Ameerpet Metro Station: అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ లో ఇదీ పరిస్థితి.. కేటీఆర్ కు ప్రయాణికుడి ట్వీట్

అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ లో ఏం జనంరా బాబాయ్ అంటున్నారు మెట్రో ప్రయాణికులు. ట్రైన్ ఎక్కడానికి, దిగడానికి ప్రయాణికులు కుస్తీ పట్టాల్సి వస్తోంది.

Ameerpet Metro Station: అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ లో ఇదీ పరిస్థితి.. కేటీఆర్ కు ప్రయాణికుడి ట్వీట్

Ameerpet Metro Station: కరోనా తర్వాత పరిస్థితులు చక్కబడడంతో వర్క్ ఫ్రం హోమ్ దాదాపుగా రద్దయింది. దీంతో ఉద్యోగులు కార్యాలయాల బాట పడుతున్నారు. సాఫ్ట్ వేర్ సంస్థలతో పాటు అన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ ఎత్తేయడంతో ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లక తప్పడం లేదు. ఉద్యోగులు ఆఫీసులకు వెళుతుండడంతో రవాణా వ్యవస్థ మునుపటి పరిస్థితికి చేరుకుంది. ముఖ్యంగా ప్రజా రవాణా వ్యవస్థ కళకళలాడుతోంది.

Ameerpet Metro Station Rush

ప్రయాణికులతో కిటకిటలాడుతున్న అమీర్‌పేట్ మెట్రో స్టేషన్

హైదరాబాద్ మెట్రో(heav) రైళ్లలో రద్దీ బాగా పెరిగింది. మెట్రో ఇంటర్ చేంజ్ గా ఉన్న అమీర్ పేట్ మెట్రో స్టేషన్ కిటకిటలాడుతోంది. అక్కడ రైలు దిగాలన్నా, ఎక్కాలన్నా ప్రయాణికులు ఎంతో కష్టపడాల్సి వస్తోంది. రద్దీ సమయాల్లో స్టేషన్ లోపలికి, వెలుపలికి రాకపోకలు సాగించడానికి ప్రయాస తప్పడం లేదు. ప్రయాణికులు కనీసం నిలబడటానికి కూడా చోటు దొరకడం లేదు. ఇదే విషయాన్ని ప్రయాణికుడొకరు మంత్రి కేటీఆర్ (KTR) దృష్టికి తీసుకొచ్చారు.

నగరం నడిబొడ్డున్న ఉన్న అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ కు అన్నివేళల్లోనూ ప్రయాణికుల తాకిడి ఉంటుంది. ముఖ్యంగా ఆఫీసు వేళల్లో రద్దీ చాలా ఎక్కువ. దీంతో ప్రయాణికులు రైలు ఎక్కడానికి, దిగడానికి చాలా కష్టపడాల్సి వస్తోంది. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ లో నిల్చోవడానికి కూడా చోటు సరిపోవకపోడంతో ఎస్కలేటర్(escalator) సహా మెట్లపై ప్రయాణికులు వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. రైలు ఎక్కడానికి వేచివున్న వారితో స్టేషన్ నిండిపోవడంతో రైలు నుంచి ప్రయాణికులు దిగడానికి కష్టపడాల్సి వస్తోంది.

Also Read: ఇవేం ఎండలు రా నాయనా.. తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు, అప్పుడే 40డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

లోకేంద్ర సింగ్ అనే వ్యక్తి ఇదే విషయాన్ని ట్విటర్ లో మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రయాణికులతో నిండిపోయిన అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ (Ameerpet Metro Station) ఫొటోలను ట్విటర్ లో షేర్ చేశారు. ప్రయాణికుల భద్రత కోసం అమీర్‌పేట్ స్టేషన్‌లో PSD (ప్లాట్‌ఫారమ్ స్క్రీన్ డోర్స్) వ్యవస్థ ఏర్పాటు చేయాలని కేటీఆర్ ను కోరారు. దీనిపై మంత్రి కేటీఆర్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.