Minister Harish Rao: మంత్రి హరీష్‌రావును కలిసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. పార్టీ మార్పు విషయంపై క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే
గోషామహల్ నియోజకవర్గంలో హాస్పిటల్ అభివృద్ధికోసం మంత్రి హరీష్‌రావును కలవడం జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు.

Goshamahal MLA Rajasingh
Gosamahal MLA Rajasingh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Rajasingh) వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు (Harish Rao) ను మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని హాస్పిటల్, తదితర వైద్య సదుపాయాల విషయంపై హరీష్ రావుతో కొద్దిసేపు చర్చించారు. అనంతరం రాజాసింగ్ మాట్లాడుతూ.. గోషా మహల్ నియోజకవర్గంలో హాస్పిటల్ అభివృద్ధికోసం మంత్రి హరీష్‌రావును కలవడం జరిగిందని చెప్పారు. గోశామహల్లోఉన్న హాస్పిటల్‌ను 30 పడకలు లేదా, 50 పడకలుగా అభివృద్ధి చేయాలని కోరడం జరిగిందని రాజాసింగ్ చెప్పారు.
నేను ఎమ్మెల్యేగా గెలిచిన నాటినుండి ఇప్పటి వరకు అడుగుతూనే ఉన్నా.. ఇప్పటికి ఇద్దరు ఆరోగ్య శాఖ మంత్రులను కలిశా, హరీష్ రావు మూడో మంత్రి అని రాజాసింగ్ అన్నారు. బీజేపీని వీడుతున్నారా అని రాజాసింగ్‌ను ప్రశ్నించగా.. నేను బీజేపీలోనే ఉంటాను. బీజేపీ సస్పెన్షన్ ఎత్తి వెయ్యక పోతే రాజకీయ సన్యాసం చేస్తా. అంతేకాని నేను పార్టీ మరను బీజేపీలోనే ఉంటా, ఇక్కడే చస్తాను అని రాజాసింగ్ చెప్పారు. హిందు దేశం కోసం నిత్యం పోరాటం చేస్తూనే ఉంటానని అన్నారు.