Cars Delivery: ఈ కార్ల డెలివరీ కోసం నెలల తరబడి వెయిట్ చేయాల్సిందే.. ఏ కారు కోసం ఎన్ని నెలలంటే?

దేశంలో కొన్ని కార్లకు అత్యధిక డిమాండ్ ఉంటోంది. ఇష్టపడి కొందామంటే మార్కెట్లో దొరకని పరిస్థితి. ఆ వాహనాలు కావాలంటే ముందుగా అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని నెలలకు డెలివరీ ఇస్తారు.

Cars Delivery: ఈ కార్ల డెలివరీ కోసం నెలల తరబడి వెయిట్ చేయాల్సిందే.. ఏ కారు కోసం ఎన్ని నెలలంటే?

Cars Delivery: కొన్ని కార్లు ఎప్పుడు కావాలంటే అప్పుడే షోరూమ్‌కు వెళ్లి డైరెక్ట్‌గా కొనుక్కోవచ్చు. కొన్నింటికి కొద్ది రోజులు ఆగాల్సి ఉంటుంది. ఇంకొన్నింటికి వారాలు ఎదురు చూడాలి. అయితే, కొన్ని కార్ల కోసం మాత్రం రోజులు, వారాలు కాదు… నెలల తరబడి వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు డబ్బులు కట్టి ఆర్డర్ చేస్తే.. ఇంకొన్ని నెలల తర్వాత గానీ సొంతం చేసుకోవడం కుదరదు.

Delhi Woman: మహిళను ఎత్తుకెళ్లి ఐదుగురి సామూహిక అత్యాచారం.. ఢిల్లీలో మరో నిర్భయ తరహా ఘటన

కొన్ని కార్ల డెలివరీకి అంత సమయం పడుతోంది. దేశంలో అత్యధిక కాలం వెయిటింగ్ పీరియడ్ ఉన్న కార్లు ఇవే. మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ నుంచి లేటెస్ట్‌గా విడుదలైంది ‘మహీంద్రా స్కార్పియో ఎన్’. దీన్ని సొంతం చేసుకోవాలంటే అత్యధికంగా కనీసం 21 నెలలు ఆగాల్సిందే. ఎందుకంటే ఇప్పటికే లక్షకుపైగా కార్లు బుక్ అయ్యాయి. వీటిని డెలివరీ చేయాలంటే దాదాపు రెండేళ్లు పట్టొచ్చని కంపెనీ వర్గాల అంచనా. ఆ తర్వాత మహీంద్రా సంస్థ నుంచి వచ్చిన ఎస్‌యూవీ వాహనం ‘మహీంద్రా ఎక్స్‌యూవీ 700’. దీని కోసం ఏడాదిన్నర వెయిట్ చేయాలి. ముఖ్యంగా ఈ వెహికిల్ డీజిల్ వెర్షన్ అయితే చాలా కాలం పట్టొచ్చు. కియా నుంచి వచ్చిన బెస్ట్ సెల్లింగ్ యుటిలిటీ వెహికల్ ‘కియా కారెన్స్’. దీని కోసం కనీసం 11 నెలలు ఎదురు చూడాలి.

Solar Eclipse: ఈ నగరాల్లోనే సూర్యగ్రహణం.. హైదరాబాద్‌లో కనిపిస్తుందా? ఈసారి మిస్సైతే మళ్లీ పదేళ్ల తర్వాతే!

ఆ తర్వాత హోండా సిటీ హైబ్రిడ్ కారు కోసం కనీసం 10 నెలలు ఆగాలి. మారుతి సంస్థ నుంచి విడుదలైన ‘ఎర్టిగా సీఎన్‌జీ’ మోడల్ కోసం కూడా కనీసం 10 నెలలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత హ్యూండయ్ కంపెనీ నుంచి వచ్చిన క్రెటా కారు కోసం 9 నెలలు, ఇదే కంపెనీ నుంచి వచ్చిన వెన్యూ కారు కోసం 7 నెలలు ఆగాలి. ఇక టొయొటా సంస్థ నుంచి వచ్చిన అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వాహనం కోసం 6 నెలలు ఎదురు చూడాలి. మహీంద్రా నుంచి వచ్చిన థార్ కోసం కనీసం 6 నెలలు ఎదురు చూడాలి. ఈ వాహనాలను కూడా ముందుగా బుక్ చేసుకున్న వారికి ప్రాధాన్యం ప్రకారం డెలివరీ ఇస్తారు.