Corona Cases Telangana : తెలంగాణలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా.. 5 రోజుల్లోనే 5 రెట్లు పెరిగిన కేసులు

తెలంగాణలో ఏడు నెలల పాటు స్థిరంగా నమోదవుతూ వచ్చిన కరోనా కేసులు వారం నుంచి అనూహ్యంగా పెరుగుతున్నాయి. వారం క్రితం 0.73 శాతం పాజిటివిటీ రేటు ఐదు రెట్లకు పైగా పెరిగింది.

Corona Cases Telangana : తెలంగాణలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా.. 5 రోజుల్లోనే 5 రెట్లు పెరిగిన కేసులు

Corona Virus

Corona cases in Telangana : తగ్గిపోయిందనుకున్న కరోనా..మళ్లీ దేశవ్యాప్తంగా విజృంభిస్తోంది. తెలంగాణలోనూ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఒమిక్రాన్‌ వేరియంట్‌తో పాటు కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. వరుసగా రెండో రోజు తెలంగాణలో కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగాయి. మంగళవారం 1,052 మంది కరోనా బారినపడితే.. బుధవారం కొత్తగా నమోదైన కేసులు దాదాపు 50 శాతం అధికమయ్యాయి. నిన్న ఒక్కరోజే తెలంగాణలో 1,520 కరోనా కేసులు రికార్డయ్యాయి.

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 979 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 176, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో 132 మంది కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,168 యాక్టివ్‌ కేసులున్నాయి. 84 శాతం కేసులు జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాల పరిధిలోనే నమోదవుతున్నాయి.

Nagarjuna’s Comments : నాగార్జున వ్యాఖ్యలపై స్టార్ హీరోలు, పెద్ద నిర్మాతల అసంతృప్తి

తెలంగాణలో ఏడు నెలల పాటు స్థిరంగా నమోదవుతూ వచ్చిన కరోనా కేసులు వారం నుంచి అనూహ్యంగా పెరుగుతున్నాయి. వారం క్రితం 0.73 శాతం పాజిటివిటీ రేటు ఐదు రెట్లకు పైగా పెరిగింది. ఈ నెల 1 తేదీ నుంచి చూస్తే ఐదు రోజుల్లోనే దాదాపు ఐదు రెట్ల కేసులు పెరిగాయి. ఈ నెల 1న 317 మంది కరోనా బారినపడితే రెండో తేదీన 274 మందికి సోకింది. 3న 482 మందికకి పాజిటివ్‌ నిర్ధారణ అయితే..4న ఏకంగా వెయ్యి కేసులు దాటాయి.

నిన్న 15 వందల 20 కేసులొచ్చాయి. పాజిటివిటీ రేట్‌ సైతం ఈ నెల 1న 1.10 శాతంగా ఉంటే.. ఐదు రోజులకే 3.57 శాతానికి పెరిగింది. యాక్టివ్‌ కేసులు కూడా గణనీయంగా పెరిగిపోయాయి. జనవరి 1న 3 వేల 733 యాక్టివ్ కేసులుంటే 3న 4 వేల 48 యాక్టివ్‌ కేసులున్నాయి. 4వ తేదీకి 4 వేల 858 క్రియాశీల కేసులుంటే.. 5వ తేదీకి 6 వేలు దాటేశాయి. ప్రస్తుతం తెలంగాణలో 6 వేల 168 యాక్టివ్‌ కేసులున్నాయి

India Corona : భారత్ లో మళ్లీ కరోనా విజృంభణ.. కొత్తగా 90,928 పాజిటివ్ కేసులు, 325 మరణాలు

జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్‌లో భారీగా కేసులు నమోదు అయ్యాయి. కరోనా వ్యాప్తితో తెలంగాణ సర్కార్‌ అప్రమత్తమైంది. కరోనా టెస్ట్‌ సెంటర్లు, బెడ్లు, ఆక్సిజన్ ప్లాంట్లను సర్కార్‌ పెంచుతోంది. ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. కోవిడ్‌ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఆసుపత్రుల్లో సౌకర్యాలు పెంచాలన్నారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.