Munugode Bypoll Results: ‘సెమీఫైనల్‌’లో టీఆర్ఎస్ సక్సెస్.. ఇక ఫోకస్ అంతా ‘ఫైనల్‌’పైనే

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఏడాదే ముందస్తు ఎన్నికలకు వెళతారని, అందుకోసం అన్ని ఏర్పాట్లూ చేసుకుంటారని అందరూ భావించారు. కానీ, ఇంతవరకూ కేసీఆర్ ఆ నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఇంతలో కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. బీజేపీ తరఫున మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేశారు. తెలంగాణలో తదుపరి అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ గా ఈ ఎన్నికను అందరూ భావిస్తున్నారు.

Munugode Bypoll Results: ‘సెమీఫైనల్‌’లో టీఆర్ఎస్ సక్సెస్.. ఇక ఫోకస్ అంతా ‘ఫైనల్‌’పైనే

Munugode Bypoll Results: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఏడాదే ముందస్తు ఎన్నికలకు వెళతారని, అందుకోసం అన్ని ఏర్పాట్లూ చేసుకుంటారని అందరూ భావించారు. కానీ, ఇంతవరకూ కేసీఆర్ ఆ నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఇంతలో కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. బీజేపీ తరఫున మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేశారు. తెలంగాణలో తదుపరి అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ గా ఈ ఎన్నికను అందరూ భావిస్తున్నారు.

నిజానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది డిసెంబరులోగా జరగాల్సి ఉంది. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారన్న ఊహాగానాలు ఇప్పటికీ ఉన్నాయి. సెమీఫైనల్ గా భావిస్తున్న మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ సక్సెస్ అయింది. ఇకపై ఫోకస్ అంతా ‘ఫైనల్’పై పెట్టనుంది. అంటే తదుపరి అసెంబ్లీ ఎన్నికల పైనే టీఆర్ఎస్ దృష్టి సారించనుంది.

ఒక్క టీఆర్ఎస్ మాత్రమే కాదు.. బీజేపీ, కాంగ్రెస్ సహా మిగిలిన అన్ని పార్టీల దృష్టి అంతా ఇకపై తదుపరి అసెంబ్లీ ఎన్నికలపైనే ఉండనుంది. సెమీఫైనల్ లో టీఆర్ఎస్ గెలుపుతో బీజేపీ దూకుడుకి కాస్త అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే దుబ్బాక, హుజూరాబాద్ లో ఉప ఎన్నికలతో ఫుల్ జోష్ మీద ఉన్న బీజేపీ మునుగోడులోనూ గెలిస్తే తెలంగాణలో తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో మరింత దూకుడుగా వెళ్లవచ్చని భావించింది.

అయితే, చివరకు నిరాశే మిగిలింది. మునుగోడులో గెలిస్తే సంబరాలు చేసుకుంందామని ఏర్పాట్లు చేసుకున్న ఆ పార్టీ కార్యకర్తల్లో నిరుత్సాహం నెలకొంది. ఇక మునుగోడులో ఉన్న ఎమ్మెల్యేనూ ఇప్పటికే దూరం చేసుకున్న కాంగ్రెస్ ఆ స్థానంలో మళ్ళీ గెలవకపోవడంతో ఆ పార్టీలో మరింత నిరాశ నిండుకుంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..