Nagarjuna’s Comments : నాగార్జున వ్యాఖ్యలపై స్టార్ హీరోలు, పెద్ద నిర్మాతల అసంతృప్తి

నాగార్జున వ్యాఖ్యలపై స్టార్ హీరోలు, పెద్ద నిర్మాతల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున ఏకపక్షంగా మాట్లాడారని టాలీవుడ్‌లో విమర్శలు వెల్లువెత్తున్నాయి.

Nagarjuna’s Comments : నాగార్జున వ్యాఖ్యలపై స్టార్ హీరోలు, పెద్ద నిర్మాతల అసంతృప్తి

Corona (2)

Nagarjuna’s Comments : టాలీవుడ్‌లో టిక్కెట్ రేట్ల వివాదం…డైలీ సీరియల్‌లా సాగుతోంది. పేర్ని నాని… రామ్‌గోపాల్ వర్మ మధ్య త్వరలోనే చర్చలు జరుగుతాయనుకుంటున్న సమయంలో టిక్కెట్ల రేట్లపై నాగార్జున చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. టిక్కెట్ రేట్లు తగ్గించినా తన సినిమాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదంటూ నాగ్ చేసిన వ్యాఖ్యలపై ఇండస్ట్రీలోని కొందరు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. నాగార్జున వ్యాఖ్యలపై స్టార్ హీరోలు, పెద్ద నిర్మాతల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున ఏకపక్షంగా మాట్లాడారని టాలీవుడ్‌లో విమర్శలు వెల్లువెత్తున్నాయి.

ఏపీలో టికెట్‌ రేట్లు ‘బంగార్రాజు’ సినిమాకు ఇబ్బంది కాదన్నారు. టికెట్‌ రేట్లు తక్కువుంటే తక్కువ డబ్బులు వస్తాయన్న నాగార్జున.. టికెట్‌ రేట్లు ఎక్కువుంటే ఎక్కువ డబ్బులు వస్తాయన్నారు. అన్నీ సవ్యంగా ఉంటే సంక్రాంతికి బంగార్రాజు రిలీజ్‌ చేస్తామన్నారు.

India Corona : భారత్ లో మళ్లీ కరోనా విజృంభణ.. కొత్తగా 90,928 పాజిటివ్ కేసులు, 325 మరణాలు

అటు ఏపీలో సినిమా టికెట్ల రేట్ల విషయంలో దర్శకులు రామ్ గోపాల్ వర్మకి మంత్రి పేర్ని నానికి మధ్య జరిగిన ట్వీట్ల యుద్ధం చర్చల వైపు మళ్లింది. మొదట.. టాలీవుడ్ వర్సెస్ ఏపీ మినిస్టర్స్ అని అనుకున్నా.. అవకాశం ఇవ్వండి కలుస్తాను అంటూ ఆర్జీవీ పెట్టిన రిక్వెస్ట్‌కు స్పందించిన పేర్ని నాని.. రండి.. తప్పకుండా త్వరలో కలుద్దాం అంటూ అపాయింట్‌మెంట్ ఇవ్వడంతో.. టికెట్ల రేట్ల విషయంలో జరుగుతున్న ట్వీట్ వార్ క్లైమాక్స్‌కు చేరింది. అయితే ఇప్పటి వరకు పేర్ని నానితో వర్మకు అపాయింట్‌మెంట్ ఖరారు కాలేదు.

వాస్తవంగా నిన్న ఉదయం డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రభుత్వానికి ప్రశ్నలు సంధిస్తూ వరుసగా ట్వీట్లు చేశారు. మొత్త పది ప్రశ్నలను గుప్పించారు ఆర్జీవీ. వాటికి స్పందించారు ఏపీ సినిమాటోగ్రఫి మంత్రి పేర్నీ నానీ. రామ్‌గోపాల్ వర్మ ప్రభుత్వానికి సంధించిన పది ప్రశ్నలకు ఘాటుగా రిప్లై ఇచ్చారు. వర్మ వేసిన ఒక్కో ప్రశ్నకు రివర్స్ కౌంటర్లిసూ.. చట్టంలో ఏముంది.. ప్రభుత్వం ఏం చేస్తోంది.

Fire Broke Out : అమెరికాలో ఘోర అగ్నిప్రమాదం.. ఇంట్లో మంటలు చెలరేగి 13మంది సజీవదహనం

సినిమా వాళ్లు ఏం చేయాలో చెబుతూ క్లాస్ తీసుకున్నారు పేర్ని నాని. మంత్రి ఇచ్చిన సమాధానాలు.. సంధించిన ప్రశ్నలకి రీ ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. అనుమతిస్తే.. మిమ్మల్ని కలిసి మా తరఫున మా సమస్యలకు సంబంధించి వివరణ ఇస్తాను.. అది విన్న తర్వాత ఆలోచించి సరైన పరిష్కారం ఇస్తారని ఆశిస్తున్నానంటూ రిక్వెస్ట్ చేశారు. ఆర్జీవీ. దీంతో.. తప్పకుండా త్వరలో కలుద్దాం అంటూ వర్మకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు మంత్రి పేర్ని నాని.

ఇప్పటికే కొన్నాళ్లుగా.. టాలీవుడ్-ఏపీ ప్రభుత్వానికి మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడుస్తోంది. థియేటర్ యాజమాన్యాలు.. ప్రొడ్యూసర్లు, సినీ ప్రముఖులు ప్రభుత్వ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సినీ ప్రముఖులు ఆరోపణలు చేయగా.. పొలిటికల్ లీడర్స్ రివర్స్ కామెంట్స్ చేయడంతో తీవ్ర దుమారం రేగింది. ఈ వ్యవహారం ముదురుతున్న వేళ.. ఆర్జీవీ-పేర్ని నాని ట్వీట్లు మంట పుట్టించాయి.

Rajya Sabha Members : ఈ ఏడాది పూర్తికానున్న 77 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం

అయితే.. టికెట్ రేట్ల సమస్య తీర్చేందుకు ఎవరు పెద్దోళ్లు.. పెద్దరికం ఎవరు తీసుకుంటారా? అని ఇన్నాళ్లూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ.. లీడ్ తీసుకుని ఇష్యూని ప్రభుత్వం ముందుంచడంలో తన మార్క్ చూపించారు రామ్ గోపాల్ వర్మ. కేవలం 24 గంటల్లోనే ట్విట్ వార్‌తో మలుపు తిప్పారు ఆర్జీవీ. మొత్తంగా ట్వీట్ల వ్యవహారం చర్చల వైపు మళ్లింది.