Bandi Sanjay: రామరాజ్య స్థాపన కోసమే బీజేపీ 11 వేల కార్నర్ మీటింగ్స్: బండి సంజయ్

రామరాజ్యం‌ స్థాపన కోసమే బీజేపీ కార్నర్ మీటింగ్స్ నిర్వహించనుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. 15 రోజుల్లో 11 వేల కార్నర్ మీటింగ్స్ తో చరిత్ర సృష్టించబోతున్నామని తెలిపారు. బీజేపీ నేతల శిక్షణ తరగతుల్లో ఇవాళ బండి సంజయ్ మాట్లాడారు. కార్నర్ మీటింగ్స్ లో మోదీ విజయాలు, కేసీఆర్ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని అన్నారు. 80 శాతం హిందువులు బీజేపీకి ఓటు బ్యాంకుగా మారబోతున్నారని చెప్పారు.

Bandi Sanjay: రామరాజ్య స్థాపన కోసమే బీజేపీ 11 వేల కార్నర్ మీటింగ్స్: బండి సంజయ్

Bandi Sanjay: రామరాజ్యం‌ స్థాపన కోసమే బీజేపీ కార్నర్ మీటింగ్స్ నిర్వహించనుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. 15 రోజుల్లో 11 వేల కార్నర్ మీటింగ్స్ తో చరిత్ర సృష్టించబోతున్నామని తెలిపారు. బీజేపీ నేతల శిక్షణ తరగతుల్లో ఇవాళ బండి సంజయ్ మాట్లాడారు. కార్నర్ మీటింగ్స్ లో మోదీ విజయాలు, కేసీఆర్ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని అన్నారు. 80 శాతం హిందువులు బీజేపీకి ఓటు బ్యాంకుగా మారబోతున్నారని చెప్పారు.

బీజేపీ అధికారంలోకి వచ్చాక ఉచిత విద్య, వైద్యం అందిస్తామని బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో బీజేపీకి అధికారం ఇవ్వాలన్న చర్చ ప్రజల్లో నడుస్తుందని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ పట్ల కొందరు వ్యంగ్యంగా మాట్లాడారని, ఇప్పుడు పరిస్థితులు తమకు అనుకూలంగా మారాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరవయ్యారని చెప్పారు.

కాంగ్రెస్ కు ఓటు వేస్తే బీఆర్ఎస్ కు వేసినట్లేనని అన్నారు. కాంగ్రెస్ సీఎల్పీ హోల్ సేల్ గా బీఆర్ఎస్ కు అమ్ముడుపోయిందని చెప్పారు. బీఆర్ఎస్ తో బీజేపీ మాత్రమే రాజీలేని పోరాటం చేస్తోందని తెలిపారు. కార్యకర్తల త్యాగాల మీద ఏర్పడిన పార్టీ బీజేపీ అని చెప్పారు. ఉద్యోగాలకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వానిదని అన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాతో ఉమ్మడి పది జిల్లాల్లో పది భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోటీ చేయాలని ఎంఐఎంకు బండి సవాల్ విసిరారు. సెంటిమెంట్ ను అడ్డుపెట్టు అధికారంలోకి వచ్చిన పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. బీజేపీ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదని, బీజేపీ గురించి కేటీఆర్ కు ఏం తెలుసు? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఏర్పాటు చేయడంతో తెలంగాణకు, కేసీఆర్ కు బంధం తెగిపోయిందని అన్నారు.

ఎన్నికల హామీలు అమలు చేయకుండా.. పక్క రాష్ట్రాలకు వెళ్లే అర్హత కేసీఆర్ కు లేదని విమర్శించారు. కృష్ణా జలాలను ఆంధ్రకు అప్పగించిన చరిత్ర కేసీఆర్ దని అన్నారు. ఏడాది కాలంగా 15 భారీ బహిరంగ సభలు విజయవంతంగా నిర్వహించిన రికార్డు బీజేపీదని చెప్పారు. కలెక్టర్లపై బండి‌ సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు.

రాష్ట్రంలో నలుగురు కలెక్టర్లు తెలంగాణను దోచుకుంటున్నారని ఆరోపించారు. కొందరు కలెక్టర్లు కేసీఆర్ కుటుంబానికి ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. ప్రగతి భవన్ లో అన్ని పనులను కలెక్టర్లే చక్కదిద్దుతున్నారని చెప్పారు. అలాంటి కలెక్టర్ల వల్ల రాష్ట్రానికి చెడ్డపేరు వస్తుందని వ్యాఖ్యానించారు.

Jagan Sticker : ఇంటింటికీ జగన్ స్టికర్.. వైసీపీ ప్రభుత్వం మరో సరికొత్త, కీలక కార్యక్రమం