చట్టం ప్రకారం పనిచేయకుంటే సర్పంచ్ పదువులు ఊడుతాయ్ : సీఎం కేసీఆర్ 

రాష్ట్రంలో చట్టం ప్రకారం పనిచేయకుంటే సర్పంచు పదవులు ఊడుతాయని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు ఫ్రేమ్ వర్క్ లో పనిచేయాలని లేకపోతే పదవులు పోతాయని..అందుకు చట్టం తీసుకొచ్చినట్లు తెలిపారు.

  • Published By: veegamteam ,Published On : March 13, 2020 / 07:41 AM IST
చట్టం ప్రకారం పనిచేయకుంటే సర్పంచ్ పదువులు ఊడుతాయ్ : సీఎం కేసీఆర్ 

రాష్ట్రంలో చట్టం ప్రకారం పనిచేయకుంటే సర్పంచు పదవులు ఊడుతాయని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు ఫ్రేమ్ వర్క్ లో పనిచేయాలని లేకపోతే పదవులు పోతాయని..అందుకు చట్టం తీసుకొచ్చినట్లు తెలిపారు.

రాష్ట్రంలో చట్టం ప్రకారం పనిచేయకుంటే సర్పంచు పదవులు ఊడుతాయని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు ఫ్రేమ్ వర్క్ లో పనిచేయాలని లేకపోతే పదవులు పోతాయని..అందుకు చట్టం తీసుకొచ్చినట్లు తెలిపారు. పల్లెప్రగతిపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులకు నిబంధనలు ఉంటాయన్నారు. 

ప్రజా ప్రతినిధులు చట్టం పరిధిలో పనిచేయాలన్నారు. ఎమ్మేల్యేలు, మంత్రులు, ఎంపీలు, ప్రధాని, ముఖ్యమంత్రి, రాష్ట్రపతి అందరికీ నిబంధనలు ఉంటాయన్నారు. ఎవరైనా రాజ్యాంగ పరిధిలో పని చేయాలన్నారు. ఇష్టారాజ్యంగా పనిచేస్తామంటే కుదరదన్నారు. ఓట్ల కోసం భయపడదల్చుకోలేదన్నారు. ఎన్నికల్లో ఏదిపడితే అది చెబితే ఓట్లు వచ్చే రోజులు పోయాయని తెలిపారు.

గ్రామాల్లో వందశాతం పన్నులు వసూలు చేయాల్సిందేనని అన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం టాక్సులు పెంచుతామని చెప్పారు. అందరికీ చెప్పిన తర్వాతే పన్నులు పెంచుతామని చెప్పారు. గ్రామాభివృద్ధికి చాలా మంది విరాళాలు ఇచ్చారని తెలిపారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల అభివృద్ధి చెందాలంటే ప్రాపర్టీ ట్యాక్సులు కొంత పెంచాలన్నారు. 

అందుకే పన్నులు పెంచబోతున్నామని చెప్పారు. పెంచిన డబ్బులు ప్రజల కోసమే వినియోగిస్తామని తెలిపారు. అడ్డదిడ్డంగా పెంచి పేదలకు ఇబ్బంది కలిగించబోమని చెప్పారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోతున్నామని చెప్పారు. దళితులు, గిరిజనులకు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పారు. 

See Also | కరోనా దెబ్బకు నెల్లూరులో జనం బేజారు