Whatsapp Diwali Stickers : మీకు ఇష్టమైన వారికి వాట్సాప్‌లో బెస్ట్ క్వాలిటీతో ‘దీపావళి ఫొటోలు‘ ఎలా పంపాలో తెలుసా?

Whatsapp Diwali Photos : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) కేవలం మెసేజింగ్ యాప్ మాత్రమే కాదు. మీ విలువైన డాక్యుమెంట్లు, వీడియోలు, ఫోటోలను కూడా షేర్ చేసుకోవచ్చు. అయితే, అప్లికేషన్ డిఫాల్ట్‌గా ఇమేజ్ సైజును తగ్గిస్తుంది. ఈ ప్రక్రియలో షేర్ చేసిన ఫోటోల క్వాలీటీ తగ్గిపోతుంది.

Whatsapp Diwali Stickers : మీకు ఇష్టమైన వారికి వాట్సాప్‌లో బెస్ట్ క్వాలిటీతో ‘దీపావళి ఫొటోలు‘ ఎలా పంపాలో తెలుసా?

Sharing Diwali photos via WhatsApp_ Here’s how to send images in best quality

Whatsapp Diwali Stickers : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) కేవలం మెసేజింగ్ యాప్ మాత్రమే కాదు. మీ విలువైన డాక్యుమెంట్లు, వీడియోలు, ఫోటోలను కూడా షేర్ చేసుకోవచ్చు. అయితే, అప్లికేషన్ డిఫాల్ట్‌గా ఇమేజ్ సైజును తగ్గిస్తుంది. ఈ ప్రక్రియలో షేర్ చేసిన ఫోటోల క్వాలీటీ తగ్గిపోతుంది. ఇలా ఎందుకు జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే యాప్ సెట్టింగ్‌లలో ఫోటో క్వాలిటీ ఆటో మోడ్‌కి సెట్ అవుతుంది. దీని ఫలితంగా ఫోటో క్వాలిటీ తగ్గిపోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఫొటో క్వాలిటీ ఇంటర్నెట్ స్పీడ్, ఫొటో రియల్ సైజు, మరిన్నింటిపై కూడా ఆధారపడి ఉంటుంది.

మీరు వాట్సాప్‌లో ఈ క్వాలిటీ కంప్రెషన్ సమస్యను ఈ సింపుల్ ట్రిక్ ద్వారా నివారించవచ్చు. వాట్సాప్ ద్వారా హైక్వాలిటీ ఫోటోలను షేర్ చేసేందుకు ఇలా ట్రై చేయండి. అసలే దీపావళి పండుగ.. వాట్సాప్ యూజర్లు తమ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతుంటారు. ఫొటోలు, వీడియోలను పంపుతుంటారు. మీరు పంపే ఫొటోలు, వీడియోలు బెస్ట్ క్వాలిటీతో పంపాలనుకుంటే ఈ కింది విధంగా టిప్స్ పాటించండి.

* మీ ఫోన్‌లో WhatsApp ఓపెన్ చేయండి.
* త్రి డాట్స్‌పై Tap చేయండి. WhatsApp Settingsకు వెళ్లండి
* Storage, Data ఎంచుకోండి. దానిపై Tap చేయండి.
* ఇప్పుడు, ఫోటో అప్‌లోడ్ క్వాలిటీపై Tap చేయండి. Best Quality ఆప్షన్ ఎంచుకోండి.
* ఇప్పుడు, Okay బటన్‌పై Tap చేయండి.

Sharing Diwali photos via WhatsApp_ Here’s how to send images in best quality

Sharing Diwali photos via WhatsApp_ Here’s how to send images in best quality

మీరు WhatsApp Stickers ద్వారా మీ ప్రియమైనవారికి దీపావళి శుభాకాంక్షలు పంపాలనుకుంటే.. ఎలా పంపాలో ఇప్పుడు చూద్దాం.

* మీ స్మార్ట్‌ఫోన్ లేదా వెబ్‌లో WhatsAppని ఓపెన్ చేయండి. మీరు ఎవరికి స్టిక్కర్‌ని పంపాలనుకుంటున్నారో వారిని ఎంచుకోండి.
* టెక్స్ట్ బాక్స్‌కు ఎడమవైపు ఉన్న ‘Smiley’పై Tap చేయండి.
* GIF ఐకాన్ కుడి వైపున ఉంచబడిన ‘Sticker’ ఐకాన్ ఎంచుకోండి.
* మీరు ఇప్పటికే స్టిక్కర్‌లను డౌన్‌లోడ్ చేసి ఉంటే.. మీరు పంపాలనుకుంటున్న Sticker‌పై నొక్కండి.
* మీ దగ్గర Stickers లేకపోతే.. మీరు Stickers ప్యాక్‌ని కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
* స్టిక్కర్‌ల సెక్షన్‌లో రైట్ టాప్ కార్నర్‌లో ఉన్న ‘+’ ఐకాన్‌పై నొక్కండి.
* మీరు ఇష్టపడే స్టిక్కర్ ప్యాక్‌ని ఎంచుకోండి.
* ఈ ప్రక్రియను ప్రారంభించడానికి ప్యాక్ ‘Download‘ ఐకాన్‌పై నొక్కండి.
* డౌన్‌లోడ్ చేసిన తర్వాత, స్టిక్కర్‌లు ‘స్టిక్కర్’ Tab కింద కనిపిస్తాయి.
* మీరు కేవలం Tap చేయడం ద్వారా మీకు ఇష్టమైన వాటి నుంచి ఒకదాన్ని ఎంచుకోవచ్చు.
* మీ స్టిక్కర్లను డిలీట్ చేయడానికి ‘My Stickers’ Tabకి వెళ్లి, ‘Delete బటన్’ నొక్కండి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Jio vs Vi Diwali Offers : Jio vs Vi యూజర్లకు దీపావళి ఆఫర్లు.. కొన్ని బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు మీకోసం..!