Women’s Day: సీఎం కేసీఆర్ కు మహిళలంటే గౌరవం లేదు – బండి సంజయ్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. కర్మాన్ ఘాట్ వేదికగా జరిగిన ఈ వేడుకలో పాల్గొని జీహెచ్ఎంసీలో పనిచేస్

Women’s Day: సీఎం కేసీఆర్ కు మహిళలంటే గౌరవం లేదు – బండి సంజయ్

Bandi Sanjay

Women’s Day: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. కర్మాన్ ఘాట్ వేదికగా జరిగిన ఈ వేడుకలో పాల్గొని జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న మహిళా కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళలందరికీ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

‘మహిళలు ఎక్కడ గౌరవించబడతారో, పూజించబడతారో అక్కడ దేవతల సంచరిస్తారు. మహిళలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నా. కేసీఆర్ పాలనలో మహిళలకు రక్షణ లేదు. కేసీఆర్ మొదటి ప్రభుత్వంలో మహిళలకు మంత్రి పదవి ఇవ్వలేదు’

‘ఇప్పుడు ఇద్దరు మహిళలకు మాత్రమే మంత్రులుగా ప్రాతినిధ్యం కల్పించారు. వాళ్లకు ఎలాంటి అధికారాలు లేవు. రాష్ట్ర ప్రథమ పౌరురాలు గవర్నర్‌ను అవమానించారు. గుండా అయిన రౌడీ అయిన వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుండా అడ్డుకున్నందుకు గవర్నర్ మంచిది కాదంటున్నారు’

Read Also: తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనకు అడ్డుకట్టవేస్తాం: బీజేపీ బండి సంజయ్

‘సమ్మక్క సారలమ్మ జాతరకు గవర్నర్ వెళితే అధికారులు వెళ్లొద్దని సూచించారట సీఎం కేసీఆర్. రాష్ట్రంలో మహిళ గవర్నర్‌కు కూడా సీఎం కేసీఆర్ గౌరవం కల్పించలేకపోయారు. కేసీఆర్‌కు మహిళలంటే గౌరవం లేదు’ అని విమర్శలకు దిగారు బండి సంజయ్.