మస్ట్ రీడ్ : టిక్ టాక్ అంటే ఏంటి? భారత్ లో ఎందుకు బ్యాన్ చేశారు!

  • Published By: venkaiahnaidu ,Published On : April 17, 2019 / 09:48 AM IST
మస్ట్ రీడ్ : టిక్ టాక్ అంటే ఏంటి? భారత్ లో ఎందుకు బ్యాన్ చేశారు!

టిక్ టాక్.. ఇప్పుడు భారతదేశంలో బాగా వినిపిస్తున్న పేరు. అసలు ఏంటీ టిక్ టాక్? దీన్ని ఎవరు కనిపెట్టారు? దీని వెనక ఉన్న ఉద్దేశ్యమేమిటి? దీన్ని బ్యాన్ చేయాలని దేశవ్యాప్తంగా నిరసనలు ఎందుకు వ్యక్తమవుతున్నాయో తెలుసుకుందాం.

టిక్ టాక్ అంటే ఏమిటి?

మోస్ట్ పాపులర్ వీడియో షేరింగ్ యాప్ లలో టిక్ టాక్ ఒకటి. చైనీస్ ఇంటర్నెట్ టెక్నాలజీ కంపెనీ “బైటీ డ్యాన్స్”టిక్ టాక్ ను డెవలప్ చేసింది. 2016లో డౌయిన్ పేరుతో ఇది చైనాలో లాంఛ్ అయింది. చైనాలో లాంఛ్ అయిన ఏడాది తర్వాత అంతర్జాతీయ మార్కెట్లలోకి టిక్ టాక్ పేరుతో ఈ యాప్ ప్రవేశించింది. టిక్ టాక్ యాప్ ద్వారా యూజర్లు స్పెషల్ ఎఫెక్ట్స్ తో వీడియోలు క్రియేట్ చేయవచ్చు, షార్ట్ వీడియోలు షేర్ చేయవచ్చు.

ముఖ్యంగా భారత్ లో టిక్ టాక్ యాప్ చాలా పాపులర్. మార్కెట్లోకి ప్రవేశించిన కొద్దికాలంలోనే ఎక్కువ మంది యూజర్లను ఎట్రాక్ట్ చేసింది. సెన్సర్ టవర్ అనే యాప్ విశ్లేషణ సంస్థ లెక్కల ప్రకారం.. భారత్ లో ఫిబ్రవరి-2019లో 24కోట్ల టిక్ టాక్ యాప్ డౌన్ లోడ్ అయింది. జనవరి-2019లో ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నవారి కంటే ఇది 3 కోట్లు ఎక్కువ. నెలనెలా ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకునేవారి సంఖ్య అమాంతం పెరుగుతూ వచ్చింది. అయితే నెట్టింట్లో ఇంతటి ఆదరణ ఉన్న ఈ యాప్ ను ఎందుకు బ్యాన్ చేయాల్సి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.

భారత్ లో టిక్ టాక్ బ్యాన్ ఎందుకు?
వీడియో షేరింగ్ యాప్ అయిన టిక్ టాక్ కు భారత్ లో ఆదరణ ఎక్కువ. టిక్ టాక్ యాప్ ఫ్లాట్ ఫాంపై యూజర్లు ఎక్కువగా జోక్స్ క్లిప్స్, వీడియో సాంగ్స్ కు తగ్గట్లుగా లిప్ మూమెంట్, బాడీ మూమెంట్స్ ఇవ్వడం, డాన్స్ వేయడం వంటివి చేస్తుంటారు. వీటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అయితే ఈ యాప్ కంటెంట్ మాత్రం సరిగా లేదంటూ పలువురు వాదిస్తున్నారు. ఈ యాప్ ఫోర్నోగ్రఫీని ఎంకరేజ్ చేస్తుందని, చైల్డ్ యూజర్లను సెక్సువల్ ప్రిడేటర్స్(వేటాడేవాళ్లు) టార్గెట్ చేసే ప్రమాదముందని హెచ్చరిస్తూ కేంద్రప్రభుత్వం వెంటనే ఈ యాప్ ను బ్యాన్ చేయాలని ఏప్రిల్-3, 2019న తమిళనాడు కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను అమలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆపిల్, గూగుల్ కి లేఖలు రాసింది.

కోర్టు ఆదేశాల ప్రకారం బుధవారం(ఏప్రిల్-17,2019) గూగుల్, ఆపిల్.. మొబైల్ యాప్ స్టోర్ల నుంచి టిక్ టాక్ ను తొలగించింది. భారత్ లో ప్రస్తుతం గూగుల్. ఆపిల్ స్టోర్స్ లో టిక్ టాక్ యాప్ అందుబాటులో లేదు. అయితే ఇప్పటికే టిక్ టాక్ ఇన్ స్టాల్ చేసుకున్న యూజర్లు వీడియోలను యధావిధిగా అప్ లోడ్ చేసుకోవచ్చు. 

టిక్ టాక్ యాప్ నిషేధంపై తమిళనాడు కోర్టు ఆదేశాలను తప్పుబడుతూ గతవారం సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో తదుపరి విచారణను ఏప్రిల్-24,2019కి సుప్రీం వాయిదా వేసింది.