Samsung Galaxy Z Fold 5 : శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డబుల్ ఫోన్ల ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. ఫీచర్ల కోసమైనా ఈ మడతబెట్టే ఫోన్లను కొనేసుకోండి!
Samsung Galaxy Z Fold 5 : శాంసంగ్ మడతబెట్టే ఫోన్ల ఫస్ట్ సేల్ మొదలైంది. భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ Z Flip 5, గెలాక్సీ Z Fold 5 ఫోన్ వివిధ ప్లాట్‌ఫారమ్‌లు, రిటైల్ స్టోర్‌ల ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. ఈ వినూత్న ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం యూజర్లకు అనుకూలమైన ఆప్షన్లను అందిస్తోంది.

Samsung Galaxy Z Fold 5, Z Flip 5 first sale in India today
Samsung Galaxy Z Fold 5 : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) నుంచి రెండు ఫోల్డబుల్ ఫోన్ల ఫస్ట్ సేల్ మొదలైంది. Samsung Galaxy Z Fold 5, Galaxy Flip 5 ఇప్పుడు భారత మార్కెట్లో అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. Samsung.com, Amazon.in, Flipkart, ఇతర ప్రముఖ ఇ-కామర్స్ అవుట్‌లెట్‌లతో సహా వివిధ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కొనుగోలు చేయొచ్చు. అంతేకాకుండా, శాంసంగ్ గెలాక్సీ Z Fold 5, గెలాక్సీ Z Flip 5 రెండింటినీ దేశవ్యాప్తంగా ఉన్న అధీకృత రిటైల్ స్టోర్ల నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ వినూత్న ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను పొందేందుకు యూజర్లకు అనుకూలమైన ఆప్షన్లను అందిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ Z Fold 5 ఫోన్ 3 అద్భుతమైన ఐసీ బ్లూ, క్రీమ్, ఫాంటమ్ బ్లాక్ అనే 3 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. సంబంధిత ధరలతో విభిన్న స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లను అందిస్తుంది. 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,54,999కు ఆఫర్ చేస్తోంది. 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,64,999గా ఉంది. 12GB RAM + 1TB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. రూ.1,84,999కు పొందవచ్చు. మరోవైపు, శాంసంగ్ గెలాక్సీ Z Flip 5 ఫోన్ 4 ఆకర్షణీయమైన మింట్, క్రీమ్, గ్రాఫైట్, లావెండర్ అనే 4 కలర్ ఆప్షన్లలో వస్తుంది. 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 99,999, 8GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,09,999తో సంబంధిత ధరలతో రెండు స్టోరేజ్ ఆప్షన్‌లను అందిస్తుంది.
గెలాక్సీ Z Fold 5, గెలాక్సీ Z Flip 5 స్పెసిఫికేషన్‌లు ఇవే :
శాంసంగ్ గెలాక్సీ Z Flip 5 ఫోన్ OneUI 5.1.1 అనే ప్రత్యేక శాంసంగ్ ఇంటర్‌ఫేస్‌తో సరికొత్త Android 13 సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తుంది. ఈ ఫోన్ ఫ్రేమ్ బలమైన ఆర్మర్ అల్యూమినియంతో తయారైంది. ఈ ఫోన్‌లో 2 స్క్రీన్‌లు ఉన్నాయి. లోపల ప్రైమరీ స్క్రీన్ పెద్దదిగా ఉంటుంది. దాదాపు 6.7 అంగుళాలు, చాలా స్పష్టమైన హై-డెఫినిషన్‌లో చూపిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. త్వరగా సజావుగా మారవచ్చు. వెలుపల, ప్రాథమిక సమాచారం, నోటిఫికేషన్‌లను చూపే 3.4 అంగుళాల చిన్న స్క్రీన్ ఉంది. రెండు స్క్రీన్‌లు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 అనే బలమైన గ్లాసుతో ప్రొటెక్ట్ అయి ఉంటాయి.
గెలాక్సీ Z Flip 5 పవర్‌ఫుల్ Snapdragon 8 Gen 2 మొబైల్ ప్లాట్‌ఫారమ్‌పై రన్ అవుతుంది. ప్రత్యేకంగా శాంసంగ్ కోసం రూపొందించింది. 8GB మెమరీని కూడా కలిగి ఉంది. ఒకే సమయంలో అనేక యాప్‌లతో సాఫీగా పని చేయడంలో సాయపడుతుంది. ఈ ఫోన్‌లో మంచి కెమెరాలు ఉన్నాయి. ఫొటోలు తీయడానికి వెనుక 2 కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ ముందు భాగంలో కెమెరా కూడా ఉంది. మీరు 256GB లేదా 512GB స్టోరేజీతో ఫోన్‌ని పొందవచ్చు. ఫొటోలు, వీడియోలు, యాప్‌లను స్టోర్ చేసుకోవచ్చు. 5G, 4G LTE, Wi-Fi 6E, బ్లూటూత్ 5.3, NFCని ఉపయోగించి ఇంటర్నెట్‌కి కనెక్ట్ అవుతుంది. ఈ ఫోన్‌లో కొన్ని సెన్సార్‌లు ఉన్నాయి. సురక్షితమైన అన్‌లాకింగ్ కోసం సైడ్ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంది.

Samsung Galaxy Z Fold 5, Z Flip 5 first sale in India today
గెలాక్సీ Z Flip 5 పెద్ద బ్యాటరీని కలిగి ఉంది. 3,700mAh, 25W ఫాస్ట్ ఛార్జింగ్‌తో త్వరగా ఛార్జ్ అవుతుంది. కేవలం 30 నిమిషాల్లో జీరో నుంచి సగం వరకు పూర్తి అవుతుంది. ఈ ఫోన్ ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ 2.0, వైర్‌లెస్ పవర్‌షేర్‌ని ఉపయోగించి ఇతర డివైజ్‌లను వైర్‌లెస్‌గా ఛార్జ్ చేస్తుంది. ఈ ఫోన్ మడతపెట్టినప్పుడు దాదాపు 71.9×165.1×6.9mm, ఫోల్డ్ ఓపెన్ చేసినప్పుడు దాదాపు 71.9×85.1×15.1mm పరిమాణం ఉంటుంది. ఫోన్ 187 గ్రాముల బరువు ఉంటుంది. ఫోన్ సులభంగా తీసుకువెళ్లవచ్చు.
గెలాక్సీ Z Fold 5 వివరాలు :
గెలాక్సీ Z Fold 5 అనేది శాంసంగ్ 5వ ఫోల్డబుల్ ఫోన్ అని చెప్పవచ్చు. పెద్ద స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు. పెద్ద 7.6-అంగుళాల స్క్రీన్ కలర్ ఆప్షన్లను కలిగి ఉంది. ఈ ఫోన్ బలమైన ప్రాసెసర్, స్నాప్‌డ్రాగన్ 8 Gen 2పై రన్ అవుతుంది. గేమింగ్ సపోర్టు అందిస్తుంది. ప్రత్యేక S పెన్ ఫోల్డ్ ఎడిషన్, స్మార్ట్ కూలింగ్ సిస్టమ్ కలిగి ఉంది. ఈ ఫోన్ ఎక్కువసేపు గేమ్ ఆడిన డివైజ్ వేడిక్కెదు. బ్యాటరీ చాలా కాలం పాటు ఉంటుంది. మీరు ఐసీ బ్లూ, ఫాంటమ్ బ్లాక్, క్రీమ్ వంటి విభిన్న కలర్ ఆప్ష్లన నుంచి ఎంచుకోవచ్చు.
Read Also : Motorola Escape 210 Price : మోటోరోలా సరికొత్త ఆఫర్.. కేవలం రూ.1,949 ధరకే బ్లూటూత్ హెడ్‌ఫోన్.. డోంట్ మిస్!