ఇదిగో కొత్త ఫీచర్ : WhatsApp Webలో గ్రూపుడ్ స్టిక్కర్లు 

  • Published By: sreehari ,Published On : November 23, 2019 / 02:02 PM IST
ఇదిగో కొత్త ఫీచర్ : WhatsApp Webలో గ్రూపుడ్ స్టిక్కర్లు 

ప్రముఖ మెసేంజర్ యాప్ తమ యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ వచ్చింది. అదే.. Grouped Stickers ఫీచర్. మొబైల్ వెర్షన్ వాట్సాప్ యూజర్లు ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్ ల్లో స్టిక్కర్లను ఒకరి నుంచి మరొకరికి పంపుకునే వీలుంది.

ఇప్పటివరకూ చిన్న స్ర్కీన్ డివైజ్‌ల్లో మాత్రమే వాట్సాప్ స్టిక్కర్లను పంపుకునే వీలుంది. వాట్సాప్ వెబ్‌లో కూడా గ్రూపుడ్ స్టిక్కర్లను పంపుకునేలా కొత్త ఫీచర్ పై కంపెనీ వర్క్ చేస్తున్నట్టు రిపోర్టులు తెలిపాయి. వాట్సాప్ వెబ్ యూజర్ల కోసం గ్రూపుడ్ స్టిక్కర్ ఫీచర్ అందుబాటులోకి వచ్చేసినట్టు ఓ నివేదిక తెలిపింది. 

WABetaInfo ప్రకారం.. వాట్సాప్ వెబ్ వెర్షన్‌లో గ్రూపుడ్ స్టిక్కర్లను ఎనేబుల్ చేసింది. మీరు పీసీలో వాట్సాప్ వెబ్ వాడుతున్నట్టుయితే మీరు పంపిన రెండు స్టిక్కర్లను ఒకేచోట చూడవచ్చు. ఇలాంటి స్టిక్కర్లనంటిని చాట్ విండోలో సేవింగ్ స్పెస్ ఉండేలా ఫీచర్ పనిచేస్తుంది.

అదే స్పెస్ లో మరింత కంటెంట్ కూడా ఉండేలా చూస్తుంది. ఎవరైనా యూజర్ టెక్స్ట్ ఎక్కువగా ఉంటే స్టిక్కర్లు పంపే సమయంలో ఎక్కువ టెక్స్ట్ కనిపిస్తుంది. రెండు స్టిక్కర్లను ఒకేసారి పంపినప్పుడు మాత్రమే ఈ ఫీచర్ వర్క్ అవుతుంది. 

ఒకవేళ రెండు కంటే ఎక్కువ స్టిక్కర్లు పంపితే వాట్సాప్ వెబ్ వెర్షన్ గ్రూపు ఆయా స్టిక్కర్లను గ్రూపుడ్ స్టిక్కర్లుగా కన్వర్ట్ చేస్తుంది. అప్పుడు మూడో స్టిక్కర్ మరో లైనులోకి మారుతుంది. అసలు ఈ గ్రూపుడ్ ఫీచర్ వర్క్ అవుతుందో లేదో తెలుసుకోవాలంటే వాట్సాప్ వెబ్ బ్రౌజర్లను రీలోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది.

ఇప్పటికే వాట్సాప్ లోని స్మార్ట్ ఫోన్లలో గ్రూపుడ్ స్టిక్కర్స్ ఫీచర్ అందుబాటులోకి వచ్చేసింది. ఇటీవల ఆండ్రాయిడ్ ఫోన్లలో యూజర్ల ప్రైవసీ కోసం కొత్త ఫీచర్ ను వాట్సాప్ ప్రవేశపెట్టింది. ఫింగర్ ఫ్రింట్ అన్ లాక్ ఫీచర్ ద్వారా వాట్సాప్ యూజర్లు తమ ఆండ్రాయిడ్ ఫోన్లలో చాట్ మరింత సెక్యూర్ గా ఉంచుకోవచ్చు.