Whatsapp Messages : మీ వాట్సాప్‌లో ఫోన్ నెంబర్ సేవ్ చేయకుండానే ఇలా ఈజీగా మెసేజ్ పంపుకోవచ్చు తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

Whatsapp Messages : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp)లో అనేక సరికొత్త ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపుకోవడమే కాదు..

Whatsapp Messages : మీ వాట్సాప్‌లో ఫోన్ నెంబర్ సేవ్ చేయకుండానే ఇలా ఈజీగా మెసేజ్ పంపుకోవచ్చు తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

Whatsapp Messages _ Here's how you can send WhatsApp messages without saving phone numbe

Whatsapp Messages : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp)లో అనేక సరికొత్త ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపుకోవడమే కాదు.. వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు. అంతే కాదు, స్టేటస్ వంటి ఫీచర్లతో వినియోగదారులు తమ కాంటాక్ట్‌లతో షేర్ చేసుకోవచ్చు.

అయితే వాట్సాప్ పేమెంట్స్ కేవలం కొన్ని సెకన్లలో ఎవరికైనా నగదు పంపడానికి UPI పేమెంట్ గేట్‌వేని అందిస్తాయి. WhatsApp యూజర్లకు అవసరమైన అన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మరిన్ని ఫీచర్లు ఇంకా టెస్టింగ్ దశలో ఉన్నాయి. వాట్సాప్ ఇప్పటికీ సేవ్ చేయని కాంటాక్టులకు కూడా మెసేజ్ పంపడానికి యూజర్లను అనుమతిస్తుంది.

వాట్సాప్‌లో ఎవరికైనా మెసేజ్ పంపాలంటే ముందుగా వారి నంబర్‌ను సేవ్ చేసి తర్వాత మాత్రమే మెసేజ్ చేయాలి. ఆ వాట్సాప్ నంబర్‌ను సేవ్ చేయకుండా వారికి మెసేజ్ పంపగల సామర్థ్యాన్ని అందించే ప్రత్యేకమైన ఫీచర్ ఏదీ వాట్సాప్ నుంచి అందుబాటులో లేదు. మీరు సేవ్ చేయకూడదనుకునే కాంటాక్టులకు మెసేజ్ పంపడానికి వాటిని ఉపయోగించే కొన్ని టిప్స్ అందుబాటులో ఉన్నాయి. మీ ఫోన్ కాంటాక్ట్ లిస్ట్‌లో సేవ్ చేయకుండానే వాట్సాప్‌లోని ఏ నంబర్‌కైనా మెసేజ్ పంపడానికి 5 మార్గాలు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..

వాట్సాప్ సెల్ఫ్ చాట్ విండోను ఉపయోగించి ఫోన్ నంబర్‌ను సేవ్ చేయకుండా WhatsApp మెసేజ్ ఇలా పంపవచ్చు..

– WhatsApp యాప్‌ను ఓపెన్ చేయండి.
– ఇప్పుడు టాప్ రైట్ కార్నర్‌లో ఉన్న సెర్చ్ ఐకాన్ Tap చేయండి.
– కాంటాక్టులలో లేదా సెర్చ్ బాక్సులో ‘Message to yourself’ చాట్ ఆప్షన్ ఎంచుకోండి. ‘You’ అని టైప్ చేయండి.
– సేవ్ చేయని ఫోన్ నంబర్‌ను మీ ‘self chat’ విండోలో రాయండి లేదా Paste చేయండి.
– మెసేజ్ పంపిన తర్వాత, నంబర్ బ్లూ కలర్‌లో కనిపిస్తుంది.
– ఇప్పుడు ఆ నంబర్‌పై Tap చేసి Chat with అనే ఆప్షన్ ఎంచుకోండి.
– ఆ నంబర్‌తో కూడిన చాట్ విండో ఓపెన్ అవుతుంది. మీరు ఆ కాంటాక్టును ఎంచుకోవచ్చు.

Read Also : Jio Valentines Day Offer : జియో వ్యాలెంటైన్స్ డే ఆఫర్.. ఈ ప్రీపెయిడ్ ప్లాన్లపై ఫ్రీగా 87GB డేటా, మరెన్నో బెనిఫిట్స్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

Note : మీరు మెసేజ్ చేయాలనుకుంటున్న నంబర్ WhatsAppలో ఉందో లేదో చెక్ చేసుకోండి.

Whatsapp Messages _ Here's how you can send WhatsApp messages without saving phone numbe

Whatsapp Messages _ Here’s how you can send WhatsApp messages

గ్రూప్ చాట్ ద్వారా ఫోన్ నంబర్‌ను సేవ్ చేయకుండా WhatsApp మెసేజ్ పంపుకోవచ్చు :

– వాట్సాప్ గ్రూప్ చాట్‌ను ఓపెన్ చేయండి. అందులో మీరు టెక్స్ట్ చేయాలనుకుంటున్న యూజర్ కూడా సభ్యుడిగా ఉండాలి.
– మీరు టెక్స్ట్ చేయాలనుకుంటున్న నంబర్‌ను ఓపెన్ చేసేందుకు కిందికి స్క్రోల్ చేయండి. ఆపై Tap చేయండి.
– పాప్ అప్ విండోలో ‘Message’ ఆప్షన్ ఎంచుకోండి.
– ఆ యూజర్‌తో చాట్ విండో ఓపెన్ అవుతుంది.

వెబ్ బ్రౌజర్‌ని ఉపయోగించి ఫోన్ నంబర్‌ను సేవ్ చేయకుండా WhatsApp మెసేజ్‌లను పంపండి.
– మీ ఫోన్‌లో వెబ్ బ్రౌజర్‌ని ఓపెన్ చేయండి.

– ‘http://wa.me/91xxxxxxxxx’ లింక్‌ని టైప్ చేసి రిజిస్టర్ చేయండి. (ప్రారంభంలో కంట్రీ కోడ్‌ (+91)తో ఫోన్ నంబర్‌ను ‘XXXXX’లో టైప్ చేయండి, ఉదా- “https://wa.me/991125387“.

– మీరు WhatsApp స్క్రీన్‌కి రీడైరెక్ట్ అవుతారు. ఆ నంబర్‌తో చాట్ విండోను ఓపెన్ చేయడానికి ‘Continue Chat’ గ్రీన్ బటన్‌పై Click చేయండి.

Truecallerని ఉపయోగించి ఫోన్ నంబర్‌ను సేవ్ చేయకుండా WhatsApp మెసేజ్ పంపుకోవచ్చు :
మీరు ట్రూకాలర్‌ని ఉపయోగిస్తుంటే.. కాంటాక్ట్ నంబర్‌ను సేవ్ చేయకుండా నేరుగా ఏదైనా సేవ్ చేయని కాంటాక్ట్‌కు మెసేజ్ చేసేందుకు యాప్ అనుమతిస్తుంది.

– మీ ఫోన్‌లో Truecaller యాప్‌ని ఓపెన్ చేయండి.
– మీరు చాట్ చేయాలనుకుంటున్న యూజర్ ఫోన్ నంబర్‌ను టైప్ చేసి సెర్చ్ చేయండి.
– Truecaller యూజర్ ప్రొఫైల్‌ను ఓపెన్ చేస్తుంది.
– ప్రొఫైల్ కిందిభాగంలో కిందికి స్క్రోల్ చేయండి. ఆపై వాట్సాప్ బటన్‌పై Tap చేయండి.
– వాట్సాప్ చాట్ విండో ఓపెన్ అవుతుంది.

ఐఫోన్‌లో ఫోన్ నంబర్‌ను సేవ్ చేయకుండానే WhatsApp మెసేజ్ పంపండి.
– మీ iPhoneలో Apple షార్ట్‌కట్‌ల యాప్‌ను ఓపెన్ చేయండి.
– ‘Add shortcut’ బటన్‌పై Tap చేయండి.
– నాన్-కాంటాక్ట్ షార్ట్‌కట్‌కు WhatsAppని ఇన్‌స్టాల్ చేయండి.
– ఇన్‌స్టాలేషన్ తర్వాత అమలు చేయడానికి దానిపై Tap చేయండి.
– ‘Choose recipient’ అనే పాప్-అప్ కనిపిస్తుంది.
– ‘Choose recipient’ లో కంట్రీ కోడ్ (+91-)తో నంబర్‌ను టైప్ చేయండి.
– WhatsApp చాట్ ఓపెన్ అవుతుంది. మీరు ఆ కాంటాక్టుకు ఈజీగా మెసేజ్ పంపవచ్చు.

Read Also : Poco X5 Pro Sale : భారత్‌లో పోకో X5 ప్రో ఫోన్ సేల్ మొదలైందోచ్.. ఈ 5G ఫోన్ ఎందుకు కొనాలంటే? ఇదిగో మూడు కారణాలు..!