iPhone Device Risk : మీరు పాత్ ఐఫోన్ లేదా ఐప్యాడ్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. మీ డేటాకు ముప్పు.. వెంటనే అప్‌డేట్ చేసుకోండి!

iPhone Device Risk : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) ప్రొడక్టుల్లో ఐఫోన్, ఐప్యాడ్ ఎంతో పాపులర్.. ఆపిల్ యూజర్ల డేటా భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఏదైనా Apple డివైజ్‌లో భద్రతాపరమైన ముప్పు ఎదుర్కోవడం సాధారణ విషయమే కాదు..

iPhone Device Risk : మీరు పాత్ ఐఫోన్ లేదా ఐప్యాడ్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. మీ డేటాకు ముప్పు.. వెంటనే అప్‌డేట్ చేసుకోండి!

Using an old iPhone or iPad_ Your device could be at high risk, update now

iPhone Device Risk : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) ప్రొడక్టుల్లో ఐఫోన్, ఐప్యాడ్ ఎంతో పాపులర్.. ఆపిల్ యూజర్ల డేటా భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఏదైనా Apple డివైజ్‌లో భద్రతాపరమైన ముప్పు ఎదుర్కోవడం సాధారణ విషయమే కాదు.. టెక్ దిగ్గజం తమ యూజర్ల డేటాను భద్రపరచడానికి మెరుగైన భద్రతా ఫీచర్లను ఎప్పటికప్పుడూ అప్‌డేట్‌ చేస్తూనే ఉంది. మీరు పాత ఐఫోన్ లేదా ఐప్యాడ్‌ని ఉపయోగిస్తున్నట్లయితే.. మీ డివైజ్ చాలా కాలంగా అప్‌డేట్ చేయని పక్షంలో చాలా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది.

CERT-In సమస్యలు, iOS యూజర్లను హెచ్చరిస్తోంది. భారత జాతీయ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ అయిన ఇండియన్ కంప్యూటర్ రెస్పాన్స్ టీమ్ (CERT-In), iOSలో హ్యాకర్లు తమ డివైజ్ యాక్సెస్ చేసేందుకు అనుమతించే లోపాన్ని గురించి iPhone యూజర్ల అందరికి హెచ్చరిక జారీ చేసింది. మీ సిస్టమ్‌లో ఏకపక్ష కోడ్‌ను అమలు చేసేందుకు అనుమతిస్తుందని హెచ్చరిక పేర్కొంది. ఈ లోపం వెనుక కారణం WebKit కాంపోనెంట్‌లోని ఒక సెక్షన్.. దీనిని హ్యాకర్లు సులభంగా యాక్సస్ చేసుకునే వీలుంది.

Read Also : Adani Group Companies Loss : హిండెన్ బర్గ్ రిపోర్టు ఎఫెక్ట్.. అదానీ గ్రూప్ కంపెనీలకు భారీ నష్టాలు

హ్యాకర్లు టార్గెట్ చేస్తున్న Apple డివైజ్‌లివే :
12.5.7 కన్నా ముందు iOS వెర్షన్‌లలో రన్ అవుతున్న డివైజ్‌లు భద్రతా లోపాల బారిన పడే ప్రమాదం కలిగిన Apple డివైజ్ కొన్ని ఉన్నాయి. అవి iPhone 5s, iPhone 6, iPhone 6 Plus, iPad Air, iPad mini 2, iPad mini 3, iPod touch (6వ జనరేషన్). CERT-In ప్రకారం.. హ్యాకర్లు భద్రతా లోపాన్ని లక్ష్యంగా చేసుకుని హ్యాకింగ్ కు పాల్పడుతుంటారు. iOS 15.1కి ముందు రిలీజ్ చేసిన iOS వెర్షన్లలో ఈ డేటా రిస్క్ ఎక్కువగా ఉంది.

Using an old iPhone or iPad_ Your device could be at high risk, update now

Using an old iPhone or iPad_ Your device could be at high risk

యూజర్లు ఎలా సేఫ్‌గా ఉండగలరంటే? :
హ్యాకర్ల నుంచి యూజర్ల డేటాను సురక్షితంగా ఉంచాలంటే.. తమ డివైజ్‌లను వీలైనంత త్వరగా అప్‌డేట్ చేయాలి. Apple iOS 12.5.7 సెక్యూరిటీ ప్యాచ్‌ని రిలీజ్ చేసింది. మీ డివైజ్‌లో ఈ ప్యాచ్ సులభంగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ప్యాచ్ జనవరి 23న రిలీజ్ అయింది. ప్యాచ్‌ని రిలీజ్ చేసే సమయంలో, ఆపిల్ ఒక నోట్ షేర్ చేసింది. హానికరమైన రీతిలో రూపొందించిన వెబ్ కంటెంట్‌ను ప్రాసెస్ చేయడంతో ఏకపక్ష కోడ్ ఇంజెక్ట్ చేయొచ్చు. iOS 15.1కి ముందు రిలీజ్ అయిన iOS వెర్షన్లకు వ్యతిరేకంగా ఈ సమస్య యాక్టివ్ అవుతుందనే నివేదిక ద్వారా ఆపిల్ తెలిపింది.

మీ డివైజ్ ఎలా అప్‌డేట్ చేయాలంటే? :
సెట్టింగ్‌ల మెనుని యాక్సెస్ చేయండి. జనరల్ ట్యాబ్‌కు వెళ్లడం ద్వారా అన్ని డివైజ్ లను అప్ డేట్ చేసుకోవచ్చు. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ట్యాబ్‌ను గుర్తించి, డౌన్‌లోడ్, ఇన్‌స్టాల్ అప్‌డేట్‌పై క్లిక్ చేయండి. కొన్ని కారణాల వల్ల డివైజ్ అప్‌డేట్ చేయలేక పోతే, మీ ఫోన్‌లు ఐప్యాడ్‌ల నుంచి ఫొటోలు, పాస్‌వర్డ్‌లు, నెట్ బ్యాంకింగ్ డేటా మొదలైన మీ సున్నితమైన డేటాను వీలైనంత త్వరగా తొలగించండి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Bank SMS Scam : బ్యాంకు SMS స్కామ్.. మహిళను ఇలా నమ్మించి రూ. లక్ష కొట్టేసిన సైబర్ మోసగాళ్లు.. ఈ స్కామ్ ఏంటి? సేఫ్‌గా ఉండేందుకు ఏం చేయాలంటే?