Etala Rajender : సింగరేణి ప్రైవేటీకరణపై చర్చకు రావాలని.. బీఆర్ఎస్ కు ఎమ్మెల్యే ఈటల సవాల్

ఆర్టీఐ కింద అధికారులు సమాచారం ఇవ్వటం లేదన్నారు. సింగరేణిలో మూడు మైన్స్ ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన మాట వాస్తవమని చెప్పారు.

Etala Rajender : సింగరేణి ప్రైవేటీకరణపై చర్చకు రావాలని.. బీఆర్ఎస్ కు ఎమ్మెల్యే ఈటల సవాల్

Etala Rajender (1)

Etala Rajender : సింగరేణి ప్రైవేటీకరణపై తనతో చర్చకు రావాలని బీఆర్ఎస్ కు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సవాల్ చేశారు. సింగరేణి లాభాల్లో ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు ఎందుకు బిడ్ చేయలేదో కేసీఆర్ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎక్కడో ఉన్న వైజాగ్ స్టీల్ ఫ్లాంట్ ను కాదు.. పేదలకు అండగా ఉండే తెలంగాణ ఆర్టీసీని కాపాడాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుణ్యాన నాలుగు వేల ఆర్టీసీ బస్సులు ఖతం అయ్యాయని విమర్శించారు. వైజాగ్ స్టీల్ ఫ్లాంట్ సంగతి సరే.. తెలంగాణ చెరుకు రైతుల‌ కోసం‌ నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఎందుకు తెరవటం లేదని ప్రశ్నించారు.

తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేంద్రం, బీజేపీపై బీఆర్ఎస్ నేతలు విషం కక్కుతున్నారని మండిపడ్డారు. సింగరేణి మైన్స్ ను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం మానుకోవాలని హితవు పలికారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేయబోమని రామగుండం గడ్డ మీద ప్రధాని మాటిచ్చారని గుర్తు చేశారు. నైనీ బ్లాక్, తాడిచర్ల మైన్స్ ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారని ఆరోపించారు. తెలంగాణలో సమాచార హక్క చట్టం అలంకారప్రాయంగా మారిందని ఎద్దేవా చేశారు.

Etala Rajender : సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

ఆర్టీఐ కింద అధికారులు సమాచారం ఇవ్వటం లేదన్నారు. సింగరేణిలో మూడు మైన్స్ ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన మాట వాస్తవమని చెప్పారు. సింగరేణి బాగుండాలనేదే కేంద్రంలో ఉన్న బీజేపీ‌ ఆకాంక్ష అని తెలిపారు. ఆర్టీసీ తరహాలో సింగరేణిలో కూడా కార్మిక సంఘాలు లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ కు చైతన్యం అన్న, ప్రశ్నించే వాళ్ళు అన్న, కార్మికులు అన్న నచ్చదని వెల్లడించారు.

మరోవైపు చేరికలపై ఈటల రాజేందర్ కామెంట్స్ చేశారు. పొంగులేటి, జూపల్లితో వంద శాతం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. తెలంగాణలో పురోగమిస్తోన్న పార్టీ బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. ఎక్కడ రాజకీయ భవిష్యత్ ఉంటే ఆ పార్టీలోనే నాయకులు చేరుతారని పేర్కొన్నారు. కేసీఆర్ పై పోరాడేది.. ప్రభుత్వంలోకి వచ్చేది బీజేపీనేనని స్పష్టం చేశారు.

Eatala Rajender: ఎన్నికలొస్తేనే కేసీఆర్‌కు ప్రజలు గుర్తుకొస్తారు.. మునుగోడు హామీల అమలేది: ఈటల రాజేందర్

కాంగ్రెస్, బీఆర్ఎస్ వేర్వేరు కాదు.. ఎన్నికల ముందైనా.. తర్వాతైనా రెండు పార్టీలు కలుస్తాయని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు కేసీఆర్ 25కోట్లు పంపించారని ఆరోపించారు. పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా అమిత్ షా చేవేళ్ళ సభలో పాల్గొంటారని వెల్లడించారు. దేశంలోని అన్ని పార్టీలకు ఎన్నికల ఖర్చు భరించేంత వేల కోట్లు ఎలా వచ్చాయో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.