పై ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో భారీ డిస్కౌంట్లు.. ఎందులో డీల్ బెటర్ అంటే?