WhatsApp: పది రోజుల తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సప్ పని చేయదు.. పూర్తి లిస్ట్ ఇదే!

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు మినిమస్ సిస్టమ్ రిక్వైర్‌మెంట్స్‌ని అప్‌డేట్ చేస్తూ ఉంటుంది.

WhatsApp: పది రోజుల తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సప్ పని చేయదు.. పూర్తి లిస్ట్ ఇదే!

WhatsApp self-chat

WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు మినిమస్ సిస్టమ్ రిక్వైర్‌మెంట్స్‌ని అప్‌డేట్ చేస్తూ ఉంటుంది. ఈ అప్‌డేట్ తర్వాత, కొన్ని స్మార్ట్‌ఫోన్‌లలో WhatsApp అందుబాటులో ఉండదని చెబుతున్నారు.

WhatsApp లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. ఈ ఏడాది నవంబర్ 1వ తేదీ నుంచి కొన్ని స్మార్ట్‌ఫోన్‌ల.. ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటి పాత వెర్షన్‌లు నిలిచిపోనున్నాయి. ఆండ్రాయిడ్ OS 4.1 దానికంటే పై వెర్షన్, అలాగే iOS 10 అంతకంటే పెద్ద వెర్షన్ స్మార్ట్‌ఫోన్ ఉన్నవారు మాత్రమే వాట్సప్ యాప్ మెసేజింగ్ యాప్‌ని ఉపయోగించుకునే అవకాశం ఉంది.

ఈ అప్‌డేట్ తర్వాత, ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని ప్రధాన మార్పులు కనిపిస్తాయి. 4.0.4 లేదా అంతకంటే తక్కువ వెర్షన్ నడుస్తున్న పాత Android పరికరాల్లో WhatsApp అందుబాటులో ఉండదని Facebook ప్రకటించింది. WhatsApp Android 4.1 (లేదా అంతకంటే ఎక్కువ), iOS 10 (లేదా అంతకంటే ఎక్కువ), KaiOS 2.5.0 (లేదా అంతకంటే ఎక్కువ) నడుస్తున్న స్మార్ట్‌ఫోన్‌లలో మాత్రమే వాట్సప్ పని చేస్తుంది.

దీని కారణంగా, LG Optimus L5, LG Optimus L7, Motorola Atrix 2, Motorola Droid 4, Motorola Razr V, Samsung Galaxy S Duos, Samsung Galaxy Y Plus, Sony Ericsson Xperia Arc S, Sony Xperia neo వంటి పరికరాల్లో WhatsApp పనిచేయదు.

నవంబర్ 1వ నుంచి ఈ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు:

ఐ ఫోన్:
ఐఫోన్ 6 ఎస్
ఐఫోన్ 6 ఎస్ ప్లస్
ఆపిల్ ఐ ఫోన్ ఎస్ఈ

శామ్‌సంగ్:
శామ్‌సంగ్ గెలాక్సీ ట్రెండ్ లైట్
గెలాక్సీ SII
గెలాక్సీ ట్రెండ్ II
గెలాక్సీ ఎస్ 3 మినీ
గెలాక్సీ కోర్
గెలాక్సీ Xcover 2
గెలాక్సీ ఏస్ 2

LG:
ఎల్జీ లూసిడ్ 2
ఆప్టిమస్ L5 డ్యూయల్
ఆప్టిమస్ L4 II డ్యూయల్
ఆప్టిమస్ F3Q
ఆప్టిమస్ F7
ఆప్టిమస్ F5
ఆప్టిమస్ L3 II డ్యూయల్
ఆప్టిమస్ F5
ఆప్టిమస్ L5
ఆప్టిమస్ L5 II
ఆప్టిమస్ L3 II
ఆప్టిమస్ L7
ఆప్టిమస్ L7 II డ్యూయల్
ఆప్టిమస్ L7 II
ఆప్టిమస్ F6
ఆప్టిమస్ F3
ఆప్టిమస్ L4 II
ఆప్టిమస్ L2 II
ఆప్టిమస్ నైట్రో HD మరియు 4X HD

ZTE
ZTE గ్రాండ్ S ఫ్లెక్స్
గ్రాండ్ X క్వాడ్ V987
ZTE V956
గ్రాండ్ మెమో

హువావే
ఎస్సేండ్ G740
ఎస్సేండ్ D క్వాడ్ XL
ఎస్సేండ్ మాటే
ఎస్సేండ్ P1 S
ఎస్సేండ్ D2
ఎస్సేండ్ D1 క్వాడ్ XL