తెలంగాణలో మే 17 నుంచి పదో తరగతి పరీక్షలు

తెలంగాణలో మే 17 నుంచి పదో తరగతి పరీక్షలు

10th class exams start in Telangana from May 17 : తెలంగాణలో పదో తరగతి పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి. మే 17 నుంచి 26 వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు జరుగునున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రామచంద్రన్ శనివారం (జనవరి 23, 2021) ఉత్తర్వులు జారీ చేశారు.

ఫిబ్రవరి 1 వ తేదీ నుంచి 9, 10వ తరగతుల విద్యార్థులకు పాఠాలు ప్రారంభం కానునున్నాయి. పరీక్షలు ముగిసిన మరుసటి రోజైన మే 27 నుంచి జూన్ 13 వరకు వేసవి సెలవులు ప్రకటించారు.

పదో తరగతి పరీక్షల విధానంలో కీలక మార్పులు చేశారు. గతంలో ఆరు సబ్జెక్టులకు 11 పరీక్షలు నిర్వహించేవారు కానీ ఈసారి కేవలం ఆరు సబ్జెక్టులకు మాత్రమే పదో తరగతి పరీక్షలు జరుగున్నాయి. నాలుగు ఎఫ్ ఏ టెస్టులకు గానూ రెండు ఎఫ్ ఏ టెస్టులను మాత్రమే నిర్వహిస్తారు.

మొదటి ఎఫ్ఏను మార్చి 15న, రెండో ఎఫ్ ఏను ఏప్రిల్ 15న నిర్వహిస్తారు. సమ్మెటివ్ మే 7 నుంచి 13 మధ్యలో సమ్మెటివ్ అసెస్మెంట్ నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల 50 వేల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు.