Munugode ByElection Results: మునుగోడు ఉపపోరులో పుంజుకున్న బీఎస్పీ.. డీలాపడ్డ కేఏ పాల్‌, నోటాకు ఎన్ని ఓట్లంటే?

మునుగోడు ఉప ఎన్నికల్లో నేనే గెలుస్తానంటూ మొదటి నుంచి హల్ చల్ చేసిన ప్రశాంతి పార్టీ అధ్యక్షుడు, స్వతంత్ర అభ్యర్థి ఆనంద్ కిలారి (కేఏ) పాల్ కు వెయ్యి ఓట్లుకూడా రాలేదు. ఎన్నికల సంఘం పాల్‌కు ఉంగరం గుర్తును కేటాయించింది. ఈ గుర్తుపై కేవలం 805 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.

Munugode ByElection Results: మునుగోడు ఉపపోరులో పుంజుకున్న బీఎస్పీ.. డీలాపడ్డ కేఏ పాల్‌, నోటాకు ఎన్ని ఓట్లంటే?

Munugode ByPol

Munugode ByElection Results: మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య నువ్వానేనా అన్నట్లుగా సాగిన పోరులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సర్వీస్ ఓట్లతో కలిపి 10,309 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి 86,485 ఓట్లు రాగా, టీఆర్ఎస్ అభ్యర్థికి 96,598 ఓట్లు వచ్చాయి. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో టీఆర్ఎస్ పార్టీ అధిక్యాన్ని ప్రదర్శించింది. ఇక కాంగ్రెస్ పార్టీకి ఆ నియోజకవర్గంలో తొలిసారి తక్కువ ఓట్లు వచ్చాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 48.9శాతం ఒట్లు పొందిన కాంగ్రెస్ ఈ సారి 10.6 శాతానికి దిగజారింది. ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి కేవలం 23,864 ఓట్లు రాగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలిపి 23,906 ఓట్లు వచ్చాయి.

Munugode Bypoll Results: ‘సెమీఫైనల్‌’లో టీఆర్ఎస్ సక్సెస్.. ఇక ఫోకస్ అంతా ‘ఫైనల్‌’పైనే

ఈ ఉప ఎన్నికల్లో నేనే గెలుస్తానంటూ మొదటి నుంచి హల్ చల్ చేసిన ప్రశాంతి పార్టీ అధ్యక్షుడు, మునుగోడు ఉప పోరులో స్వతంత్ర అభ్యర్థి ఆనంద్ కిలారి (కేఏ) పాల్ కు వెయ్యి ఓట్లుకూడా రాలేదు. ఎన్నికల సంఘం పాల్ కు ఉంగరం గుర్తును కేటాయించింది. ఈ గుర్తుపై కేవలం 805 ఓట్లు మాత్రమే పాల్ కు వచ్చాయి. ప్రచార సమయంలో పలు రకాల వృత్తులకు చెందిన వేషధారణల్లో పాల్ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. పోలింగ్ రోజు పోలింగ్ బూత్ ల వద్ద సందడి చేశారు. కౌంటింగ్ సమయంలోనూ గెలిచేది నేనే అంటూ చెప్పుకున్న పాల్.. విజయోత్సవ ర్యాలీకి పోలీసుల పర్మీషన్ కూడా అడిగి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.

Munugode Bypoll Results: మరోసారి నిజమైన ఎగ్జిట్ పోల్స్.. ఏ సంస్థ ఏం చెప్పిందంటే..?

మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికలో నోటాకు 482 ఓట్లు పోలయ్యాయి. 2018 ఎన్నికల్లో నోటాకు 3,086 ఓట్లు వచ్చాయి. అప్పటితో పోల్చుకుంటే బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పోరు తీవ్రస్థాయిలో ఉండటంతో నోటాకు ఈదఫా తక్కువ ఓట్లు పోలయ్యాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు రాజ్యాధికారం సాధనే లక్ష్యంగా మునుగోడు బరిలోకి దిగిన బీఎస్పీ(బహుజన సమాజ్ పార్టీ) అభ్యర్థి అందోజు శంకరాచారి ఏనుగు గుర్తుకు 4,146 ఓట్లు పోలయ్యాయి. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారథ్యంలో నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. 2014లో ఈ పార్టీ అభ్యర్థికి కేవలం 1,084 ఓట్లు, 2018లో కేవలం 738 ఓట్లు మాత్రమే వచ్చాయి. వీటితో పోల్చుకుంటే ఈ ఉప ఎన్నికల్లో బీఎస్పీకి ఆశించిన స్థాయిలో ఓట్లు వచ్చాయనే చెప్పొచ్చు.