Cinema Theatres Open :100 శాతం ఆక్యుపెన్సీతో..తెలంగాణలో జులై 23 నుంచి థియేటర్లు ఓపెన్..

సినిమా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. కరోనా వల్ల మూతపడిన సినిమా థియేటర్లు తెరుచుకునేలా నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23 నుంచి సినిమా థియేటర్ల ఓపెన్ కానున్నాయి. అదీకూడా 100 శాతం ఆక్యుపెన్సితో ప్రారంభం అయ్యేలా అనుమతినిచ్చింది ప్రభుత్వం.

Cinema Theatres Open :100 శాతం ఆక్యుపెన్సీతో..తెలంగాణలో జులై 23 నుంచి థియేటర్లు ఓపెన్..

Cinema Theatres Open In Telangana

Cinema Theatres Open In Telangana: సినిమా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. కరోనా వల్ల మూతపడిన సినిమా థియేటర్లు తెరుచుకునేలా నిర్ణయం తీసుకుంది. దీంట్లో భాగంగా..తెలంగాణలో ఈ నెల 23 నుంచి సినిమా థియేటర్ల ఓపెన్ కానున్నాయి. అదీకూడా 100 శాతం ఆక్యుపెన్సితో ప్రారంభం అయ్యేలా అనుమతినిచ్చింది ప్రభుత్వం. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీతో ఓపెన్ చేస్తున్నట్లు తెలంగాణ సినిమా థియేటర్ల అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. జులై 23 నుంచి సినిమాల ప్రదర్శన చెయ్యాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 100 శాతం ఆక్యుపెన్సితో థియేటర్లు ప్రారంభం కానున్నాయి.

దీని కోసం రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో ఫిలించాంబర్ ప్రతినిధులు సమావేశమయ్యారు. కరోనా సెకండ్ వేవ్ తగ్గి కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతుండటంతో సినిమా హాళ్లను తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. టాలీవుడ్ సినీ నిర్మాతలకు తెలంగాణ ఎగ్జిబిటర్ల విజ్ఞప్తి మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. సినిమా థియేటర్ల పునఃప్రారంభానికి 100 శాతం సామర్థ్యంతో తిరిగి ప్రారంభించుకోవచ్చని స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటో మరో పక్క ఓటీటీ ఎగ్జిబిటర్స్‌ను నిద్రపోనివ్వకుండా చేస్తున్నాయి. పరిస్థితులను బట్టి నిర్మాతలు కూడా ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో థియేటర్‌ యజమానులు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో తమకు తీవ్ర నష్టం జరుగుతోందనీ..ఓటీటీలపై ఆంక్షలు విధిస్తే తప్ప థియేటర్స్‌ తెరవలేమని డిస్ట్రిబ్యూటర్లు వాపోతున్నారు. దీంతో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ హామీతో థియేటర్ల యజమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదిలా ఉంటే కరోనా సెకండ్ వేవ్ తగ్గిందని అనుకుంటున్న క్రమంలో కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని మళ్లీ మళ్లీ చూపుతునే ఉంది. ఇంకోపక్క థర్డ్ వేవ్ ముప్పు ముంచుకొస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈక్రమంలో థియేటర్లు ఓపెన్ చేస్తే అదికూడా 100శాతం ఆక్యుపెన్సీతో ఓపెన్ అయితే కరోనా వ్యాప్తికి మరింత ఆస్కారం ఇచ్చినట్లు అవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఆగస్టులో కరోనా థర్డ్ వేవ్ ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.