Vivo V-series Sale : వివో నుంచి 108MP భారీ కెమెరాతో కొత్త ఫోన్.. జనవరి 13నుంచే ఫ్లిప్ కార్ట్ సేల్..!

చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో (Vivo) నుంచి సరికొత్త V-Series స్మార్ట్ ఫోన్ వస్తోంది. కెమెరా-సెంట్రిక్ V-Series కింద ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో రిలీజ్ చేసింది.

Vivo V-series Sale : వివో నుంచి 108MP భారీ కెమెరాతో కొత్త ఫోన్.. జనవరి 13నుంచే ఫ్లిప్ కార్ట్ సేల్..!

Vivo V Series Vivo Launches V Series Smartphones With 108mp Main, 50mp Selfie Lens

Vivo V-series Sale : చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో (Vivo) నుంచి సరికొత్త V-Series స్మార్ట్ ఫోన్ వస్తోంది. కెమెరా-సెంట్రిక్ V-Series కింద ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. అదే.. Vivo V23 సిరీస్ స్మార్ట్ ఫోన్.. ఈ రెండు వేరియంట్లలో వచ్చింది. Vivo V23, Vivo V23 Pro రెండు మోడల్స్.. 5G స్మార్ట్‌ఫోన్‌ సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. బ్యాక్ సైడ్ డిజైన్ డ్యూయల్ టోన్ కలిగి ఉంది. ఇక కెమెరా ఫీచర్ల విషయానికి వస్తే.. ట్రిపుల్ రియర్ కెమెరాలో 108MP మెయిన్ రియర్ లెన్స్‌, మాక్రో అల్ట్రా-వైడ్ సెన్సార్‌తో వచ్చింది.

వివో v23 సిరీస్ Gates Media Tech Dimensity 1200 SoCతో రన్ అవుతుంది. ఈ కొత్త Vivo V23 సిరీస్‌ స్మార్ట్ ఫోన్ Flipkartలో అందుబాటులో ఉండనుంది. Vivo V23, Vivo V23 Pro రెండు మోడల్స్ జనవరి 13 నుంచి జనవరి 19, 2022 ఫ్లిప్ కార్ట్ సేల్ అందుబాటులో ఉంటుంది. ఈ రెండు వేరియంట్లు సన్‌షైన్ గోల్డ్, స్టార్‌డస్ట్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనుంది.

V23 Pro V23 స్మార్ట్ ఫోన్లు 6.56 అంగుళాలు, 6.44 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వచ్చాయి. Vivo V23 స్మార్ట్ ఫోన్.. 4,200mAh బ్యాటరీతో రన్ అవుతుంది. MediaTek డైమెన్సిటీ 920 SoC ద్వారా రన్ నడుస్తుంది. V23లో 64MP మెయిన్ లెన్స్, 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్ 2MP మాక్రో లెన్స్ ఉన్నాయి. 50MP+98MP రిజల్యూషన్‌తో కూడిన డ్యూయల్ సెల్ఫీ కెమెరాలతో యూజర్లను ఆకట్టుకునేలా ఉంది.

ధర ఎంతంటే? :
V23 Pro : ధర రూ. 38,990 (8GB+128GB)
రూ. 43,990 (12GB+256GB)

V23 ధర : 29,990 (8GB+128GB)
రూ. 34,990 (12GB+256GB).

కెమెరా ఫీచర్లు ఇవే :
Vivo V23 Pro 108MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP మాక్రో సెన్సార్‌, 50MP డ్యూయల్ సెల్ఫీ లెన్స్, 8MP వైడ్ యాంగిల్ లెన్స్, Vivo V23 Pro : Android 12 ఆధారిత Funtouch OS 12పై రన్ అవుతుంది. 4,300mAh బ్యాటరీ సామర్థ్యంలో వచ్చింది.

Read Also : Corona Cases Telangana : తెలంగాణలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా.. 5 రోజుల్లోనే 5 రెట్లు పెరిగిన కేసులు