Google Mapsలో COVID-19 data చూడొచ్చు..!

  • Published By: sreehari ,Published On : September 5, 2020 / 02:40 PM IST
Google Mapsలో COVID-19 data చూడొచ్చు..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసులు మరణాలు పెరిగిపోతున్నాయి.. భారత్ సహా ఏయే దేశాల్లో ఎన్ని కరోనా కేసులు, మరణాలు నమోదయ్యాయో సంబంధిత వెబ్ సైట్లలో చూస్తున్నాం.. ఇకపై గూగుల్ మ్యాప్స్ లో కూడా కరోనా కేసుల డేటా కనిపించనుంది. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సర్వీసుల్లో ఒకటైన Google Mapsలో కోవిడ్ డేటాను చేర్చనుంది.



అతి త్వరలో ఈ డేటాను యూజర్లు నేరుగా గూగుల్ మ్యాప్స్ ద్వారా చూడొచ్చు.. కరోనా సంబంధించి వివరాలన్నింటిని కూడా యాక్సస్ చేసుకోవచ్చు. ఇప్పటికే కొన్ని దేశాల్లో గూగుల్ కోవిడ్-19 సంబంధిత స్థానిక సమాచారం, అప్ డేట్స్ మ్యాప్స్ ద్వారా అందిస్తోంది.. గూగుల్ మ్యాప్స్ లో కోవిడ్-19 డేటా లేయర్ ఒకటి యాడ్ చేయనుంది.. కోవిడ్-19 ఇన్ఫో లేయర్ ద్వారా యూజర్లు మహమ్మారి ప్రభావిత ప్రాంతాలను చూడొచ్చు..



Wikipedia, The New York Times, John Hopkins University, Brihanmumbai Municipal Corporation లాంటి డేటా సోర్సుల నుంచి లక్ష మంది వరకు కొత్త కేసుల డేటాను కూడా యాక్సస్ చేసుకోవచ్చు. ఈ కొత్త లేయర్ ద్వారా అందించే కోవిడ్ డేటా ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్యను సూచిస్తుందా లేదా అనేది స్పష్టత లేదు. కొన్ని ప్రాంతాల్లో గూగుల్ మ్యాప్స్ కోవిడ్ సంబంధిత స్థానిక సమాచారంతో పాటు అప్ డేట్స్ అందిస్తోంది. లింక్స్ కూడా అందిస్తోంది.



COVID-19 health facilities అని కూడా యూజర్లు గూగుల్ మ్యాప్స్ లో సెర్చ్ చేయొచ్చు. అలాగే కొన్ని దేశాల్లో ప్రాంతాల్లోని పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అలర్ట్ వంటి అంశాలను కూడా తెలుసుకోవచ్చు. ప్రస్తుతానికి గూగుల్ మ్యాప్స్ లో COVID-19 Info లేయర్ యాక్సస్ చేసుకోలేరు.. గూగుల్ ఎప్పుడు ఈ ఫీచర్ రిలీజ్ చేస్తుందో క్లారిటీ లేదు. ఈ ఏడాది చివరిలో గూగుల్ మ్యాప్స్ లో ఈ కొత్త లేయర్ యాడ్ అయ్యే అవకాశం ఉంది.