TRS Minister : అందుకే శ్రీనివాస్ గౌడ్‌‌ని చంపాలనుకున్నా.. హత్యా ప్రయత్నం కేసులో సంచలనాలు

మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యాప్రయత్నం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాఘవేంద్రరాజు స్టేట్ మెంట్ లో విస్తుగొలిపే విషయాలున్నాయి. 2017 నుంచి నన్ను చంపేందుకు

TRS Minister : అందుకే శ్రీనివాస్ గౌడ్‌‌ని చంపాలనుకున్నా.. హత్యా ప్రయత్నం కేసులో సంచలనాలు

Srinivas Goud

TRS Minister Srinivas Goud : మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యాప్రయత్నం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాఘవేంద్రరాజు స్టేట్ మెంట్ లో విస్తుగొలిపే విషయాలున్నాయి. 2017 నుంచి నన్ను చంపేందుకు ప్రయత్నం చేశారని, తనను, తన కుటుంబాన్ని శ్రీనివాస్ గౌడ్ టార్గెట్ చేశారని వెల్లడించారు. వేధింపులు తట్టుకోలేకే శ్రీనివాస్ గౌడ్ ను చంపాలని అనుకున్నట్లు తెలిపారు. తనపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి వేధించారని ఆరోపించారు. శ్రీనివాస్ గౌడ్ తనపై 30 కేసులు పెట్టించారని, తనకున్న బార్ షాప్ ను మూసివేయించి ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. ఆర్థికంగా నష్టం చేయించడమే కాకుండా ఒక్కరోజే 10 కేసులు పెట్టించారని ఆరోపించారు. తనకు రూ. 6 కోట్లు నష్టం చేయించారని స్టేట్ మెంట్ లో రాఘవేంద్రరాజు వెల్లడించినట్లు సమాచారం.

Read More : Srinivas Goud : మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర.. రూ.15 కోట్లకు సుపారీ

మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ హత్యకు కుట్ర పన్నిన నాగరాజు, విశ్వనాథ్, యాదయ్యను అరెస్ట్ చేసినట్టు సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర ప్రకటించారు. మరో ప్రధాన నిందితుడు రఘు పరారీలో ఉన్నారని వివరించారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్యకు మధు సుధన్ రాజు, అమరేంద్ర రాజు 15 కోట్లను సుపారీ గ్యాంగ్‌కు ఆఫర్‌ చేశారని తెలిపారు స్టీఫెన్‌ రవీంద్ర. ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేశామన్నారు. రాఘవేందర్‌రాజు, మున్నూరు రవితో పాటు మరో ముగ్గురు ఢిల్లీలో ఉన్నట్టు ట్రేస్ చేశామన్నారు. ఢిల్లీలోని బీజేపీ నేత జితేందర్‌ రెడ్డి ఇంట్లో వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుల నుంచి రివాల్వర్, మొత్తం 6 రౌండ్ల బుల్లెట్స్‌ స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు యూపీ నుంచి ఆయుధాలు సమకూర్చుకున్నట్టు తెలిపారు స్టీఫెన్‌ రవీంద్ర.

Read More : Telangana : మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర.. పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌‌లో కీలక విషయాలు.

ఈ హత్య కుట్రలో జితేందర్ పాత్రపై విచారిస్తున్నట్టు స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. డీకే అరుణ అనుచరులపై కూడా అనుమానాలు ఉన్నాయన్నారు. హత్య కుట్రపై శ్రీనివాస్‌గౌడ్‌కు తెలియజేశామన్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారన్నారు.