Azadi Ka Amrit Mahotsav : స్వాతంత్ర్య వజ్రోత్సవ దీప్తి గడప,గడపకు తెలిసేలా చేయాలి-సీఎం కేసీఆర్

అనేక మంది త్యాగాలతో మనకు స్వాతంత్య్రం వచ్చిందని, స్వాతంత్ర్య వజ్రోత్సవ దీప్తి ప్రతి గడపకు తెలిసేలా చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు నిచ్చారు.

Azadi Ka Amrit Mahotsav : స్వాతంత్ర్య వజ్రోత్సవ దీప్తి గడప,గడపకు తెలిసేలా చేయాలి-సీఎం కేసీఆర్
ad

Azadi Ka Amrit Mahotsav :  అనేక మంది త్యాగాలతో మనకు స్వాతంత్య్రం వచ్చిందని, స్వాతంత్ర్య వజ్రోత్సవ దీప్తి ప్రతి గడపకు తెలిసేలా చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు నిచ్చారు. ఈరోజు ఆయన హైదరాబాద్ హెచ్ఐసీసీలో స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన జాతీయ జెండాను ఎగుర వేసి, జెండావందనం చేశారు. ఆ తర్వాత భరతమాత, మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలవేశారు. అనంతరం జ్యోతిప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈసందర్భంగా జరిగిన కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడుతూ..

1948 సెప్టెంబర్ 17 న హైదరాబాద్ భారత దేశంలో విలీనం అయిందని…ఇప్పటికి  తెలంగాణను కొంతలో కొంత బాగు సుకున్నాం…ఇంకా పురోగమించాల్సిన అవసరం ఉందని అన్నారు. కమ్యూనిస్టుల సాయుధ పోరాటం నెగ్గకున్నా ప్రజల్లో చైతన్యాన్ని కలిగించిందని ఆయన అన్నారు. కొంత మంది గాంధీని కించ పర్చే వ్యాఖ్యలు చేస్తున్నారని అది దురదృష్ట కరం అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ బిడ్డ నికత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించటం అభినందనీయం.

దేశ భవిష్యత్తు కోసం మన మందరం పునరంకితం అవుదాం అని కేసీఆర్ చెప్పారు. స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ సేవలను కొనియాడారు. ‘అనేక త్యాగాలతో, అనేక పోరాటాలతో స్వాతంత్య్రాన్ని సముపార్జించి 75 సంవత్సరాలు స్వయంపాలనలో అప్రతిహాతంగా ముందుకుసాగుతున్న భారతావని. 75 సంవత్సరాలు రేపు రాబోయే 15వ తేదీకి పూర్తి చేసుకుంటుంది. సుదీర్ఘకాలం స్వయంపాలనలో సుసంపన్నమైన భారతదేశంలో తరాలు మారుతున్నాయ్‌. కొత్త తరాలు వస్తున్నాయ్‌. వారికి స్వాతంత్య్ర పోరాట సమయంలో జరిగిన సమరం, త్యాగాలు కొత్త తరానికి తెలియవు. ఎప్పటికప్పుడు సందర్భోచితంగా కొత్త తరం వారికి తెలియజేయడం పాతతరం వారి కర్తవ్యం, విధి’ అని అన్నారు.

ఇటువంటి స్వతంత్ర వజ్రోత్సవ దీప్తి.. వాడవాడల గ్రామగ్రామాన చాలా అద్భుతంగా జరగాలి. చాలా గొప్పగా ఎన్ని త్యాగాలతో,ఎన్ని రకాల పోరాటాలతో, వేదనలు.. ఆవేదనలతో స్వాతంత్య్రం వచ్చిందో ప్రతిగడపకు తెలిసేలా నిర్వహించాలి. జిల్లాలో మంత్రుల ఆధ్వర్యంలో కమిటీలు ఉన్నయ్‌. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ అధ్యక్షులు, మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, ఎంపీపీలు అందరు తమ పరిధిలో ఉజ్వలం నిర్వహించాలని, ఆ స్ఫూర్తిని ఈ వేదికగా మీరు పొంది తిరిగి మీ మీ గ్రామాలు, పట్టణాల్లో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించేందుకు రప్పించాం అని మనవి చేస్తున్నా’ అన్నారు. ‘ఏయే సందర్భంలో ఎవరు త్యాగాలు చేశారు, ఎన్ని రకాల పోరాటాలు చేశారు.. అలవోకగా తమ అసువులు, ఆయుష్షును దేశ స్వాతంత్య్రం కోసం ధారబోశారు.. మరణానికి వెనుకాడకుండా.. మడమ తిప్పకుండా పోరాటాలు చేశారు.. అలాంటి స్ఫూర్తి, త్యాగనీరతితో మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది’ అన్నారు.