Adani Group Companies Loss : హిండెన్ బర్గ్ రిపోర్టు ఎఫెక్ట్.. అదానీ గ్రూప్ కంపెనీలకు భారీ నష్టాలు

హిండెన్ బర్గ్ రిపోర్టుకు అదానీ గ్రూప్ ఇచ్చిన వివరణతో ఇన్వెస్టర్లు సంతృప్తి చెందలేదు. హిండెన్ బర్గ్ రిపోర్టుకు అదానీ గ్రూప్ ఇచ్చిన వివరణతో ఇన్వెస్టర్లు సంతృప్తి చెందలేదు. అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవ్వడంతో ఇవాళ భారీగా నష్టాలను చవి చూశాయి. మూడో షెషన్ లోనూ అదానీ గ్రూప్ కంపెనీలు భారీ నష్టాలను చవి చూశాయి.

Adani Group Companies Loss : హిండెన్ బర్గ్ రిపోర్టు ఎఫెక్ట్.. అదానీ గ్రూప్ కంపెనీలకు భారీ నష్టాలు

ADANI

Adani Group Companies Loss : హిండెన్ బర్గ్ రిపోర్టుకు అదానీ గ్రూప్ ఇచ్చిన వివరణతో ఇన్వెస్టర్లు సంతృప్తి చెందలేదు. హిండెన్ బర్గ్ రిపోర్టుకు అదానీ గ్రూప్ ఇచ్చిన వివరణతో ఇన్వెస్టర్లు సంతృప్తి చెందలేదు. అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవ్వడంతో ఇవాళ భారీగా నష్టాలను చవి చూశాయి. మూడో షెషన్ లోనూ అదానీ గ్రూప్ కంపెనీలు భారీ నష్టాలను చవి చూశాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, అంబూజా సిమెంట్ మినహా అదానీ గ్రూప్ లోని మిగిలిన అన్ని కంపెనీల షేర్లు నేల చూపులే చూశాయి.

దాదాపు ఐదు కంపెనీలు లోయర్ సర్క్యూట్ ను తాకడం, అదానీ గ్రూప్ కంపెనీల షేర్లపై ఇన్వెస్టర్లలో భయానికి సంకేతంగా కనిపిస్తోంది. హిండెన్ బర్గ్ రిపోర్టు బయటికి వచ్చినప్పటి నుంచి మూడు సెషన్లలోనూ అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు నష్టాల బాట పట్టడంతో ఏకంగా రూ.5 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ విలువను కోల్పోయాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్ ధర 4.76 శాతం పడటం ఒకటే ఆ కంపెనీకి ఊరటగా కనిపిస్తోంది. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్ 20 శాతం నష్ట పోయి లోయర్ సర్క్యూట్ ను తాకాయి.

Adani LIC Shares : అదానీ గ్రూప్ ఎఫెక్ట్.. ఎల్ఐసీ పరిస్థితి ఏంటి? ప్రమాదంలో కోట్లాది మంది బీమా సొమ్ము

అదానీ ట్రాన్స్ మిషన్ కూడా ఓ దశలో లోయర్ సర్క్యూట్ ను తాకినప్పటికీ తిరిగి కోలుకుంది. చివరికి 15 శాతం నష్టంతో రూ.1708 వద్ద ముగిసింది. అదానీ పవర్, అదానీ వెల్మర్ కూడా 5 శాతం చొప్పున నష్ట పోయి లోయర్ సర్క్యూట్ ను తాకాయి. ఈ మధ్య అదానీ గ్రూప్ లోకి వచ్చిన ఎన్ డీ టీవీ కూడా 5 శాతం నష్ట పోయింది. ఏసీసీ షేర్ ఏకంగా 20 శాతం నష్ట పోయింది.  అదానీ పోర్ట్స్ మాత్రం ఒడిదుడుకులకు లోనై చివరకు నిన్నటి ధరకు కాస్త ఎగువన ముగిసింది.

మొత్తం మీద చూస్తే హిండెన్ బర్న్ రిపోర్టు రావడానికి ముందు అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ దాదాపు 19 లక్షల కోట్లు ఉండగా సోమవారం ట్రేడింగ్ ముగిసే సరికి 14 లక్షల కోట్లకు పడిపోయింది. అటు అదానీ గ్రూప్ ఇచ్చిన 413 పేజీల సమాధానంపై హిండెన్ బర్గ్ తీవ్రంగా స్పందించింది. ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా దోపిడీకి జాతీయవాదం ముసుగు కప్పుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. భారత్, భారతీయ సంస్థలు అవి సాధిస్తున్న వృద్ధిపై అక్కసుతోనే అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ తమపై ఆరోపణలు చేసిందని గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ బదులిచ్చిందిADANI ..Hindenburg Report : అదానీ గ్రూప్ కంపెనీల పునాదుల్ని షేక్ చేసిన ‘ఒక్క రిపోర్ట్’‌.. హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్ చెప్పిందేంటి..?

ఈ ఆరోపణలన్నీ నిరాధారణమైనవని, అసత్యాలని కొట్టి పారేసింది. దీనికి వెంటనే బదులిచ్చిన హిండెన్ బర్గ్ వాస్తవిక సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు జాతీయ వాదాన్ని వినిపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అదానీ గ్రూప్ జాతీయ జెండా ముసుగుతో దేశాన్ని క్రమ పద్ధతిలో దోచు కుంటుందని ఆరోపించింది. 88 ప్రశ్నలు సందిస్తే వాటిలో 62 ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో అదానీ గ్రూప్ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇక అదానీ గ్రూప్ లో పెట్టుబడులపైన ఎల్ఐసీ ప్రకటన విడుదల చేసింది. మార్కెట్ లో తాము పెట్టిన పెట్టుబడులతో పోల్చితే అదానీ గ్రూప్ లో ఉన్నది కేవలం ఒకటి శాతం లోపే అని ఎల్ఐసీ అంటోంది. ఇక ఇప్పటివరకు అదానీ గ్రూప్ లో 30,127 కోట్లు ఇన్వెస్ట్ చేయగా జనవరి 27 నాటికి ఆ వాటా విలువ ఆ వాటా విలువ 56, 142 కోట్లకు చేరిందని ప్రకటన చేసింది. ఐఆర్డీఏఐ నిబంధనలకు లోబడే తాము అదానీ గ్రూప్ లో చేశామని ఎల్ ఐసీ అంటోంది.