Speeds: డౌన్‌లోడింగ్‌లో జియో.. అప్‌లోడింగ్‌లో ఐడియా.. ఎయిర్‌టెల్‌పై విమర్శలు.. ట్రాయ్ నివేదిక

Speeds: డౌన్‌లోడింగ్‌లో జియో.. అప్‌లోడింగ్‌లో ఐడియా.. ఎయిర్‌టెల్‌పై విమర్శలు.. ట్రాయ్ నివేదిక

Vodafone Idea Behind Jio In Downloading Speeds In April

Internet Speeds in April: టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) లెక్కల ప్రకారం, రిలయన్స్ జియో 2021 ఏప్రిల్ నెలలో డౌన్‌లోడ్ వేగాన్ని అందించడంలో అగ్రస్థానంలో నిలిచింది. టెల్కో వొడాఫోన్ ఐడియా(VI) అప్‌లోడింగ్‌లో మాత్రం వేగవంతమైన అప్‌లోడ్ స్పీడ్ అందిస్తుంది. ఇతర టెల్కోలు అందించే వేగంతో పోల్చినప్పుడు జియో తన వినియోగదారులకు సుదీర్ఘ మార్జిన్ ద్వారా వేగవంతమైన నెట్‌వర్క్ అనుభవాన్ని అందిస్తుంది.

ఆపరేటర్లు వొడాఫోన్, ఐడియా సెల్యులార్ రెండూ వొడాఫోన్ ఐడియా లిమిటెడ్’గా విలీనమయినప్పటికీ రెండు సంస్థల నెట్వర్క్ స్పీడు ట్రాయ్ వేర్వురుగా వెల్లడిస్తుంది. పిటిఐ నివేదిక ప్రకారం, ఏప్రిల్‌లో జియో అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ వేగాన్ని అందించిందని, తరువాత వొడాఫోన్, ఐడియా మరియు చివరికి భారతి ఎయిర్‌టెల్ స్పీడ్ అందించినట్లుగా ట్రాయ్ తెలిపింది.

రిలయన్స్ జియో 20.1 ఎమ్‌బిపిఎస్ డౌన్‌లోడ్ వేగాన్ని అందిస్తోంది. తరువాత వోడాఫోన్ 7 ఎమ్‌బిపిఎస్ స్పీడ్‌ను అందిస్తోంది, ఐడియా మూడవ స్థానంలో 5.8 ఎమ్‌బిపిఎస్, ఎయిర్‌టెల్ 5 ఎమ్‌బిపిఎస్‌తో ఉన్నాయి. టెల్కో భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) అందించే వేగం గురించి నివేదికలో ఇవ్వలేదు. అప్‌లోడింగ్‌లో మాత్రం వోడాఫోన్.. మిగిలిన ఆపరేటర్ల కంటే చాలా ముందుంది. తరువాత ఐడియా, జియో చివరికి ఎయిర్‌టెల్ ఉన్నాయి.

వొడాఫోన్ వినియోగదారులకు అప్‌లోడ్ వేగం 6.7 ఎమ్‌బిపిఎస్, ఐడియా యూజర్లు అప్‌లోడ్ వేగం 6.1 ఎమ్‌బిపిఎస్ ఉంటుంది. మూడవ స్థానంలో రిలయన్స్ జియో 4.2 ఎమ్‌బిపిఎస్ అప్‌లోడ్ వేగాన్ని అందిస్తుంది. ఎయిర్‌టెల్ 5 ఎమ్‌బిపిఎస్ నెమ్మదిగా అప్‌లోడ్ చేసే వేగాన్ని ఇచ్చింది.

డౌన్‌లోడ్ మరియు అప్‌లోడ్ వేగం రెండూ యూజర్ ఇంటర్నెట్ అనుభవంలో పాత్రను పోషిస్తాయి. TRAI నుండి వచ్చిన ఫలితాలు జియో పొందుతున్న అదనపు స్పెక్ట్రం ప్రయోజనాన్ని ప్రతిబింబిస్తున్నాయి. నాణ్యమైన నెట్‌వర్క్ గురించి ప్రగల్భాలు పలుకుతున్నప్పటికీ భారతీ ఎయిర్‌టెల్ వినియోగదారులకు తక్కువ డౌన్‌లోడ్, అప్‌లోడ్ వేగాన్ని అందిస్తుంది అని విమర్శిస్తున్నారు.