Xiaomi 12T Series : షావోమీ నుంచి రెండు కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!

Xiaomi 12T Series : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) వచ్చే వారం రెండు కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయనుంది. Xiaomi 12T, Xiaomi 12T Pro సిరీస్‌ రానున్నాయి. ప్రస్తుతానికి, చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు అక్టోబర్ 4 న గ్లోబల్ మార్కెట్‌లో మాత్రమే ఈ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయనుంది.

Xiaomi 12T Series : షావోమీ నుంచి రెండు కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!

Xiaomi 12T and 12T Pro is launching next week, here’s everything we know so far

Xiaomi 12T Series : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) వచ్చే వారం రెండు కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయనుంది. Xiaomi 12T, Xiaomi 12T Pro సిరీస్‌ రానున్నాయి. ప్రస్తుతానికి, చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు అక్టోబర్ 4 న గ్లోబల్ మార్కెట్‌లో మాత్రమే ఈ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయనుంది. అదే రోజున కంపెనీ రెడ్‌మి టాబ్లెట్‌ను (Redmi Tablet) డివైజ్ కూడా భారత మార్కెట్లో లాంచ్ చేయాలని యోచిస్తోంది. రాబోయే Xiaomi 12T సిరీస్ స్మార్ట్‌ఫోన్ల గురించి కంపెనీ వెల్లడించనప్పటికీ.. డివైజ్ ఫీచర్లు లీకయ్యాయి. ఇటీవల Xiaomi 12T, 12T రెండర్‌లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఈ డిజైన్‌‌తో కొన్ని ముఖ్య ఫీచర్లను వెల్లడించాయి.

Xiaomi 12T స్పెసిఫికేషన్స్ (అంచనా) :
రెండర్‌ల ప్రకారం చూస్తే.. Xiaomi 12T, 12T డిజైన్ పరంగా ఒకేలా ఉంటాయి. రెండింట్లో ప్రధాన మార్పు హార్డ్‌వేర్ ఫ్రంట్‌లో ఉండనుంది. లీక్‌ల పరంగా పరిశీలిస్తే.. Xiaomi 12T మీడియాటెక్ డైమెసిటీ 8100 చిప్‌సెట్, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరాతో 108-MP ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో రానుంది. రాబోయే Xiaomi 12T కొన్ని ఇతర ఫీచర్లలో 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్టుతో 6.7-అంగుళాల OLED డిస్‌ప్లే అందించనుంది.

Xiaomi 12T and 12T Pro is launching next week, here’s everything we know so far

Xiaomi 12T and 12T Pro is launching next week, here’s everything we know so far

Xiaomi 12T, 12T Pro రెండూ బాక్స్‌ల్లో ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5000mAh బ్యాటరీతో వస్తాయని లీక్స్ వెల్లడించాయి. ఇక Pro మోడల్ 129W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుందని, అయితే స్టాండర్డ్ మోడల్ బాక్స్‌లో 67W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుందని లీక్ డేటా వెల్లడించింది.

Xiaomi 12T Pro స్పెసిఫికేషన్స్ (అంచనా) :
షావోమీ ప్రో మోడల్ ఫీచర్లు కూడా లీక్ అయ్యాయి. దీని ప్రకారం.. Xiaomi 12T Pro Qualcomm Snapdragon 8+ Gen 1 SoC ద్వారా పనిచేస్తుంది. 1220 x 2712 పిక్సెల్‌లతో 6.67-అంగుళాల AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 200-MP శాంసంగ్ HP1 ప్రైమరీ రియర్ కెమెరాతో పాటు 8-MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 2-MP మాక్రో లెన్స్‌తో వస్తుంది.

Xiaomi 12T and 12T Pro is launching next week, here’s everything we know so far

Xiaomi 12T and 12T Pro is launching next week, here’s everything we know so far

ఈ రెండు రాబోయే Xiaomi ఫోన్‌లు రెండు వేరియంట్‌లలో వస్తాయని లేటెస్ట్ నివేదికలు తెలిపాయి. Xiaomi 12T బేస్ మోడల్ 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్‌తో వస్తుంది. ఈ ఫోన్ టాప్-ఎండ్ మోడల్ 8GB RAM + 256GB స్టోరేజ్‌తో వస్తుంది. Xiaomi 12T ప్రో కూడా రెండు వేరియంట్‌లలో రానుంది. 8GB RAM + 256GB స్టోరేజీ, 12GB RAM + 256GB స్టోరేజీతో రానుంది.

WATCH :  10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Xiaomi 11T Pro : రాబోయే దీపావళికి అమెజాన్, ఎంఐ సేల్‌లో బిగ్ డిస్కౌంట్లు.. షావోమీ 11T Pro ఫోన్‌పై భారీ తగ్గింపు!