Vehicle Sales : జూలైలో పెరిగిన వాహనాల అమ్మకాలు

ఆటోమొబైల్ కంపెనీలు జులై 2021 అమ్మకాల గణాంకాలు విడుదల చేశాయి. ఈ గణాంకాలు ప్రకారం జులై నెలలో ఫోర్ వీలర్స్ అమ్మకాలు కొంతమేరకు పెరిగాయి. కంపెనీల వారీగా అమ్మకాలు చూస్తే.. మారుతి కంపెనీ జులై నెలలో 1,62,462 వాహనాలు విక్రయించింది. వీటిలో 1,36,500 వాహనాలు భారతదేశంలో విక్రయించారు.

Vehicle Sales : జూలైలో పెరిగిన వాహనాల అమ్మకాలు

Vehicle Sales (2)

Vehicle Sales : ఆటోమొబైల్ కంపెనీలు జులై 2021 అమ్మకాల గణాంకాలు విడుదల చేశాయి. ఈ గణాంకాలు ప్రకారం జులై నెలలో ఫోర్ వీలర్స్ అమ్మకాలు కొంతమేరకు పెరిగాయి. కంపెనీల వారీగా అమ్మకాలు చూస్తే.. మారుతి కంపెనీ జులై నెలలో 1,62,462 వాహనాలు విక్రయించింది. వీటిలో 1,36,500 వాహనాలు భారతదేశంలో విక్రయించారు. 21,224 వాహనాలను ఎగుమతి చేశారు. 4,738 వాహనాలు ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారుల (ఓఈఎం) నుంచి వచ్చినవి.

గతేడాది జులైతో పోలిస్తే వాహన విక్రయాలు 50.33 శాతం పెరిగినట్లు మారుతి కంపెనీ తెలిపింది. 2020 జులైలో మారుతి మొత్తం 1,08,064 వాహనాలు అమ్మింది. ఇక ఈ ఏడాది జూన్ తో పోల్చితే జులైలో 19 శాతం ఎక్కువ వాహనాలను విక్రయించింది. ఇక టాటా మోటర్స్ 52 వేల వాహనాలను విక్రయించింది. హోండా కార్లు దేశీయ అమ్మకాలలో 12 సంవత్సరాల రికార్డును అధిగమించాయి. నిస్సాన్ కంపెనీ వాహనాల దేశీయ అమ్మకాలు 2021 జూలైలో పెరిగింది.

2020 జులైలో 2,375 వాహనాలను ఎగుమతి చేయగా, ఈ జూలైలో కంపెనీ 3,897 వాహనాలను ఎగుమతి చేసింది. ఇక హోండా కంపెనీ కార్లు 12 ఏండ్లలో అత్యధిక దేశీయ అమ్మకాలు జరిగింది. హోండా కార్ ఇండియా లిమిటెడ్ దేశీయ మార్కెట్లో 6,055 వాహనాలను విక్రయించడం ద్వారా జూలైలో 12 ఏండ్ల రికార్డును అధిగమించింది.