Redmi Note 11 Series : రెడ్‌మీ నుంచి Note 11 సిరీస్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

షావోమీ సబ్‌బ్రాండ్ రెడ్‌మీ నుంచి Note 11 సిరీస్ వచ్చేసింది. ఫీచర్లు అదుర్స్.. రెడ్ మి నోట్ 11 సిరీస్ మూడు వేరియంట్లలో లాంచ్ అయింది.

Redmi Note 11 Series : రెడ్‌మీ నుంచి Note 11 సిరీస్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

Xiaomi Launches Redmi Note 11, Redmi Note 11 Pro And Redmi Note 11 Pro+, Price Starts

Redmi Note 11 Series : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ సబ్‌బ్రాండ్ రెడ్‌మీ నుంచి Note 11 సిరీస్ వచ్చేసింది. ఫీచర్లు అదుర్స్.. చైనాలో ఈ రోజే (అక్టోబర్ 28) ఆన్ లైన్ ఈవెంట్లో లాంచ్ అయింది. భారత మార్కెట్లో Redmi Note 11 ధర కూడా ఎంత ఉండోచ్చు ముందుగానే అంచనా వేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ యూజర్లు ఎదురుచూస్తున్న రెడ్ మి నోట్ 11 సిరీస్ మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. అయితే ఈ ఫోన్ లాంచింగ్ ముందే ఫీచర్లు, ధర వివరాలు లీక్ అయ్యాయి. Redmi Note 11, Redmi Note 11pro, Redmi Note 11Pro Plus స్పెసిఫికేష‌న్లు, ఫీచర్లు యూజర్లను ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఈ మూడు వేరియంట్లలో ఫీచర్లు, ధర గురించే టాక్ నడుస్తోంది. Redmi Note 11 సిరీస్ అన్ని ఫోన్లు 120Hz డిస్‌ప్లేతో పాటు 5000mAh బ్యాట‌రీతో వచ్చేశాయి. Redmi Note 11, 4GB RAM plus, 128GB ప్రారంభ ధర సుమారు రూ.14వేల నుంచి ఉండనుంది. 6GB ప్ల‌స్ 128GB, 8GB ప్ల‌స్, 128GB, 8GB ప్ల‌స్ 256GB వేరియంట్ల‌లోనూ లభించనుంది.

Redmi Note 11 బేసిక్ వేరియంట్ ప్రారంభ ధర CNY 1199 (రూ.14,000) 4GB RAM, 128GB స్టోరేజీ వేరియంట్, 6GB RAM, 128GB స్టోరేజీ వేరియంట్ CNY 1299 (రూ.15,200). 8GB RAM, 128GB స్టోరేజీ వేరియంట్ CNY 1499 (రూ.17,500), 8GB RAM, 256GB స్టోరేజీ వేరియంట్ CNY 1699 (రూ.19,800) వరకు ఉండనుంది.
UltimaSMS : గూగుల్‌ ప్లే స్టోర్‌లో 150 డేంజరస్ యాప్స్ బ్యాన్..!

Redmi Note 11 Pro ప్రారంభ ధర CNY 1599, 6GB ప్ల‌స్ 128GB వేరియంట్ ధ‌ర రూ.18,700 వరకు ఉంటుంది. 8GB ప్ల‌స్ 128GB వేరియంట్ ధ‌ర రూ.21వేలు, 8GB ప్ల‌స్ 256GB ధ‌ర రూ.23,400గా ఉండ‌నుంది. Redmi Note 11pro ప్ల‌స్ ఫోన్ ధ‌ర 8GB ప్ల‌స్ 128GB వేరియంట్ ధ‌ర‌ రూ.25,700గా ఉండ‌నుంది. 8GB ప్ల‌స్ 256GB మోడ‌ల్ ధ‌ర రూ.29,200గా ఉంటుందని తెలుస్తోంది.

Redmi Note 11 స్పెషిఫికేషన్లు, ఫీచర్లు ఇవే :
6.5 ఇంచ్ ఫుట్ HD Plus LCD, 120Hz రీఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ విక్ట‌స్ ప్రొటెక్ష‌న్, ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 810SoC ప్రాసెస‌ర్‌, 50MP రియర్ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా, Wi-Fi, బ్లూటూత్‌, GPS‌, USB Type-C పోర్ట్‌, 5000mAh బ్యాట‌రీ, 33 వాట్స్ చార్జింగ్ స‌పోర్ట్ లాంటి ఫీచ‌ర్లు Redmi Note 11లో ఉండ‌నున్నాయి.

Redmi Note 11pro ఫీచర్లు :
AMOLED డిస్‌ప్లే, 120Hz రీఫ్రెష్ రేట్‌, ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 920SoC ప్రాసెస‌ర్‌, ట్రిపుల్ రేర్ కెమెరా సెట‌ప్‌,108MP సామ్‌సంగ్ ప్రైమ‌రీ సెన్సార్‌,16MP సెల్ఫీ కెమెరా, 5000mAh బ్యాట‌రీ, 67 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ లాంటి ఫీచ‌ర్లు రెడ్‌మీ నోట్ 11 ప్రోలో లభించనున్నాయి.

Redmi Note 11pro Plus ఫీచర్లు :
120Hz ఫ్లెక్సిబుల్ AMOLED డిస్‌ప్లే, ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200AI SoC, ట్రిపుల్ రేర్ కెమెరా సెట‌ప్‌, 108MP ప్రైమ‌రీ శాంసంగ్ HM‌2 సెన్సార్‌,16MP సెల్ఫీ కెమెరా లాంటి ఫీచ‌ర్ల‌తో రెడ్‌మీ నోట్ 11pro ప్ల‌స్ రిలీజ్ కానుంది. ఇకపోతే.. రెడ్‌మీ నోట్ 11 సిరీస్ అక్టోబ‌ర్ 28న చైనాలో రిలీజ్ అయింది. ఆ తర్వాత ప్ర‌పంచ‌వ్యాప్తంగా అన్ని స్మార్ట్ ఫోన్ల మార్కెట్లోకి లాంచ్ కానుంది.

120Hz AMOLED డిస్‌ప్లే, 360Hz టచ్ శాంపిలింగ్ రేట్, మీడియా టెక్ డైమెన్షిటీ 1200 AI ప్రాసెసర్, 8GB LPDDR4x RAM, 256GB UF స్టోరేజీ. 16MP సెల్ఫీ కెమెరా, 4500mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఫోన్ ఛార్జింగ్ 0 నుంచి 100 శాతం 15 నిమిషాల్లోనే ఫుల్ అయిపోతుంది. JBL స్పీకర్లు, Dolby Atoms సపోర్టు కూడా అందిస్తోంది.
Redmi Smart TV: ఈ నెలలోనే విడుదల.. అదిరిపోయే ఫీచ‌ర్లు, ధర ఎంతంటే..