బ్రేకింగ్ న్యూస్ : కాంగ్రెస్ కు కూన శ్రీశైలం గౌడ్ గుడ్ బై

బ్రేకింగ్ న్యూస్ : కాంగ్రెస్ కు కూన శ్రీశైలం గౌడ్ గుడ్ బై

koona srisailam goud : తెలంగాణ కాంగ్రెస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. సీనియర్ నేతలు రాం రాం చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం తామేనని చెబుతున్న బీజేపీ పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఇప్పటికే కొంతమంది సీనియర్ నేతలు కాషాయ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. తాజాగా..మాజీ ఎమ్మెల్యే, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. 2021, ఫిబ్రవరి 21వ తేదీ ఆదివారం ఉదయం తన రాజీనామా లేఖను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు..పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఆయన బీజేపీలో చేరాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. బీజేపీ పెద్దలను కలిసేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లారని తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీకి బూస్టప్ ఇచ్చేందుకు సీనియర్ నేతలు పాదయాత్రలు చేపడుతున్న సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క పాదయాత్రలు చేపట్టారు. త్వరలోనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమౌతున్నారు. త్వరలోనే నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరుగుతున్న క్రమంలో..కూన శ్రీశైలం గౌడ్ రాజీనామా చేయడం హాట్ టాపిక్ అయ్యంది. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగిన ఈయన ఒక్కసారిగా ఈ నిర్ణయం తీసుకోవడంతో పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఇటీవలే జీహెచ్ఎంసీలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కార్యక్రమాల్లో కూన చురుకుగా పాల్గొన్నారు. ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, ప్రజా సమస్యలపై గళం విప్పడం లేదని నేతలు వెల్లడిస్తున్నారు.

ఇక కూన శ్రీశైలం గౌడ్ విషయానికి వస్తే…ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి..ఆయన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత..జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం చెందారు.