GVL Narasimharao: చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుంది: ఎంపీ జీవిఎల్

తెలంగాణలో టిఆర్ఎస్ ఉనికిని కొల్పతున్న తరుణంలో కేసీఆర్ జాతీయ స్థాయిలో 'డ్రామా రాజకీయలకు' తెరతీశారంటూ జీవీఎల్ విమర్శించారు

GVL Narasimharao: చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుంది: ఎంపీ జీవిఎల్

Gvl

GVL Narasimharao: జాతీయ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెసేతర కూటమి ఏర్పాటు చేయాలన్న తెలంగాణ సీఎం కేసీఆర్..ఆమేరకు గత కొన్ని రోజులుగా జాతీయ స్థాయి నేతలు, ఇతర ప్రాంతీయ పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఈక్రమంలో గత మూడు రోజులుగా ఢిల్లీ, పంజాబ్ లలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్..ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ తో సమావేశం అయ్యారు. ఇక సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. తెలంగాణలో టిఆర్ఎస్ ఉనికిని కొల్పతున్న తరుణంలో కేసీఆర్ జాతీయ స్థాయిలో ‘డ్రామా రాజకీయలకు’ తెరతీశారంటూ జీవీఎల్ విమర్శించారు. ఇలాంటి రాజకీయలనే గతంలో చంద్రబాబు అవలంబించి అధికారం కోల్పోయారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించిందో, ప్రస్తుతం టీఆర్ఎస్ కూడా అలానే వ్యవహరిస్తోందని అన్నారు.

Other Stories: Jagga reddy: మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడిన వ్యక్తికి రాజ్యసభ టిక్కెట్ ఎలా ఇస్తారా?

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశాలు లేకపోయినా..తామేదో చేస్తామనే బ్రమల్లో కేసీఆర్ ఉన్నారంటూ ఎంపీ జీవీఎల్ ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్ కు పడుతుందని తీవ్రంగా విమర్శించారు. సీఎం కేసీఆర్ స్వలాభం కోసం..రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో జాతీయ పర్యటనలు చేస్తున్నారని ఎంపీ జీవీఎల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో కొన్ని ప్రాంతీయ పార్టీల నేతలు..బీజేపీ రైతులకు వ్యతిరేకమని దుష్ప్రచారం చేశారని..యూపీలో రైతులు లేరా..యూపీలో బీజేపీ గెలిచిందని అన్నారు. బీజేపీ ప్రభుత్వంపై రైతులకు నమ్మకం ఉందని జీవీఎల్ అన్నారు. త్వరలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులు విజయం సాధిస్తారని ఎంపీ జీవీఎల్ ధీమా వ్యక్తం చేశారు.