Telegram Anonymous Number : టెలిగ్రామ్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. కొత్త యూజర్లు SIM కార్డు లేకుండానే లాగిన్ కావొచ్చు.. ఎలా పనిచేస్తుందో తెలుసా?

Telegram Anonymous Number : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) పోటీదారుల్లో ఒకటైన టెలిగ్రామ్ (Telegram) కొత్త యూజర్లకు SIM కార్డ్ లేకుండా సైన్‌అప్ (Sign Up) చేసేందుకు కొత్త అప్‌డేట్ ప్రకటించింది. ఈ ఫీచర్‌ను యూజర్ల ప్రైవసీ కోసమే తీసుకొచ్చినట్టు కంపెనీ చెబుతోంది.

Telegram Anonymous Number : టెలిగ్రామ్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. కొత్త యూజర్లు SIM కార్డు లేకుండానే లాగిన్ కావొచ్చు.. ఎలా పనిచేస్తుందో తెలుసా?

Telegram now lets new users sign up with anonymous number_ How it works

Telegram Anonymous Number : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) పోటీదారుల్లో ఒకటైన టెలిగ్రామ్ (Telegram) కొత్త యూజర్లకు SIM కార్డ్ లేకుండా సైన్‌అప్ (Sign Up) చేసేందుకు కొత్త అప్‌డేట్ ప్రకటించింది. ఈ ఫీచర్‌ను యూజర్ల ప్రైవసీ కోసమే తీసుకొచ్చినట్టు కంపెనీ చెబుతోంది. వినియోగదారులు ఫ్రాగ్‌మెంట్ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉన్న బ్లాక్‌చెయిన్-పవర్డ్ గుర్తుతెలియని నంబర్‌ను ఉపయోగించి లాగిన్ చేయవచ్చు. వినియోగదారులు తమ సొంత నంబర్‌లను షేర్ చేయడం సౌకర్యంగా లేకుంటే.. ఫ్రాగ్‌మెంట్‌లో అనామక ఫోన్ నంబర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఈ ప్లాట్‌ఫారమ్‌లోకి లాగిన్ అవ్వడానికి OTP పొందాల్సి ఉంటుంది.

అందుకు పర్సనల్ మొబైల్ నంబర్‌లు అవసరమవుతుంది. కానీ, ఈ కొత్త టెలిగ్రామ్ ఫీచర్ సాయంతో ఎలాంటి ఫోన్ నెంబర్ లేకుండానే సులభంగా టెలిగ్రామ్ అకౌంట్లో లాగిన్ కావొచ్చు. WhatsApp, Signal మెసేజ్ యాప్ కన్నా ఇప్పటికీ టెలిగ్రామ్‌కు ఆకర్షణీయమైన ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ టెలిగ్రామ్ ఫీచర్‌ని ఉపయోగించాలంటే.. గెట్ స్టార్ట్ (Get Start), స్టార్ట్ మెసేజింగ్ (Start Messaging)పై Click చేయాలి. ఫ్రాగ్‌మెంట్ నుంచి నంబర్‌ను ఎంటర్ చేసి, ప్లాట్‌ఫారమ్ నుంచి వెరిఫికేషన్ కోడ్‌ను ఎంటర్ చేయండి.

టెలిగ్రామ్‌లో మరెన్నో సరికొత్త ఫీచర్లు :

ఇప్పటికే టెలిగ్రామ్ కొత్త అప్‌డేట్‌తో కొత్త ఫీచర్లను కూడా యాడ్ చేస్తోంది. ఉదాహరణకు.. యూజర్లు ఇప్పుడు అన్ని చాట్‌లను ఆటోమాటిక్‌గా డిలీట్ చేయవచ్చు. మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ ఇప్పటికే 2013 నుంచి (self-destructing messages) మెసేజ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అందిస్తోంది. టెలిగ్రామ్ యూజర్లు తాము పంపే లేదా స్వీకరించే మెసేజ్‌లను పూర్తిగా డిలీట్ చేసేందుకు అనుమతిస్తుంది. కొంత సమయం తర్వాత పర్సనల్ చాట్‌లను క్లీన్ చేసేందుకు ఆటో-డిలీట్ టైమర్‌లను కూడా సెటప్ చేయవచ్చు.

Read Also : Telegram Premium : టెలిగ్రామ్ మానిటైజేషన్ ప్లాన్‌ వచ్చేసింది.. ప్రీమియంతో బెనిఫిట్స్ ఏంటి?

Telegram now lets new users sign up with anonymous number_ How it works

Telegram now lets new users sign up with anonymous number_ How it works

అన్ని చాట్‌లను (Auto-Delete All Chats) ఫీచర్‌ని వాడాలంటే.. Settings > Privacy & Security > Auto-Delete Messages వెళ్లండి. యూజర్లతో మీ కొత్త చాట్‌లన్నింటికీ టైమర్ ఆటోమాటిక్‌గా సెట్ అవుతుంది. టెలిగ్రామ్ చాట్ కొత్త గ్రూపులకు కూడా వర్తిస్తుంది. గ్రూప్ టాపిక్‌లను మెరుగ్గా నిర్వహించడానికి గ్రూప్ అడ్మిన్‌లను మల్టీ థ్రెడ్‌లుగా కేటగిరీలుగా చేయడానికి Topics 2.0 ఇతర కొత్త ఫీచర్‌లను అందిస్తుంది. పబ్లిక్ యూజర్‌నేమ్ ఉన్న టెలిగ్రామ్ యూజర్లు తమ చుట్టూ ఉన్న యూజర్లతో త్వరగా కనెక్ట్ అవ్వడానికి QR కోడ్‌లను రూపొందించవచ్చు.

టెలిగ్రామ్‌లో ఇప్పుడు మీకు యూజర్ నేమ్ లేకపోయినా.. మీ ఫోన్ నంబర్‌ను హైడ్ చేసినా తాత్కాలిక QR కోడ్‌ను రూపొందించడానికి అనుమతిస్తుంది. ఐఫోన్ టెలిగ్రామ్ యూజర్లు అదనంగా ఇప్పుడు ఆండ్రాయిడ్ క్లయింట్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎమోజీల కోసం సెర్చ్ చేయవచ్చు. టెలిగ్రామ్ ఎమోజి కీవర్డ్ కోసం వినియోగదారులు ట్రాన్సలేషన్ ప్లాట్‌ఫారమ్‌కు వెళ్లవచ్చు. దీని ఆధారంగా ఎమోజి సూచనలను చూసేందుకు యూజర్లు మెసేజ్ ప్రారంభంలో ‘Happy’ లేదా ‘Smile’ వంటి కీలక పదాలను టైప్ చేయవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Telegram Premium : టెలిగ్రామ్ మానిటైజేషన్ ప్లాన్‌ వచ్చేసింది.. ప్రీమియంతో బెనిఫిట్స్ ఏంటి?