Xiaomi 11T Pro : రాబోయే దీపావళికి అమెజాన్, ఎంఐ సేల్‌లో బిగ్ డిస్కౌంట్లు.. షావోమీ 11T Pro ఫోన్‌పై భారీ తగ్గింపు!

Xiaomi స్నాప్‌డ్రాగన్ 888 పవర్‌తో Xiaomi 11T Pro టాప్ మోడల్ డిస్కౌంట్ ధరకే అందుబాటులోకి రానుంది. రాబోయే దీపావళి Mi సేల్ సందర్భంగా Xiaomi 11T Pro భారీ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఫోన్ బేస్ 8GB RAM, 128GB స్టోరేజ్ ఆప్షన్ ధర రూ. 39,999 నుంచి రూ. 28,999కి సేల్ అందిస్తోంది.

Xiaomi 11T Pro : రాబోయే దీపావళికి అమెజాన్, ఎంఐ సేల్‌లో బిగ్ డిస్కౌంట్లు.. షావోమీ 11T Pro ఫోన్‌పై భారీ తగ్గింపు!

Xiaomi 11T Pro with 108MP camera, 120W charging to get big discount during upcoming Amazon, Mi sales

Xiaomi 11T Pro : చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం Xiaomi స్నాప్‌డ్రాగన్ 888 పవర్‌తో Xiaomi 11T Pro టాప్ మోడల్ డిస్కౌంట్ ధరకే అందుబాటులోకి రానుంది. రాబోయే దీపావళి Mi సేల్ సందర్భంగా Xiaomi 11T Pro భారీ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఫోన్ బేస్ 8GB RAM, 128GB స్టోరేజ్ ఆప్షన్ ధర రూ. 39,999 నుంచి రూ. 28,999కి సేల్ అందిస్తోంది. ICICI, Kotak, BoB, IndusInd SBI బ్యాంక్ ఆఫర్‌లు ఉన్నాయని Xiaomi తెలిపింది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ల వంటి డీల్‌లు కూడా అందించనుంది.

Xiaomi 11T Pro with 108MP camera, 120W charging to get big discount during upcoming Amazon, Mi sales

Xiaomi 11T Pro with 108MP camera, 120W charging to get big discount 

అంతేకాదు.. సెప్టెంబరు 23న Mi దీపావళి సేల్, వచ్చే గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ (Amazon Great India Festival Sale) సమయంలో Amazonలో అదే ధరకు లభించనుంది. ఈ సేల్ సమయంలో డివైజ్ ధరలో మార్పులు ఉండే అవకాశం ఉంది. Xiaomi 11T Pro వంటి ప్రీమియం ఫోన్‌లు కూడా సేల్ మొదటి రోజు లేదా రెండవ రోజున స్టాక్ అయిపోయే అవకాశం ఉంది. ముందుగానే వినియోగదారులు తమ కార్డ్ వివరాలను సేవ్ చేయవచ్చు. Xiaomi 11T Pro రెండు వేరియంట్‌లు (8GB RAM + 256GB, 12GB RAM + 256GB స్టోరేజ్) వేరియంట్‌లు కూడా నిలిచిపోయే అవకాశం ఉంది.

ప్రస్తుతం.. ఈ రెండు ఫోన్‌లు వరుసగా రూ. 36,999, రూ. 38,999 ధరలను కలిగి ఉన్నాయి. బేస్ 6GB మోడల్ ఇప్పటికే రూ. 34,999 ధర తగ్గింపుతో అందుబాటులో ఉంది. Xiaomi 11T ప్రో ధర రూ. 28,999కు డిస్కౌంట్ అందుబాటులో ఉండనుంది. గేమింగ్ డివైజ్ కోరుకునే వినియోగదారులు Xiaomi 11T Pro ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు.

Xiaomi 11T Pro with 108MP camera, 120W charging to get big discount during upcoming Amazon, Mi sales

Xiaomi 11T Pro with 108MP camera, 120W charging to get big discount 

ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో రోజువారీ వర్క్ చేసుకోవచ్చు. కెమెరా సిస్టమ్ కూడా అందించనున్నారు. Xiaomi 11T Pro మంచి డిస్‌ప్లే పనితీరు, పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 888 SoC, లౌడ్‌స్పీకర్‌లు, కెమెరాలు, వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీని అందించిందని భావిస్తున్నారు. స్పెసిఫికేషన్ల పరంగా.. స్మార్ట్‌ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది. దాదాపు 20 నిమిషాల్లో బ్యాటరీని ఫిల్ చేస్తుంది. వెనుకవైపు, ఫోన్ 108-MP ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

Read Also : Redmi Note 11T Pro : రెడ్‌మి నుంచి కొత్త Note 11T Pro 5G స్మార్ట్‌ఫోన్లు.. ఫీచర్లు, ధర ఎంతంటే?